హానర్కి చెందిన ‘పవర్’ అనే స్మార్ట్‌ఫోన్ చైనాలో ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించిన సక్సెసర్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడీ అవుతోందని తెలుసతోంది. ఈ క్రమంలోనే హానర్ పవర్ 2కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, విడుదల టైమ్‌లైన్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

పలు నివేదికల ప్రకారం.. టెక్ సంస్థ హానర్ పవర్ 2ను వచ్చే ఏడాది జనవరిలో చైనాలో విడుదల చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 10,080ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుందని సమాచారం. దీని మునుపటి మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్ ఉండగా, హానర్ పవర్ 2 మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎస్ఓసీ ద్వారా పనిచేస్తుందని రూమర్ ఉంది.
హానర్ పవర్ 2- స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)..
డిజిటల్ చాట్ స్టేషన్ అనే టిప్‌స్టర్.. "సేబర్" అనే కోడ్‌నేమ్‌తో ఉన్న ఒక స్మార్ట్‌ఫోన్ ముఖ్య స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. ఇందులో చిప్‌సెట్, డిస్‌ప్లే, రంగులు, బ్యాటరీ వివరాలు ఉన్నాయి. గిజ్‌మోచైనా నివేదిక ప్రకారం.. ఈ వివరాలు హానర్ పవర్ 2కు సంబంధించినవి కావచ్చు!
డిస్‌ప్లే: హానర్ పవర్ 2 6.79-ఇంచ్ ఎల్టీపీఎస్ ఫ్లాట్ డిస్‌ప్లే తో రావచ్చు. ఇది 1.5కే (1,200x2,640 పిక్సెల్స్) రిజల్యూషన్‌ను అందించే అవకాశం ఉంది.
ప్రాసెసర్: ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌తో పనిచేయవచ్చు.
బ్యాటరీ, ఛార్జింగ్: టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం, హానర్ పవర్ 2లో 10,080ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
కెమెరా: ఫోటోలు, వీడియోల కోసం, వెనుక వైపు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు.
{{/usCountry}}కెమెరా: ఫోటోలు, వీడియోల కోసం, వెనుక వైపు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు.
{{/usCountry}}కలర్స్: హానర్ పవర్ 2 స్నో వైట్, మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉండవచ్చు.
టెక్ సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్‌ని ఇంకా ధృవీకరించనప్పటికీ, ఇది మిడ్-రేంజ్ విభాగంలో ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఇది జనవరి 2026లో చైనాలో విడుదల అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.
అయితే, పైన పేర్కొన్న వివరాలన్నీ రూమర్లు మాత్రమే కాబట్టి, వాటిని కేవలం అంచనాగా మాత్రమే పరిగణించాలి.
ఈ స్పెసిఫికేషన్లు నిజమైతే, హానర్ పవర్ 2 వివిధ విభాగాల్లో, ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం పరంగా గణనీయమైన అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.
హానర్ పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 66డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది క్వాల్కమ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌తో పాటు అడ్రినో 720 జీపీయూ, 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులోకి వచ్చింది.