Hyundai Bayon on road price : హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు ఇలా..
Hyundai Bayon on road price : హ్యుందాయ్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసిన బేయాన్ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయిదే ఇది మీకోసమే. హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ ఆన్‌రోడ్ ప్రైజ్ డీటైల్స్ని ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. కొత్త ఎస్‌యూవీని ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దాని పేరు హ్యుందాయ్ బేయాన్. ఈ ఎస్యూవీ రూ. 9.9లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూం ధరతో అందుబాటులో ఉంది. అయితే, మీరు ఈ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ ఆన్‌రోడ్ ప్రైజ్..
హ్యుందాయ్ బేయాన్ హెచ్ఎక్స్2 పెట్రోల్ ఎంటీ- రూ. 11.93 లక్షలు
హెచ్ఎక్స్3 పెట్రోల్ ఎంటీ- రూ. 13.42 లక్షలు
హెచ్ఎక్స్3 ప్లస్ పెట్రోల ఎంటీ- రూ. 14.52 లక్షలు
హెచ్ఎక్స్5 పెట్రోల్ ఎంటీ- రూ. 15.31 లక్షలు
హెచ్ఎక్స్5 పెట్రోల్ ఎంటీ డీటీ- రూ. 15.49 లక్షలు
హెచ్ఎక్స్6 పెట్రోల్ ఎంటీ- రూ. 16.67 లక్షలు
హెచ్ఎక్స్6 పెట్రోల్ ఎంటీ డీటీ- రూ. 16.85 లక్షలు
హెచ్ఎక్స్5 పెట్రోల్ సీవీటీ- రూ. 17.01 లక్షలు
హెచ్ఎక్స్5 పెట్రోల్ సీవీటీ డీటీ- రూ. 17.19 లక్షలు
హెచ్ఎక్స్6 పెట్రోల్ సీవీటీ- రూ. 18.37 లక్షలు
హెచ్ఎక్స్8 పెట్రోల్ ఎంటీ- రూ. 18.53 లక్షలు
హెచ్ఎక్స్6 పెట్రోల్ సీవీటీ డీటీ- రూ. 18.56 లక్షలు
హెచ్ఎక్స్8 పెట్రోల్ ఎంటీ డీటీ- రూ. 18.71 లక్షలు
హెచ్ఎక్స్8 పెట్రోల్ సీవీటీ- రూ. 20.28 లక్షలు
హెచ్ఎక్స్10 పెట్రోల్ ఎంటీ- రూ. 20.42 లక్షలు
హెచ్ఎక్స్8 పెట్రోల్ సీవీటీ డీటీ- రూ. 20.47 లక్షలు
హెచ్ఎక్స్10 పెట్రోల్ ఎంటీ డీటీ- రూ. 20.60 లక్షలు
హెట్ఎక్స్10 పెట్రోల్ సీవీటీ- రూ. 22.06 లక్షలు
హెట్ఎక్స్10 పెట్రోల్ సీవీటీ డీటీ- రూ. 22.24 లక్షలు
అంటే హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 11.93లక్షల నుంచి రూ. 22.24 లక్షల వరకు ఉంటుందని అర్థం.
ఏదైనా కారును లాంచ్ చేసినప్పుడు సదరు ఆటోమొబైల్ సంస్థ, దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తుంది. కాగా ఆ కారు ఆన్‌రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్సులు వేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే కస్టమర్లు కారు కొనే ముందు ఎక్స్‌షోరూం ధరతో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇది బడ్జెట్ ప్లానింగ్‌కి ఉపయోగపడుతుంది.
హ్యుందాయ్ బేయాన్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్..
హెచ్‌టీ ఆటో విశ్లేషణ, ఆటోమొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హ్యుందాయ్ బేయాన్ మోడళ్లలో హెచ్ఎక్స్8 వేరియంట్ అత్యంత పిక్ చేయదగిన, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఇది టోకెన్ ప్రీమియంను ఎక్కువగా వసూలు చేసే టాప్-ఎండ్ మోడల్‌కు, బేసిక్ మోడళ్లకు మధ్య సరైన సమతుల్యతను పాటిస్తుంది.
ఇంజిన్, గేర్‌బాక్స్ కాంబినేషన్‌ను బట్టి ఈ హెచ్ఎక్స్8 వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.09 లక్షల నుంచి రూ. 16.68 లక్షల మధ్య నిర్ణయించారు. అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ టాప్ మోడల్ (హెచ్ఎక్స్10) స్థాయి విలాసాలు, సౌకర్యాలు, భద్రతా ఫీచర్లు దాదాపు ఈ హెచ్ఎక్స్8లోనే లభిస్తాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


