...
...
Next Story

Google Pixel 11 : గూగుల్​ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్- సరికొత్త ఫీచర్లతో! ధరలు ఇలా

గూగుల్ తన సరికొత్త పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను (పిక్సెల్ 11, ప్రో, ప్రో ఎక్స్‌ఎల్, ప్రో ఫోల్డ్) లాంచ్ చేసింది. టెన్సర్ జీ6 చిప్‌సెట్, అద్భుతమైన కెమెరాలు, అత్యాధునిక హైలైట్ ఫీచర్‌తో వస్తున్న ఈ ఫోన్ల ధరలు భారత్‌లో రూ. 89,999 నుంచి ప్రారంభమవుతున్నాయి.

Published on: Aug 13, 2026, 05:41:56 IST
Advertisement

గూగుల్ తన వార్షిక 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేదికపై కంపెనీ అత్యంత శక్తివంతమైన ‘గూగుల్ పిక్సెల్ 11’ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన పిక్సెల్ 10 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ న్యూ జెన్ ఫోన్లను గూగుల్ తీసుకువచ్చింది. ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా నాలుగు విభిన్న మోడళ్లతో ఈ సిరీస్‌ను మార్కెట్లోకి వదిలారు.

గూగుల్​ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్.. (Google)
గూగుల్​ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్.. (Google)

బేస్ మోడల్‌గా పిక్సెల్ 11 ఉండగా, దాదాపు ఒకే లాంటి ఫీచర్లతో స్క్రీన్ సైజులో స్వల్ప తేడాతో పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్ మోడళ్లను అందించారు. వీటితో పాటు గత ఏడాది వచ్చిన పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌కు సక్సెసర్‌గా పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్‌ను కూడా గూగుల్ పరిచయం చేసింది. మరింత వేగవంతమైన 2ఎన్​ఎం చిప్‌సెట్, తెలివైన కెమెరాలు, సరికొత్త ‘హైలైట్’ ఫీచర్‌తో ఈ గూగుల్ పిక్సెల్ స్మార్ట్​ఫోన్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌లోని ప్రతి మోడల్ గురించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 11: ప్రధాన ఫీచర్లు..

పిక్సెల్ 11 సిరీస్‌లో బేస్ మోడల్‌గా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల అక్చువా ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080 x 2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 120హెచ్​జెడ్ వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో కూడా గొరిల్లా గ్లాస్ రక్షణ ఉంది.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ కలిగి ఉంది. ఇందులో క్వాడ్ పీడీ, మక్రో ఫోకస్‌తో కూడిన 48ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉన్న 13ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) కలిగిన 10.8ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 95-డిగ్రీల వ్యూ ఉన్న 10.5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ క్యాప్చర్ వంటి అనేక కెమెరా ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. రెండు కెమెరాలు కూడా 60ఎఫ్​పీఎస్ వద్ద 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇది ఫ్రాస్ట్, పిస్తాషియో, హిబిస్కస్, ఆబ్సిడియన్ రంగులలో లభిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్ ప్రధాన ఫీచర్లు

పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్ మోడళ్లలో స్క్రీన్ సైజు మినహా దాదాపు అన్ని ఫీచర్లు ఒకేలా ఉంటాయి. రెండు ఫోన్లలోనూ టెన్సర్ జీ6 ప్రాసెసర్, టైటాన్ ఎం3 సెక్యూరిటీ చిప్, 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నాయి.

కెమెరాల విషయానికి వస్తే, వెనుక భాగంలో 50ఎంపీ వైడ్ లెన్స్, 48ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 48ఎంపీ టెలిఫోటో లెన్స్ (ఓఐఎస్ సపోర్ట్‌తో) ఉన్నాయి. ముందు భాగంలో 42ఎంపీ డ్యూయల్ పీడీ కెమెరా ఇచ్చారు. ఈ రెండు ఫోన్లు 30ఎఫ్​పీఎస్ వద్ద 8కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

తేడాలు ఇవే:

పిక్సెల్ 11 ప్రో: ఇది 6.3 అంగుళాల సూపర్ అక్చువా ఓఎల్ఈడీ డిస్‌ప్లే (1280 x 2856 పిక్సెల్స్), 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులో 30డబ్ల్యూ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 4,850ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్: ఇది పెద్దదైన 6.8 అంగుళాల సూపర్ అక్చువా ఓఎల్ఈడీ డిస్‌ప్లే (1344 x 2992 పిక్సెల్స్), 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇందులో 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,115ఎంఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీ ఇచ్చారు.

ఈ రెండు ఫోన్లలో జెమిని ఇంటెలిజెన్స్​తో పాటు సరికొత్త ‘హైలైట్’ ఫీచర్ ఉంది. కెమెరా ఫ్లాష్ చుట్టూ అమర్చిన ఈ యాంబియంట్ ఎల్‌ఈడీ లైట్లు, ఫోన్ బోర్లా వేసినప్పుడు వెలుగుతూ వినియోగదారులకు విజువల్ సిగ్నల్స్ ఇస్తాయి. పిక్సెల్ 11 ప్రో సిరీస్‌లో మాత్రమే ఈ ఫీచర్ ప్రత్యేకంగా లభిస్తుంది. ఇవి ఆండ్రాయిడ్ 17 పై పనిచేస్తూ.. కాన్యన్, ఆలివ్, ఫాగ్, ఆబ్సిడియన్ రంగులలో లభిస్తాయి.

గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్: ప్రధాన ఫీచర్లు..

గూగుల్ నుంచి వస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్' అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. దీని బయటి వైపు 6.5 అంగుళాల సూపర్ అక్చువా ఓఎల్ఈడీ డిస్‌ప్లే (3600 నిట్స్ బ్రైట్‌నెస్) ఉండగా, లోపలి వైపు 8 అంగుళాల సూపర్ అక్చువా ఫ్లెక్స్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే (2076 x 2152 పిక్సెల్స్) ఇచ్చారు.

ఇది కూడా టెన్సర్ జీ6 ప్రాసెసర్, టైటాన్ ఎం3 చిప్, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇందులో 30డబ్ల్యూ ఛార్జింగ్, 25డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతు ఉన్న 4,750ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వెనుక భాగంలో 48ఎంపీ + 10.5ఎంపీ + 10.8ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో రెండు 10ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఎయిర్‌స్పేస్ గ్రేడ్ అల్యూమినియం అలాయ్ బాడీ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 17 పై నడుస్తుంది. సింగిల్ ఆలివ్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది.

భారత్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ధరలు..

భారత మార్కెట్లో గూగుల్ ఈ ఫోన్ల ధరలను విభిన్న శ్రేణులలో నిర్ణయించింది:

గూగుల్ పిక్సెల్ 11: రూ. 89,999 నుంచి ప్రారంభం

గూగుల్ పిక్సెల్ 11 ప్రో: రూ. 1,19,999 నుంచి ప్రారంభం

గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్: రూ. 1,34,999 నుంచి ప్రారంభం

గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్: రూ. 1,86,999 నుంచి ప్రారంభం

ఈ స్మార్ట్‌ఫోన్లన్నింటికీ సంబంధించిన ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ఆగస్టు 12 నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి.

Google Pixel Model

RAM + Storage

Price in India

Google Pixel 1112GB + 256GB

89,999

Google Pixel 1112GB + 512GB

1,04,999

Google Pixel 11 Pro12GB + 256GB

1,19,999

Google Pixel 11 Pro16GB + 512GB

1,34,999

Google Pixel 11 Pro XL12GB + 256GB

1,34,999

Google Pixel 11 Pro XL16GB + 512GB

1,49,999

Google Pixel 11 Pro Fold16GB + 512GB

1,86,999

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe