బెస్ట్ సెల్లింగ్ Honda Shine 125 బైక్‌లో లిమిటెడ్ ఎడిషన్- ప్రీమియం లుక్‌తో..
భారత మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన 'షైన్ 125'లో హోండా సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. కొత్త కలర్ స్కీమ్, అదిరిపోయే గ్రాఫిక్స్‌తో వస్తున్న ఈ హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ బైక్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశపు టూ-వీలర్ దిగ్గజం 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' (హెచ్ఎంఎస్ఐ).. తన పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ ‘షైన్ 125’లో సరికొత్త 'లిమిటెడ్ ఎడిషన్'ను ఆవిష్కరించింది. త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్పెషల్ వెర్షన్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న షైన్ 125 డిస్క్ వేరియంట్ ఆధారంగా రూపొందింది. పోటీ ఎక్కువగా ఉన్న 125సీసీ విభాగంలో కొంచెం వెరైటీగా, విభిన్నంగా ఉండాలని కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షించేలా ఇందులో పలు విజువల్ అప్‌గ్రేడ్స్‌ను హోండా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్- లుక్ అదిరిపోయింది..
ఈ లిమిటెడ్ ఎడిషన్ షైన్ 125 బైక్‌లో ప్రధాన ఆకర్షణ దాని సరికొత్త రంగు అని చెప్పుకోవాలి. ఇది చూడగానే ఆకట్టుకునే 'పర్ల్ సైరన్ బ్లూ' రంగులో మెరిసిపోతోంది. దీనికి తోడు డార్క్ బ్లూ బాడీ ప్యానెల్స్, ఫ్యూయల్ ట్యాంక్‌పైన ఈ ఎడిషన్‌కే ప్రత్యేకమైన, గంభీరమైన 'షైన్' గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ పెయింట్ స్కీమ్‌కు మరింత వన్నె తెచ్చేలా అల్లాయ్ వీల్స్‌కు బ్రౌన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది సాధారణ డిస్క్ మోడల్‌తో పోలిస్తే బైక్‌కు మరింత ప్రీమియం, లగ్జరీ లుక్‌ను ఇస్తోంది. ఈ డిజైన్ అప్‌డేట్స్ ఫ్రంట్ వైజర్, సైడ్ కవర్, రియర్ కౌల్ వరకు విస్తరించి ఉండటంతో ఈ లిమిటెడ్ ఎడిషన్ చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది.
హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్- ఇంజిన్, పనితీరు..
మెకానికల్ పరంగా చూస్తే, ఈ హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో నమ్మకమైన 123.94 సీసీ, బీఎస్-6 ప్రమాణాలతో కూడిన ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను వాడారు. ఇది 7,500 ఆర్‌పీఎమ్ వద్ద సుమారు 10.6 hp పవర్‌ను, 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 11 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్మూత్ పవర్ డెలివరీ, అద్భుతమైన ఇంధన సామర్థ్యానికి పేరుగాంచిన ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. షైన్ రైడర్లు దశాబ్దాలుగా నమ్ముతున్న అదే పర్ఫార్మెన్స్ ఇందులోనూ కొనసాగనుంది.
హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్- డైమెన్షన్స్, కంఫర్ట్..
ఈ బైక్ పొడవు 2,046 ఎంఎం, వెడల్పు 741 ఎంఎం, ఎత్తు 1,116 ఎంఎంగా ఉంది. 1,285 ఎంఎం వీల్‌బేస్, 162 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో నగరాల్లోని ట్రాఫిక్‌లో సులభంగా నడిపేందుకు వీలుగా ఉంటుంది. దీని బరువు సుమారు 113 కిలోలు కాగా, సీటు ఎత్తు 791 ఎంఎం, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లుగా ఉంది.
ఇక కంఫర్ట్ కోసం హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. ఇవి భారతీయ రోడ్లపై ప్రయాణాన్ని సుఖవంతం చేస్తాయి.
హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్- ధర ఎంత ఉండవచ్చు?
ఈ బైక్‌కి సంబంధించి హోండా సంస్థ ధరను ఇంకా ప్రకటించనప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న షైన్ 125 డిస్క్ వేరియంట్ (ధర రూ. 85,211 ఎక్స్-షోరూమ్) కంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సాధారణ మోడల్ కంటే సుమారు రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకు అదనపు ప్రీమియంతో ఈ బైక్ అందుబాటులోకి రావచ్చు. ధరపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


