...
...
Next Story

Gujarat Titans: అర్ధరాత్రి నడిరోడ్డు మీద గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. సిరాజ్ స్టోరీ వైరల్.. అసలేం జరిగిందంటే?

Gujarat Titans: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓడిన గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు అర్ధరాత్రి నడిరోడ్డు మీద వెయిట్ చేయాల్సి వచ్చింది. రోడ్డుపై సహచర ఆటగాళ్లతో కలిసి కూర్చున్న ఫొటోను సిరాజ్ తన స్టోరీలో పెట్టాడు. అసలు ఏం జరిగిందో? ఇక్కడ చూసేయండి.

Published on: Jun 1, 2026, 09:57:52 IST
Advertisement

Gujarat Titans: ఐపీఎల్ 2026 ఫైనల్ కంప్లీట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ వరుసగా రెండో సారి విక్టరీ ఖాతాలో వేసుకుంది. సగర్వంగా కప్ ముద్దాడింది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో ఓడింది. అయితే మ్యాచ్ ముగిశాక చాలా సేపటి తర్వాత గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు నడి రోడ్డుపై కనిపించారు. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

నడి రోడ్డుపై గుజరాత్ ఆటగాళ్లు

అర్ధరాత్రి నడి రోడ్డు మీద గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు (instagram)
అర్ధరాత్రి నడి రోడ్డు మీద గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు (instagram)

ఐపీఎల్ 2026లో రన్నరప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియం నుంచి హోటల్ కు ఆటగాళ్లను తీసుకెళ్లే బస్సు రోడ్డు మీద ఆగిపోయింది. దట్టమైన పొగ అలుముకుంది. అప్పుడు ఆటగాళ్లు అందులోనే ఉన్నారు.

తప్పిన ప్రమాదం

బస్సులో దట్టమైన పొగ అలుముకున్న సమయంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు అందులోనే ఉండటంతో తీవ్ర కలకలం రేగింది. కానీ సెక్యూరిటీ సిబ్బంది త్వరగా స్పందించి ఆటగాళ్లను దించేశారు. ఈ పరిణామంతో ప్లేయర్లందరూ షాక్ అయ్యారు. మరో బస్సులో హోటల్ కు చేరుకునేంత వరకూ ఆటగాళ్లు నడి రోడ్డు మీదే వెయిట్ చేయాల్సి వచ్చింది.

సిరాజ్ స్టోరీ

గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీ వైరల్ గా మారింది. ఇషాంత్ శర్మతో సహా సహచర ఆటగాళ్లతో కింద కూర్చున్న ఫొటోను సిరాజ్ పంచుకున్నాడు. బ్రేక్ డౌన్ అని పేర్కొంటూ ఈ ఫొటోను స్టోరీగా పెట్టాడు. దీంతో ఈ పిక్ తెగ వైరల్ గా మారింది.

ఆర్సీబీకి కంగ్రాచ్యులేషన్స్

ఐపీఎల్ 2026లో సిరాజ్ అదరగొట్టాడు. ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా నిలిచాడు. గ్రీన్ డాట్ బాల్ అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది 17 మ్యాచ్ ల్లో సిరాజ్ 19 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో 172 డాట్ బాల్స్ వేశాడు. పవర్ ప్లేలో బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రబాడతో కలిసి ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks