ఇప్పటివరకు ఇండియాలో కేవలం సిటీ సెడాన్, ఎలివేట్ ఎస్‌యూవీలపైనే ప్రధానంగా ఆధారపడుతూ కాస్త నెమ్మదిగా సాగిన హోండా సంస్థ ఇప్పుడు తన రూటు మార్చింది. మనదేశంలో ఊపందుకుంటున్న కార్ల విక్రయాలను చూసి, ఇండియన్ ఆటో మార్కెట్‌పై సీరియస్‌గా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ దశాబ్దం ముగిసే నాటికి ఏకంగా 10 కొత్త కార్లను ఇండియన్ రోడ్లపైకి తెచ్చేందుకు అగ్రెసివ్ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసింది.

ఈ మోడళ్లలో ఏకంగా 7 ఎస్‌యూవీలే ఉండటం గమనార్హం. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న జెడ్ఆర్-వీ హైబ్రిడ్ మోడల్‌ను సీబీయూ మార్గంలో మనదేశానికి దిగుమతి చేసి లాంచ్ చేసిన హోండా, త్వరలోనే తన గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలోని సివిక్, సీఆర్-వీ, ప్రల్యూడ్ వంటి పాపులర్ కార్లను కూడా భారత్‌కు తెచ్చే ఆలోచనలో ఉంది.
అంతేకాకుండా, అత్యాధునిక 'పీఎప్2' మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్, ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ఈవీ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించి 2028 నాటికి అత్యంత కీలకమైన 4 కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అవి..
1. నెక్ట్స్-జనరేషన్ హోండా సిటీ (6వ తరం)
భారత్‌లో ఐకానిక్ బ్రాండ్‌గా నిలిచిన హోండా సిటీ కొత్త వెర్షన్‌ను మరింత స్టైలిష్‌గా 'పీఎఫ్2' లైట్‌వెయిట్ ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేస్తున్నారు. హోండా '0 సిరీస్' కాన్సెప్ట్ ఆధారంగా కూపే స్టైలిష్ ఫాస్ట్‌బ్యాక్ లుక్‌తో ఇది రానుంది. విశాలమైన కేబిన్, అధునాతన ఫీచర్లతో రానున్న ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు లీటరుకు 28 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చే అప్‌గ్రేడెడ్ ఈ:హెచ్ఈవీ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని అందించనున్నారు.
2. హోండా 0 ఆల్ఫా ఈవీ
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పోటీని తట్టుకునేందుకు హోండా తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ '0 ఆల్ఫా'ను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే పరిచయం చేయనుంది. 'థిన్, లైట్ అండ్ వైజ్' ఆర్కిటెక్చర్‌పై నిర్మితమయ్యే ఈ కారు ఎలివేట్ కంటే 100ఎంఎం ఎక్కువ వీల్‌బేస్, ఫాస్ట్ డీసీ ఛార్జింగ్‌తో రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా సియెర్రా ఈవీ, మహీంద్రా బీఈ 6 మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
3. హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ
{{/usCountry}}ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పోటీని తట్టుకునేందుకు హోండా తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ '0 ఆల్ఫా'ను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే పరిచయం చేయనుంది. 'థిన్, లైట్ అండ్ వైజ్' ఆర్కిటెక్చర్‌పై నిర్మితమయ్యే ఈ కారు ఎలివేట్ కంటే 100ఎంఎం ఎక్కువ వీల్‌బేస్, ఫాస్ట్ డీసీ ఛార్జింగ్‌తో రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా సియెర్రా ఈవీ, మహీంద్రా బీఈ 6 మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
3. హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ
{{/usCountry}}సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలోకి హోండా మళ్లీ అడుగుపెడుతోంది. 2028 నాటికి రానున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడిఫైడ్ పీఎఫ్2 ప్లాట్‌ఫారమ్‌పై రూపుదిద్దుకుంటుంది. కొత్త 1.2 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లతో రానున్న ఈ కారు టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి పాపులర్ కార్లతో తలాపడనుంది.
4. హోండా 7-సీటర్ ఎస్‌యూవీ
భారీ ఫ్యామిలీ కార్ల కోసం చూస్తున్న వారి కోసం హోండా ఒక కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్‌లకు పోటీగా రానున్న ఈ ఎస్‌యూవీలో 6, 7 సీటింగ్ ఆప్షన్లు ఉంటాయి. 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌తో పాటు నెక్ట్స్ జనరేషన్ 1.5 లీటర్ ఈ:హెచ్ఈవీ హైబ్రిడ్ ఇంజిన్‌ను ఇందులో వాడనున్నారు.