Google Pixel 11 : గూగుల్ పిక్సెల్ 11 సిరీస్- లాంచ్ నుంచి ఫీచర్లు, ధర వరకు..
Pixel 11 pro : టెక్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ శ్రేణి ‘పిక్సెల్ 11’ సిరీస్‌ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 2026లో విడుదల కానుందని అంచనా వేస్తున్న ఈ సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్స్ ఉంటాయి. వీటిపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
గూగుల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే న్యూస్! గూగుల్ తన తదుపరి తరం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్ ‘గూగుల్ పిక్సెల్ 11’ సిరీస్‌ని ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది! అధికారికంగా గూగుల్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, మార్చి నుంచే ఈ సిరీస్‌కు సంబంధించిన లీక్‌లు నెట్టింట సందడి చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి గూగుల్ మొత్తం నాలుగు వేరియంట్లను ఒకే సిరీస్ కింద తీసుకురానుంది. ఇందులో పిక్సెల్ 11 (స్టాండర్డ్), పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్లతో పాటు పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన లాంచ్, ధర, ఫీచర్స్పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్ ఎప్పుడు?
గత రెండేళ్ల లాంచ్ టైమ్‌లైన్‌ను పరిశీలిస్తే.. పిక్సెల్ 9 సిరీస్‌ను ఆగస్టు 13, 2024న, పిక్సెల్ 10 సిరీస్‌ను ఆగస్టు 20, 2025న గూగుల్ విడుదల చేసింది. ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఈ ఏడాది కూడా ఆగస్టు 2026 మధ్య లేదా చివరి వారంలో ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్ ద్వారా ఈ కొత్త ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్విటేషన్లు జులైలోనే వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, స్టాండర్డ్, ప్రో మోడళ్లు ఆగస్టులోనే మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. ఫోల్డబుల్ మోడల్ మాత్రం అక్టోబర్ 2026 లో విడుదల కావచ్చని సమాచారం.
మోడళ్ల వారీగా లీకైన స్పెసిఫికేషన్లు..
1. గూగుల్ పిక్సెల్ 11 :
డిస్‌ప్లే: 6.3-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
ప్రాసెసర్: గూగుల్ సరికొత్త ‘టెన్సర్ జీ6’ చిప్‌సెట్. ఇది 2ఎన్ఎం ప్రాసెస్ టెక్నాలజీపై తయారైన గూగుల్ తొలి చిప్ కావడం విశేషం.
కనెక్టివిటీ: శామ్‌సంగ్ మోడెమ్‌ల స్థానంలో మెరుగైన సిగ్నల్ కోసం సరికొత్త మీడియాటెక్ మోడెమ్‌ను వాడుతున్నారు.
ర్యామ్ అండ్ స్టోరేజ్: 8జీబీ లేదా 12జీబీ ర్యామ్ ఆప్షన్స్, 128జీబీ లేదా 256జీబీ స్టోరేజ్. (పిక్సెల్ 10 బేస్ మోడల్‌లో 12జీబీ ఉండగా, ఇందులో 8జీబీ వేరియంట్ తీసుకురావడంపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది).
కెమెరా: 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ + అల్ట్రావైడ్ లెన్స్.
బ్యాటరీ: 4,840ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం. కలర్స్: బ్లాక్, గ్రీన్, పింక్, పర్పుల్.
2. గూగుల్ పిక్సెల్ 11 ప్రో :
డిస్‌ప్లే: 6.3-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, స్మూత్ 1- 120హెచ్‌జెడ్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 2,450 నిట్స్ బ్రైట్‌నెస్.
ర్యామ్: 12జీబీ లేదా 16జీబీ ర్యామ్ ఆప్షన్లు.
కెమెరా: బాస్టెట్, బార్గెస్ట్ కోడ్‌నేమ్స్‌తో సరికొత్త మెయిన్, టెలిఫోటో సెన్సార్లు.
పిక్సెల్ గ్లో : ఈ ప్రో మోడల్‌లో పాత టెంపరేచర్ సెన్సార్ స్థానంలో కెమెరా బార్‌లో సరికొత్త ఆర్‌జీబీ (లైటింగ్ సిస్టమ్ 'పిక్సెల్ గ్లో'ను పరిచయం చేస్తున్నారు. ఫోన్ బోర్లా పెట్టినప్పుడు నోటిఫికేషన్ల కోసం ఇది లైట్లను బ్లింక్ చేస్తుంది.
బ్యాటరీ: 4,707ఎంఏహెచ్ బ్యాటరీ.
ధర (అంచనా): గత మోడల్ లాగే ఇది కూడా 999 డాలర్ల (సుమారు రూ. 94,300) బేస్ ప్రైస్‌తో రావచ్చు.
3. గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్ :
డిస్‌ప్లే: పెద్దదైన 6.8-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1 - 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2,450 నిట్స్ బ్రైట్‌నెస్.
ఫీచర్లు: ప్రో మోడల్‌లో ఉన్న టెన్సర్ జీ6, మీడియాటెక్ మోడెమ్, 12జీబీ/16జీబీ ర్యామ్, పిక్సెల్ గ్లో ఫీచర్లు ఇందులోనూ ఉంటాయి.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్: ఈ సిరీస్‌లోనే అతిపెద్దదైన 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 25డబ్లయూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
ధర (అంచనా): దీని ధర 1,199 డాలర్ల (సుమారు రూ. 1,13,000) నుంచి ప్రారంభం కావచ్చు.
4. గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ :
డిజైన్: గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ కంటే చాలా సన్నగా ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు 10.1ఎంఎం, విప్పినప్పుడు కేవలం 4.8ఎంఎం మందం ఉంటుంది.
స్క్రీన్: 8-ఇంచ్ మెయిన్ ఇన్నర్ స్క్రీన్ (120హెచ్‌జెడ్), 6.4-ఇంచ్ ఔటర్ కవర్ స్క్రీన్. కెమెరా: రీడిజైన్ చేసిన కెమెరా బంప్, ఇందులో ఫ్లాష్, మైక్రోఫోన్ కటౌట్‌లోనే ఇన్‌బిల్ట్‌గా వస్తాయి.
బ్యాటరీ: 4,658ఎంఏహెచ్ బ్యాటరీ.
ధర (అంచనా): మెమరీ చిప్‌ల ధరలు పెరగడం వల్ల దీని ధర మార్కెట్లో 1,699 డాలర్ల నుంచి గరిష్టంగా 2,000 డాలర్ల (సుమారు రూ. 1,60,000 - రూ. 1,88,000) వరకు ఉండవచ్చని సమాచారం.
అయితే, ఇవి లీక్స్ ఆధారంగా వచ్చిన సమాచారం అని గుర్తుపెట్టుకోవాలి. లాంచ్ నాటికి గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌కి సంబంధించిన వివరాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


