Honda City facelift : 2026 హోండా సిటీ సెడాన్ లాంచ్ రేపే- అదిరిపోయే డిజైన్, లగ్జరీ ఫీచర్లతో ఎంట్రీ!
2026 Honda City : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కార్లలో ఒకటిగా పేరొందిన హోండా సిటీ సరికొత్త అవతారంలో అలరించడానికి సిద్ధమైంది. హోండా కార్స్ ఇండియా రేపు (మే 22, 2026) హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ని దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. ఈ నేపథ్యలో ఈ సెడాన్ వివరాలపై ఓ లుక్కేయండి మరి
Honda City facelift launch in India : భారతదేశ ఆటోమొబైల్ రంగంలోని మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో సుదీర్ఘ కాలంగా రారాజుగా వెలుగుతున్న హోండా సిటీ కారును కంపెనీ సరికొత్త హంగులతో అప్‌డేట్ చేసింది. రేపు, మే 22, 2026 న ఈ ‘హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్’ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే కంపెనీ దీనికి సంబంధించిన టీజర్లను విడుదల చేయగా.. డీలర్‌షిప్‌ల వద్ద కనిపించిన ఈ సెడాన్ స్పై షాట్స్ ద్వారా ఈ సరికొత్త మోడల్‌లో జరిగిన ప్రధాన మార్పులు వెల్లడయ్యాయి. వాటి వివరాలను మీరూ చూసేయండి..

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్- సరికొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్..
కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో బాహ్య రూపకల్పనకు సంబంధించి కంపెనీ సరికొత్త కాస్మెటిక్ మార్పులు చేసింది.
ఫ్రంట్ ప్రొఫైల్: కారు ముందు భాగంలో స్లిమ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ల్స్తో కూడిన కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గ్రిల్ మీదుగా కనెక్ట్ అయ్యే సరికొత్త లైటింగ్ ఎలిమెంట్‌ను హోండా టీజ్ చేసింది. ఇది కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. మునుపటి మెష్ ప్యాటర్న్ గ్రిల్ స్థానంలో ఇప్పుడు హారిజాంటల్ ఎలిమెంట్స్ గల షార్ప్ గ్రిల్‌ను అందించారు. ఫ్రంట్ బంపర్ డిజైన్‌ను మరింత స్పోర్టీగా మార్చారు. అయితే, ఇటీవల కనిపించిన టెస్ట్ కార్లలో ఫాగ్ ల్యాంప్స్ కనిపించకపోవడం గమనార్హం.
సైడ్ అండ్ రేర్ లుక్: కారు పక్క భాగం పాత మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, కొత్తగా బ్లాక్ ఫినిష్‌తో కూడిన 16-ఇంచ్ స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను జత చేశారు. వెనుక భాగంలో అప్‌డేటెడ్ టెయిల్ ల్యాంప్స్, క్లీన్ బంపర్ డిజైన్‌తో పాటు బూట్-లిడ్‌పై ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్‌ను ఇచ్చారు.
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్- లగ్జరీ క్యాబిన్, కొత్త ఫీచర్లు..
2026 హోండా సిటీ లోపలి భాగంలో కస్టమర్ల కంఫర్ట్ కోసం, టెక్నాలజీ పరంగా మంచి అప్‌గ్రేడ్స్ చేశారు.
ప్రస్తుతం ఉన్న 8-ఇంచ్ స్క్రీన్ స్థానంలో.. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో పెద్ద సైజ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.
లగ్జరీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో కొత్తగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సురక్షితమైన పార్కింగ్ కోసం 360-డిగ్రీ కెమెరా, అంబియంట్ లైటింగ్, సరికొత్త అప్‌హోల్స్టరీ (సీట్ కవర్స్) ఆప్షన్లను జోడించారు. కారు క్యాబిన్ మునుపటి లాగే క్లాసిక్ బ్లాక్-అండ్-బేజ్ కలర్ థీమ్‌తో రానుంది.
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు..
మెకానికల్ పరంగా హోండా సిటీలో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత ఇంజిన్ ఆప్షన్లనే ఇందులోనూ కొనసాగించారు.
1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్: ఇది గరిష్టంగా 121 బీహెచ్పీ పవర్, 145 ఎన్ఎం టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సీవీటీ ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
1.5-లీటర్ అట్కిన్సన్-సైకిల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్: ఎక్కువ మైలేజ్ కోరుకునే వారి కోసం హోండా సిటీ హైబ్రిడ్ (e:HEV) వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 124 హెచ్‌పీ పవర్, 253 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

ఈ సరికొత్త అప్‌డేట్స్‌తో వస్తున్న హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ధరలు ప్రస్తుత మోడల్ కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. రేపు జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో దీని అధికారిక ధరలను హోండా వెల్లడించనుంది. అంచనాల ప్రకారం ఎక్స్‌షోరూం ధర రూ. 12లక్షలు- రూ .12.55లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


