ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఇక భారత ఆటగాళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దీంతో మన క్రికెటర్లపై ఎప్పుడూ కాసుల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఆటే కాదు ఆదాయం పరంగా చూసుకున్నా మన ఇండియన్ క్రికెటర్లకు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఆటగాళ్లు ఎంతో దూరంలో ఉన్నారు. హార్దిక్ పాండ్య పెట్టుకున్న వాచ్ రేటు పాక్ కెప్టెన్ జీతం కంటే మూడు రెట్లు ఎక్కవగా ఉండటం విశేషం.
హార్దిక్ పాండ్య వాచ్

రీసెంట్ గా టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరు జరిగింది. ఇందులో అదిరే ఆటతో అదరగొట్టిన భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య చేతికి పెట్టుకున్న వాచ్ హాట్ టాపిక్ గా మారింది. శివుడి ఫొటోతో స్కై బ్లూ కలర్ లో ఉన్న ఈ వాచ్ రేట్ తెలిస్తే షాక్ అవాల్సిందే. దీని ముందు పాకిస్థాన్ కెప్టెన్ సాలరీ చాలా తక్కువ.
వాచ్ రేట్
పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్య ప్రత్యేకమైన జాకబ్ & కో ఎపిక్ X స్పోర్ట్ 'రుద్ర' ఎడిషన్ వాచ్ ను పెట్టుకున్నాడు. ఈ లగ్జరీ టైమ్‌పీస్ ధర పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నెలవారీ జీతం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని తెలిసింది. ఈ వాచ్ రేటు ధర $28,000 (సుమారు రూ.25,35,000) కాగా.. సల్మాన్ అఘాకు పాకిస్థాన్ సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం నెలకు రూ.7 లక్షలు మాత్రమే వస్తుంది.
25 పీస్ లు
'ది ఇండియన్ హారాలజీ' ప్రకారం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య జాకబ్ & కో ఎపిక్ X స్పోర్ట్ ప్రత్యేకమైన 'రుద్ర' ఎడిషన్ వాచ్ ను చేతికి పెట్టుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇవి కేవలం 25 పీస్ లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇలాంటి వాచ్ లు మొత్తం 25 మాత్రమే. ఇది లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్.
{{/usCountry}}'ది ఇండియన్ హారాలజీ' ప్రకారం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య జాకబ్ & కో ఎపిక్ X స్పోర్ట్ ప్రత్యేకమైన 'రుద్ర' ఎడిషన్ వాచ్ ను చేతికి పెట్టుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇవి కేవలం 25 పీస్ లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇలాంటి వాచ్ లు మొత్తం 25 మాత్రమే. ఇది లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్.
{{/usCountry}}శివుడి ఫొటోతో
41mm గ్రేడ్ 5 టైటానియం కేస్‌లో 11.5mm సన్నని ప్రొఫైల్, 50 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్ తో ఉన్న ఈ లైట్ వెయిట్ వాచ్ చూడటానికి అద్భుతంగా ఉంది. దీని కోర్ లో ఇన్-హౌస్ ఆటోమేటిక్ కాలిబర్ JCHA01 ఉంది. ఇది 4Hz వద్ద 70 గంటల పవర్ రిజర్వ్‌తో పనిచేస్తుంది. రుద్ర రూపంలో వాచ్ మధ్యలో ఉన్న శివుడి ఫొటో ఈ వాచ్ కు మరింత శక్తిని, ఆకర్షణను తీసుకొచ్చింది. శివరాత్రి రోజు జరిగిన మ్యాచ్ సందర్భంగా హార్దిక్ ఈ వాచ్ పెట్టుకున్నాడు.
ఇది మీ స్థాయి
హార్దిక్ వాచ్ కంటే పాకిస్థాన్ కెప్టెన్ జీతం మూడు రెట్లు తక్కువ అనే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ స్థాయి ఇదేనంటూ పాక్ క్రికెటర్లపై ఇండియన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నిజం తెలుసుకోలేక ఇండియాతో అనవసరంగా పెట్టుకుంటారని ట్రోల్స్ చేస్తున్నారు.