ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా, భారత మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకునేందుకు అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా హోండా సిటీపై కళ్లు చెదిరే ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
హోండా సిటీపై రూ. 3 లక్షల వరకు లాభం!

మీరు హోండా సిటీ సెడాన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం! మార్చి 31, 2026 వరకు ఈ కారుపై రూ. 3 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్లు కేవలం ఎంవై25 (మోడల్ ఇయర్ 2025) మోడళ్లకు మాత్రమే వర్తిస్తాయని గమనించాలి.
ఈ బెనిఫిట్స్‌కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ సమీపంలోని హోండా డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
హోండా సిటీ ప్రారంభ ధర రూ. 11.95 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 16.07 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్).
ఇంజిన్: ఇందులో 1.5-లీటర్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 119 బీహెచ్పీ పవర్, 145 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది.
సిటీ మాత్రమే కాదు పోర్ట్‌ఫోలియోలోని ఇతర మోడల్స్‌పై కూడా హోండా సంస్థ అదిరే ఆఫర్లను ఇస్తోంది. వాటి గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
హోండా తొలి ఈవీ '0 ఆల్ఫా' టెస్టింగ్ షురూ..
మరోవైపు భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలోకి హోండా ఘనంగా ప్రవేశిస్తోంది. తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ '0 ఆల్ఫా' ఆన్-రోడ్ టెస్టింగ్‌ను ప్రారంభించింది. రాజస్థాన్‌లోని తపుకరా తయారీ ప్లాంట్ నుంచి మార్చి 16, 2026న ఈ టెస్ట్ వాహనం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో వివిధ పరీక్షలకు గురికానుంది.
భారీ పెట్టుబడి.. గ్లోబల్ ప్లాన్..
{{/usCountry}}మరోవైపు భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలోకి హోండా ఘనంగా ప్రవేశిస్తోంది. తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ '0 ఆల్ఫా' ఆన్-రోడ్ టెస్టింగ్‌ను ప్రారంభించింది. రాజస్థాన్‌లోని తపుకరా తయారీ ప్లాంట్ నుంచి మార్చి 16, 2026న ఈ టెస్ట్ వాహనం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో వివిధ పరీక్షలకు గురికానుంది.
భారీ పెట్టుబడి.. గ్లోబల్ ప్లాన్..
{{/usCountry}}హోండా తన ఈవీ ప్రయాణం కోసం రూ. 1,200 కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించింది. ఇందులో భాగంగా తపుకరా ప్లాంట్‌ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అనుగుణంగా ఆధునీకరించారు. ఈ ప్లాంట్ కేవలం భారత మార్కెట్ అవసరాలకే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే కేంద్రంగా కూడా పనిచేయనుంది.
లాంచ్ ఎప్పుడు?
'0 ఆల్ఫా' కారు 2026–27 ఆర్థిక సంవత్సరంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఇది ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మంచి డ్రైవింగ్ రేంజ్, ఆధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ అయ్యే అవకాశం ఉంది.
భారత ఈవీ మార్కెట్లో పోటీ పెరుగుతున్న తరుణంలో, హోండా ఆలస్యంగానైనా బలమైన పునాదితో రంగంలోకి దిగుతోంది. హోండా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం '0 ఆల్ఫా' విజయానికి కీలకం కానుంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. హోండా సిటీపై లభించే రూ. 3 లక్షల డిస్కౌంట్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుందా?
కాదు. ఈ గరిష్ట ప్రయోజనం ప్రధానంగా ‘సిటీ హైబ్రిడ్’ మోడల్‌పై లభిస్తోందని తెలుస్తోంది. సాధారణ పెట్రోల్ వేరియంట్లపై డిస్కౌంట్ రూ. 1.56 లక్షల వరకు ఉంటుంది. అలాగే, ఈ ఆఫర్లు కేవలం 2025 మోడల్ ఇయర్ (MY25) స్టాక్‌పై మాత్రమే, మార్చి 31, 2026 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేరియంట్, నగరాన్ని బట్టి ఆఫర్ మొత్తంలో మార్పులు ఉండవచ్చు.
2. హోండా '0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ కారు ధర ఎంత ఉండవచ్చు? ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది?
హోండా '0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ కారును 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో (ఎఫ్వై 2026–27) లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ. 17 లక్షల నుంచి రూ. 22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇది మార్కెట్లోకి వచ్చినప్పుడు హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతీ సుజుకీ ఈ-విటారా వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది.
3. హోండా 0 ఆల్ఫా ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది?
ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఒకే ఛార్జ్‌పై సుమారు 450 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో 60kWh నుండి 75kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను వాడే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల కేవలం 30 నిమిషాల్లోనే గణనీయమైన స్థాయిలో ఛార్జింగ్ చేసుకోవచ్చు.