10000mAh Battery phone : భారీ బ్యాటరీతో హానర్ కొత్త స్మార్ట్​ఫోన్- ధర ఎంతంటే..

Honor Win Turbo : హానర్ నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్ లాంచ్ అయ్యింది. దాని పేరు హానర్ విన్​ టర్బో. 100ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తుండటం ఈ మోడల్​ హైలైట్​! ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్లు, ధర సహా పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: May 30, 2026, 18:58:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Honor Win Turbo India launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్.. మొబైల్ మార్కెట్ హిస్టరీలోనే కళ్లు చెదిరే సరికొత్త ఫీచర్లతో ‘హానర్ విన్ టర్బో’ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. కేవలం 7.98ఎంఎం పల్చటి బాడీలోనే ఏకంగా 10000ఎంఏహెచ్ సామర్థ్యం గల మాన్​స్టర్ బ్యాటరీని అమర్చడం ఈ ఫోన్ ప్రధాన ప్రత్యేకత. దీనితో పాటు స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే అత్యధికంగా 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ గల డిస్‌ప్లేను ఇందులో అందించారు. మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభించే ఈ ఫోన్ సరికొత్త మీడియాటెక్ రేసింగ్ ఎడిషన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

హానర్ విన్​ టర్బో స్మార్ట్​ఫోన్ ఇదిగో..
హానర్ విన్​ టర్బో స్మార్ట్​ఫోన్ ఇదిగో..

ఆండ్రాయిడ్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10 సాఫ్ట్‌వేర్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్, పెద్ద పెద్ద పనులను కూడా ఎంతో సులువుగా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ సరికొత్త 'హానర్ విన్ టర్బో' స్మార్ట్​ఫోన్ ధరలు, పూర్తి ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం..

హానర్ విన్ టర్బో ధరల వివరాలు..

చైనాలో లాంచ్ అయిన ఈ హానర్ కొత్త స్మార్ట్​ఫోన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

12GB RAM + 256GB స్టోరేజ్: CNY 3,299 (సుమారు రూ. 46,000)

12GB RAM + 512GB స్టోరేజ్: CNY 3,599 (సుమారు రూ. 50,000)

16GB RAM + 512GB స్టోరేజ్: CNY 4,199 (సుమారు రూ. 60,000)

రంగులు: ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

అదిరిపోయే డిస్‌ప్లే అండ్ పవర్‌ఫుల్ ప్రాసెసర్..

డిస్‌ప్లే: ఈ హానర్ విన్​ టర్బోలో 6.79-ఇంచుల భారీ డిస్‌ప్లేను అందించారు. ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపించేలా స్మార్ట్‌ఫోన్ రంగంలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఏకంగా 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇవ్వడం విశేషం.

ప్రాసెసర్: ఇది పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 రేసింగ్ ఎడిషన్ చిప్‌సెట్, మాలి-G720 MC8 జీపీయూతో పనిచేస్తుంది. ఇందులో 16GB వరకు LPDDR5x ర్యామ్, 512GB వరకు అల్ట్రా-ఫాస్ట్ UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి.

నెట్‌వర్క్ బూస్టర్: లిఫ్టులు, అండర్ గ్రౌండ్ పార్కింగ్‌లు, హై-స్పీడ్ రైల్వే స్టేషన్ల వంటి సిగ్నల్ తక్కువగా ఉండే చోట్ల కూడా స్థిరమైన కమ్యూనికేషన్ కోసం ఇందులో ప్రత్యేకంగా 'C1+ RF' ఎన్‌హ్యాన్స్‌మెంట్ చిప్‌ను అమర్చారు.

10000ఎంఏహెచ్ బ్యాటరీతో..

80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ రివర్స్ ఛార్జింగ్: సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ లావుగా ఉంటుంది, కానీ కేవలం 7.98ఎంఎం థిక్‌నెస్, 216 గ్రాముల బరువుతోనే దీనిని డిజైన్ చేశారు. ఈ హానర్ విన్​ టర్బోలో 10,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవడానికి 27డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17.3 గంటల నిరంతర నావిగేషన్ లేదా 14.2 గంటల పాటు నాన్-స్టాప్ గేమింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

కెమెరా, అదనపు రక్షణ ఫీచర్లు..

కెమెరా సెటప్: వెనుక వైపు ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉన్న 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్ ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

కూలింగ్ సిస్టమ్: గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ అవ్వకుండా ఉండేందుకు 40,000 చదరపు మిల్లీమీటర్ల భారీ లిక్విడ్ కూలింగ్ ఏరియానుఏర్పాటు చేశారు.

మిలిటరీ గ్రేడ్ రక్షణ: ఈ హానర్ కొత్త ఫోన్‌కు ధూళి, నీటి నిరోధకత కోసం ఏకంగా IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా, కింద పడినా పగలకుండా ఉండేందుకు 'ఎస్​జీఎస్ గోల్డ్ స్టాండర్డ్ ఫైవ్-స్టార్ డ్రాప్, షాక్, క్రష్ రెసిస్టెన్స్' సర్టిఫికేషన్ లభించింది.

కనెక్టివిటీ: ఇందులో 5జీ, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, డ్యూయల్ స్పీకర్లు, భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

నమ్మశక్యం కాని బ్యాటరీ లైఫ్, అద్భుతమైన స్క్రీన్ బ్రైట్‌నెస్, అత్యంత బలమైన బాడీతో వస్తున్న ఈ హానర్ విన్ టర్బో త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్​లోకి కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More