ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా కొత్త రకం సైబర్ దాడులు జరుగుతున్నాయి. దీనిని 'ఘోస్ట్ పేరింగ్' (GhostPairing) స్కామ్‌గా పిలుస్తున్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా పౌరులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా అకౌంట్ హ్యాక్ అవ్వాలంటే ఓటీపీ లేదా సిమ్ స్వ్యాపింగ్ వంటివి అవసరం అవుతాయి. కానీ, ఈ ఘోస్ట్ పేరింగ్ స్కామ్‌లో అవేమీ లేకుండానే హ్యాకర్లు మీ వాట్సాప్‌లోకి ప్రవేశించగలరు.
అసలు ఈ 'ఘోస్ట్ పేరింగ్' ఎలా జరుగుతుంది?
వాట్సాప్‌లో ఉన్న 'డివైజ్ లింకింగ్' (Device Linking) ఫీచర్‌ను హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ మోసం ఎలా జరుగుతుందో 'సర్ట్-ఇన్' (CERT-In) తన నివేదికలో వివరించింది:
నమ్మకమైన సందేశం: బాధితులకు తమకు తెలిసిన వ్యక్తుల నుంచే వచ్చినట్లుగా ఒక సందేశం వస్తుంది. అందులో "హాయ్, ఈ ఫోటో చూడు" (Hi, check this photo) అని ఉంటుంది. దీనికి ఫేస్‌బుక్ ప్రివ్యూ తరహాలో ఒక లింక్ కూడా జత చేసి ఉంటుంది.
నకిలీ వెరిఫికేషన్: వినియోగదారు ఆ లింక్‌ను క్లిక్ చేయగానే ఒక వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఆ ఫోటో చూడాలంటే మీ ఐడెంటిటీని వెరిఫై చేయాలని అది అడుగుతుంది.
తెలియకుండానే అనుమతి: ఈ ప్రక్రియలో హ్యాకర్లు వాట్సాప్‌లోని “Link a device via phone number” అనే ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తారు. వినియోగదారుడు ఏదో ఫోటో వస్తుందని భావించి అక్కడ క్లిక్ చేయగానే, హ్యాకర్ బ్రౌజర్ మీ వాట్సాప్ అకౌంట్‌కు 'ట్రస్టెడ్ డివైజ్'గా లింక్ అయిపోతుంది.
ఎందుకు ప్రమాదకరం?
ఈ స్కామ్‌లో మీకు ఎలాంటి ఓటీపీ రాదు, మీ పాస్‌వర్డ్‌ను ఎవరూ దొంగిలించరు. కేవలం ఒక లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు తెలియకుండానే హ్యాకర్‌కు మీ అకౌంట్‌ను వాడటానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుంది. ఒక్కసారి లింక్ అయ్యాక, హ్యాకర్ మీ మెసేజ్‌లు చదవడం, మీ పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపడం వంటివి సులభంగా చేయగలరు.
జాగ్రత్త పడటం ఎలా?
కేంద్ర ప్రభుత్వం, సైబర్ భద్రతా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు:
{{/usCountry}}కేంద్ర ప్రభుత్వం, సైబర్ భద్రతా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు:
{{/usCountry}}లింక్‌లపై నిఘా: మీ స్నేహితులు లేదా బంధువుల నుంచి వచ్చినా సరే, అనుమానాస్పదంగా ఉండే లింక్‌లను క్లిక్ చేయకండి. ముఖ్యంగా "ఫోటోలు చూడటానికి వెరిఫై చేయండి" అనే వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
లింక్డ్ డివైజ్‌లను తనిఖీ చేయండి: మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Linked Devices ఆప్షన్‌ను తరచూ చూస్తుండాలి. అక్కడ మీకు తెలియని డివైజ్ ఏదైనా కనిపిస్తే వెంటనే 'లాగౌట్' చేయండి.
టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ వాట్సాప్ అకౌంట్‌కు టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి. ఇది అదనపు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సైబర్ నేరగాళ్లు మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 'సోషల్ ఇంజనీరింగ్' పద్ధతులతో మోసం చేస్తున్నారు. సాంకేతికత ఎంత పెరిగినా, మన అప్రమత్తతే మనకు రక్ష.