భారతదేశంలో నిత్యం ప్రయాణాలు సాగించే సామాన్యులకు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను అందించడంలో హీరో మోటోకార్ప్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా కంపెనీ తన ప్యాషన్ ప్లస్ శ్రేణిని మరింత విస్తరిస్తూ 'హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్' వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. బేస్ మోడల్‌తో పోలిస్తే ఇందులో ఆధునిక టెక్నాలజీ, అదనపు భద్రత, సరికొత్త ప్రీమియం ఫీచర్లను జోడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్- కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి?

ఈ హీరో ప్యాషన్ ప్లస్ కొత్త వేరియంట్‌లో రైడర్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక మార్పులు చేశారు.
ఫ్రంట్ డిస్క్ బ్రేక్: రోజువారీ ప్రయాణాల్లో బైక్ త్వరగా, సురక్షితంగా ఆగడానికి ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ సపోర్ట్‌ను అందించారు.
ఫుల్లీ డిజిటల్ మీటర్: పాత సెమీ-డిజిటల్ కన్సోల్ స్థానంలో ఇప్పుడు పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు.
బ్లూటూత్ కనెక్టివిటీ: ఇందులో బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. దీని ద్వారా రైడర్లకు కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లు, రియల్ టైమ్ మైలేజ్, ట్రిప్ మీటర్, సర్వీస్ రిమైండర్, ఓడోమీటర్, లో-ఫ్యూయల్ ఇండికేటర్ వంటి వివరాలు స్క్రీన్‌పైనే కనిపిస్తాయి.
ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్: ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా అత్యంత ప్రకాశవంతమైన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ను ఈ బైక్‌కు జోడించారు.
సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్: సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు బైక్ స్టార్ట్ కాకుండా, లేదా రన్ అవ్వకుండా నిలిపివేసే సేఫ్టీ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్ వేరియంట్- ఇంజన్ సామర్థ్యం, మైలేజ్..
సాంకేతిక పరంగా ఈ హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్ బైక్‌లో నమ్మకమైన 100 సీసీ, సింగిల్ సిలిండర్, బీఎస్6, ఓబీడీ-2 ఫేజ్-ఏ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఇంజన్‌ను అందించారు. ఇది గరిష్టంగా 8,000 ఆర్‌పీఎమ్ వద్ద 7.91 బీహెచ్పీ పవర్‌ను, అలాగే 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో పాటు హీరో సంస్థకు చెందిన పేటెంటెడ్ ఐ3S (Idle Stop-Start System) టెక్నాలజీని కూడా ఇచ్చారు. ఇది ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.
ఈ బైక్ లీటరుకు ఏకంగా 71 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది.
హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్- రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా..
{{/usCountry}}ఈ బైక్ లీటరుకు ఏకంగా 71 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది.
హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్- రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా..
{{/usCountry}}ఆధునిక ఫీచర్లతో పాటు ఈ బైక్ రైడింగ్ కంఫర్ట్‌ను కూడా మెరుగుపరిచారు. సుదూర ప్రయాణాలకైనా అలసట రాకుండా ఉండేలా సౌకర్యవంతమైన లాంగ్ సీట్, స్ట్రెయిట్ సిట్టింగ్ పోశ్చర్, చిన్నపాటి వస్తువులు పెట్టుకోవడానికి యుటిలిటీ స్టోరేజ్ బాక్స్, ప్రయాణంలో మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టును కూడా అమర్చారు.
హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్- కలర్స్, ధర..
కొత్త హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్ వేరియంట్ మొత్తం 4 ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది:
- హెవీ గ్రే
- నెక్సస్ బ్లూ
- డార్క్ ఇండస్ట్రియల్ గ్రే
- పెర్ల్ రెడ్
దిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,128 గా ఉంది. ఈ సరికొత్త మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హీరో మోటోకార్ప్ అధికారిక డీలర్‌షిప్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.