...
...
Next Story

Electric scooter : 151 కి.మీ రేంజ్​తో హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్- ఇండియాలో లాంచ్ ఎప్పుడు?

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నయా ఎలక్ట్రిక్ స్కూటర్ 'హోండా క్యూసీ3' ని మార్కెట్లో ఆవిష్కరించింది. 3 kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ, 151 కి.మీ రేంజ్, స్మార్ట్ కీ సాంకేతికతతో వచ్చిన ఈ స్కూటర్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 25, 2026, 06:45:55 IST
Advertisement

భారత ఈవీ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' (హెచ్​ఎంఎస్​ఐ) మరో అడుగు ముందుకు వేసింది. కుటుంబ అవసరాలు, నిత్యం ఆఫీసులకు వెళ్లే వాహనదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇప్పటికే కంపెనీ విక్రయిస్తున్న క్యూసీ1, యాక్టివా ఈ స్కూటర్ల సరసన ఈ కొత్త మోడల్ చేరనుంది.

హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్..
హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్..

రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే ప్రాక్టికల్ డిజైన్, ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్, కనెక్టెడ్ టెక్నాలజీ, విస్తారమైన స్టోరేజ్ స్పేస్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీర్చిదిద్దారు.

హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్- బ్యాటరీ, రేంజ్..

హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది ఒక్కసారి పూర్తిస్థాయిలో ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

నగరాల్లో తిరిగే వారికి ఛార్జింగ్ కష్టాలు లేకుండా, కేవలం 2 గంటల 40 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చని హోండా స్పష్టం చేసింది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం దీనికి ప్లస్ పాయింట్‌గా మారనుంది.

హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్- కంఫర్ట్..

కుటుంబ అవసరాలకు తగినట్లుగా ఈ హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు కింద ఏకంగా 32 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ అందించారు. మార్కెట్‌కు వెళ్లినప్పుడు సామాన్లు పెట్టుకోవడానికి లేదా హెల్మెట్ ఉంచడానికి ఈ స్పేస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనితో పాటు వాహనాన్ని హ్యాండిల్ చేయడం సులభతరం చేసేందుకు స్మార్ట్ కీ సిస్టమ్‌ను కూడా పొందుపరిచారు.

హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్- డిజిటల్ టెక్నాలజీ, కనెక్టివిటీ..

0 కార్బన్ ఉద్గారాలతో, ఆకట్టుకునే రేంజ్, అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన హోండా క్యూసీ3 ఈ- స్కూటర్.. నగర ప్రయాణాలకు ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.

ఇక ఈ క్యూసీ3 లాంచ్​, ధర సహా ఇతర వివరాలను సంస్థ వెల్లడించాల్సి ఉంది. త్వరలోనే వీటిపై కీలక అప్డేట్స్ వెలువడే అవకాశం ఉంది.

హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్- ఇతర 9 మోడళ్లు..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణతో పాటు హోండా ఒకే వేదికపై మరో 9 కొత్త ద్విచక్ర వాహనాలను కూడా ప్రదర్శించింది. అందులో అడ్వెంచర్ మోడల్ ఏడీవీ 160 స్కూటర్, రెబెల్ 300, రెబెల్ 500 క్రూయిజర్ బైక్‌లు, రీఫ్రెష్డ్ సీబీ 350 సిరీస్, ఆఫ్‌రోడ్ రైడింగ్‌కు అనుకూలమైన ఎక్స్​ఆర్ 300ఎల్, ఎక్స్​ఆర్ 300 రాలీ మోటార్ సైకిళ్లు ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe