Vivo X Fold 6 : 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో వివో ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్- ఎక్స్​ ఫోల్డ్​ 6 హైలైట్స్​ ఇవే..

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో శాంసంగ్, వన్‌ప్లస్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తూ వివో తన ఎక్స్​ ఫోల్డ్​ 6 గ్యాడ్జెట్​ని లాంచ్​ చేసింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర సహా పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jun 27, 2026, 09:58:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రముఖ చైనీస్ బ్రాండ్ 'వివో' సరికొత్త సంచలనాన్ని మార్కెట్లోకి తెచ్చింది. చైనాలో జరిగిన కంపెనీ ఈవెంట్‌లో అత్యంత పవర్‌ఫుల్ ఫీచర్లతో కూడిన బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ 'వివో ఎక్స్ ఫోల్డ్ 6'ని అధికారికంగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అల్ట్రా-పవర్‌ఫుల్ ప్రాసెసర్, జైస్ కెమెరాల కలయికతో ఈ ఫోన్ ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ధర, ఫీచర్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో ఎక్స్​ ఫోెల్డ్​ 6 ఇదిగో..
వివో ఎక్స్​ ఫోెల్డ్​ 6 ఇదిగో..

వివో ఎక్స్​ ఫోల్డ్​ 6..

ధర విషయానికి వస్తే, వివో ఎక్స్ ఫోల్డ్ 6 బేస్ వేరియంట్ (12GB రామ్ + 256GB స్టోరేజ్) ధర చైనాలో 7,999 యువాన్​గా ఉంది (మన కరెన్సీలో సుమారు రూ. 1,11,000). అలాగే 12GB + 512GB వేరియంట్ ధర 8,999 యువాన్ (సుమారు రూ. 1,25,000) కాగా, 16GB + 512GB మోడల్ ధర 9,999 యువాన్ (సుమారు రూ. 1,39,000)గా నిర్ణయించారు.

వీటితో పాటు టాప్-ఎండ్ మోడల్ అయిన 16GB రామ్ + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 యువాన్ (సుమారు రూ. 1,53,000)గా ఉంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన 'బ్లాక్ గోల్డ్ ఎడిషన్' ధర 11,299 యువాన్ (సుమారు రూ. 1,57,000)గా కంపెనీ ప్రకటించింది.

చైనాలో జులై 1 నుంచి వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ వివో ఎక్స్​ ఫోల్డ్​ 6 అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

వివో ఎక్స్​ ఫోల్డ్​ 6- అద్భుతమైన డిస్‌ప్లే హంగులు..

ఫోల్డబుల్ ఫోన్ లోపలి భాగంలో 8.02-ఇంచుల భారీ శాంసంగ్ ఎం14 ఫోల్డబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. దీని రిజల్యూషన్ 2,504 x 2,312 పిక్సెల్స్. అదేవిధంగా ఫోన్ మడతపెట్టినప్పుడు వాడుకునేందుకు బయటి వైపు 6.51-ఇంచుల (1,120 x 2,528 పిక్సెల్స్) కవర్ స్క్రీన్‌ను అందించారు. ఈ రెండు స్క్రీన్లు కూడా 120హెచ్​జెడ్ రీఫ్రెష్ రేట్, 300హెచ్​జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1.07 బిలియన్ కలర్స్, హెచ్​డీఆర్ సపోర్ట్‌తో వస్తాయి. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు అరుదైన ఐపీ58, ఐపీ59 రేటింగ్స్ ఇవ్వడం విశేషం.

వివో ఎక్స్​ ఫోల్డ్​ 6- నెక్ట్స్ లెవెల్ పర్ఫార్మెన్స్..

వివో ఎక్స్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజినల్ ఓఎస్ 6 ఫోల్డ్ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. ఇందులో అత్యంత శక్తివంతమైన 3ఎన్​ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4.21జీహెచ్​జెడ్ క్లాక్ స్పీడ్‌ను అందుకుంటుంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్​ఎం మాలి జీ1-అల్ట్రా జీపీయూను జత చేశారు. ఇందులో గరిష్టంగా 16GB వరకు LPDDR5x అల్ట్రా రామ్, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.

వివో ఎక్స్​ ఫోల్డ్​ 6- అదిరిపోయే కెమెరా..

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో జైస్ బ్రాండింగ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు.

ప్రధాన కెమెరా: ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ మెయిన్ షూటర్.

అల్ట్రావైడ్ కెమెరా: 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్.

టెలిఫోటో కెమెరా: 100ఎక్స్ డిజిటల్ జూమ్ సామర్థ్యం గల 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా.

ఇక సెల్ఫీల కోసం ఫోన్ లోపలి స్క్రీన్‌పై ఒకటి, బయటి కవర్ స్క్రీన్‌పై మరొకటి చొప్పున రెండు 20-మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చారు. ఈ ఫోన్ ద్వారా వినియోగదారులు అద్భుతమైన 8కే క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

వివో ఎక్స్​ ఫోల్డ్​ 6- భారీ బ్యాటరీ..

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సైజ్ తక్కువగా ఉంటుంది. కానీ వివో ఈ అపవాదును చెరిపేస్తూ ఏకంగా 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ స్లిమ్ ఫోన్లో ప్యాక్ చేసింది. దీనికి తోడుగా 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించింది. కనెక్టివిటీ పరంగా 5G, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో పాటు మన దేశీయ నావిగేషన్ సిస్టమ్ ‘నావిక్’ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మడత విప్పినప్పుడు కేవలం 4.40ఎంఎం మందం, 228 గ్రాముల బరువుతో ఇది చాలా తేలికగా, పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More