Honda cars : హోండా నుంచి ఇండియాలోకి తొలి హైబ్రిడ్​, ఎలక్ట్రిక్ ఎస్​యూవీ- టయోటాకు చెక్?

Honda ZR V price : భారతదేశంలో ఎస్‌యూవీలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని హోండా కార్స్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్చబోతోంది. ఇందులో భాగంగా ఒక హైబ్రిడ్​ ఎస్​యూవీని, ఒక ఎలక్ట్రిక్ ఎస్​యూవీని లాంచ్​ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jun 04, 2026 9:08 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Honda 0 alpha ev India launch : ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా.. భారత ఆటోమొబైల్ మార్కెట్​లో మళ్లీ పూర్వవైభవాన్ని అందుకోవడానికి భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ మార్కెట్​లోకి ఏకంగా 10 కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఈ జూన్ (2026) లోనే ప్రీమియం హైబ్రిడ్ ఎస్‌యూవీ ‘హోండా జెడ్ఆర్-వీ’ని లాంచ్ చేయబోతోంది. అంతేకాదు ఇంకొన్ని నెలల్లో ఈ హోండా నుంచి ఇండియాలోకి సరికొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ లాంచ్​కాబోతోంది. ఆ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

హోండా జెడ్​ఆర్​- వీ ఎస్​యూవీ..
హోండా జెడ్​ఆర్​- వీ ఎస్​యూవీ..

హోండా జెడ్ఆర్-వీ హైబ్రిడ్ ఎస్‌యూవీ..

భారత్‌లో హోండా బ్రాండ్ నుంచి రాబోతున్న మొట్టమొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీ ఇదే. ఈ కారును విదేశాల నుంచి నేరుగా సీబీయూ రూపంలో, పరిమిత సంఖ్యలో ఇండియాకు దిగుమతి చేయనున్నారు. ఈ మోడల్​ని సంస్థ ఇప్పటికే ప్రదర్శించింది.

ధర, పోటీ: మార్కెట్​లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది ప్రీమియం విభాగంలో ఉన్న వోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ నెల లాంచ్​ ఈవెంట్​ జరిగితే, అందులో ఈ మోడల్​కి చెందిన ధరలను సంస్థ ప్రకటిస్తుంది.

ఇక గ్లోబల్ మార్కెట్​లో ఉన్న మోడల్ తరహాలోనే, ఇండియాకు వచ్చే జెడ్ఆర్-వీ హైబ్రిడ్ ఎస్​యూవీలో కూడా 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. దీనికి డ్యూయల్-మోటార్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను జత చేశారు. ఈ కాంబినేషన్ ద్వారా ఈ ఎస్‌యూవీ 184 బీహెచ్​పీ గరిష్ట పవర్, 315 ఎన్​ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇందులోని ఈ-సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ కారు ఫ్రంట్ వీల్స్‌కు పవర్‌ను సరఫరా చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 172 కిలోమీటర్లు. ఇంతటి పవర్‌ఫుల్ ఇంజిన్ ఉన్నప్పటికీ, ఈ కారు లీటరుకు ఏకంగా 22.79 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని హోండా స్పష్టం చేసింది.

ఇక క్యాబిన్ లోపల కస్టమర్లకు లగ్జరీ ఫీలింగ్ ఇచ్చేలా హోండా అన్ని రకాల ఆధునిక ఫీచర్లను జోడించింది.

  • 10.25-ఇంచ్ పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే
  • వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉన్న 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • డ్రైవర్ సీటుకు 8-వే పవర్ అడ్జస్ట్‌మెంట్, పక్క సీటుకు 4-వే పవర్ అడ్జస్ట్‌మెంట్
  • అద్భుతమైన మ్యూజిక్ అనుభూతి కోసం 12-స్పీకర్ల ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్
  • భద్రత కోసం 8 ఎయిర్‌బ్యాగ్‌లు, టీపీఎమ్ఎస్, లెవల్​-2 అడాస్ సేఫ్టీ ఫీచర్లు.

'హోండా 0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

హైబ్రిడ్ కార్లతో పాటు వేగంగా ఎదుగుతున్న ఇండియన్ ఈవీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ హోండా తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీ 'హోండా 0 ఆల్ఫా'ను 2027 లో లాంచ్ చేయనుంది.

ఈ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రాజెక్ట్ కోసం హోండా కార్స్ ఇండియా సుమారు రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. రాజస్థాన్‌లోని తమ ‘టపుకరా’ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఈ ఈవీ తయారీ కేంద్రంగా మార్చనున్నారు. ఇక్కడి నుండే దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు కూడా కార్లను ఎగుమతి చేయనున్నారు.

ప్రస్తుతం ఈ 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ కారు వివిధ రకాల రోడ్లపై, విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కఠినమైన టెస్టింగ్‌ను జరుపుకుంటోంది. దీని బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ (మైలేజ్), ఛార్జింగ్ సమయం వంటి వివరాలను లాంచ్‌కు సమీపంలో కంపెనీ వెల్లడించనుంది. మార్కెట్​లోకి వచ్చిన తర్వాత ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతీ సుజుకీ ఈ-విటారా, టయోటా ఎబెల్లా వంటి రాబోయే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లతో తలపడనుంది.

ఈ మోడల్​ లాంచ్​, రేంజ్, ధర సహా పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More