...
...
Next Story

Hyundai Creta Electric : రూ. 7లక్షల తక్కువ ధరకు క్రెటా ఎలక్ట్రిక్! హ్యుందాయ్ బంపర్ న్యూస్..

Hyundai Creta Electric : భారత ఈవీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తూ హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త బ్యాటరీ యాజ్​ ఏ సర్వీస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల క్రెటా ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర ఏకంగా రూ. 10.99 లక్షలకే లభిస్తోంది. పూర్తి వివరాలు..

Published on: Jul 3, 2026, 09:58:35 IST
Advertisement

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోలును మరింత సులభతరం చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. మార్కెట్లో మారుతీ సుజుకీ ఈ-విటారా, ఎంజీ విండ్సర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తూ.. తన పాపులర్ ఎస్‌యూవీ ‘క్రెటా ఎలక్ట్రిక్’లో బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (బీఏఏఎస్) ఓనర్‌షిప్ మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త స్కీమ్ కింద కారు కొనే కస్టమర్లు బ్యాటరీ ధరను మినహాయించి కేవలం వెహికల్ బాడీ (చాసిస్)కి మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కారు కొనుగోలు వ్యయం భారీగా తగ్గనుంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్- రూ. 7 లక్షల భారీ తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్..
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్..

సాధారణంగా బ్యాటరీతో కలిపి క్రెటా ఎలక్ట్రిక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 18.03 లక్షలుగా ఉండగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 24.70 లక్షల వరకు ఉంది. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన ‘బీఏఏఎస్’ స్కీమ్ ద్వారా క్రెటా ఈవీ ప్రారంభ ధర ఏకంగా రూ. 7.04 లక్షలు తగ్గి, కేవలం రూ. 10.99 లక్షలకే (ఎక్స్-షోరూమ్) అందుబాటులోకి రావడం విశేషం.

కారు కొనుగోలు చేసిన తర్వాత, కస్టమర్లు తాము తిరిగే కిలోమీటర్లను బట్టి బ్యాటరీ అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. క్రెటా ఈవీ కోసం హ్యుందాయ్ సంస్థ కిలోమీటరుకు రూ. 3.90 చొప్పున నామినల్ ఫీజును నిర్ణయించింది. దీనివల్ల కారు కొనేటప్పుడు పెట్టే పెట్టుబడి తగ్గడమే కాకుండా, భవిష్యత్తులో బ్యాటరీ పాడైతే రీప్లేస్‌మెంట్ ఖర్చులు భరించాలనే భయం కస్టమర్లకు ఉండదు. ఎందుకంటే బ్యాటరీ బాధ్యత పూర్తిగా కంపెనీదే అయి ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్- కొత్త ఫీచర్లు, ఛార్జింగ్ అప్‌డేట్స్..

ఈ సరికొత్త అప్‌డేట్‌తో పాటు కస్టమర్ల సౌకర్యార్థం హ్యుందాయ్ మరికొన్ని మార్పులు చేసింది. కారు ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఇంటిగ్రేటెడ్ సైడ్ ఫుట్ స్టెప్‌ను జోడించింది. అలాగే హెచ్‌సీ వేరియంట్లతో పాటు కస్టమర్ల డిమాండ్ మేరకు 7.4కేడబ్ల్యూ ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్‌ను ఉచిత ఇన్‌స్టాలేషన్‌తో కంపెనీ అందిస్తోంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్- పవర్‌ట్రెయిన్, రేంజ్ వివరాలు..

42కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్: ఇది సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 420 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది 135బీహెచ్​పీ పవర్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది.

51.4కేడబ్ల్యూహెచ్ లాంగ్ రేంజ్ బ్యాటరీ: ఇది సింగిల్ ఛార్జ్‌పై 510 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది శక్తివంతమైన 171బీహెచ్​పీ పవర్, 255ఎన్​ఎం టార్క్​ని జనరేట్ చేసే మోటార్‌ను కలిగి ఉంది. కేవలం 7.9 సెకన్లలోనే ఈ కారు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

ఈ కారును 100కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 39 నిమిషాల్లోనే 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. అదే ఇంట్లో ఉండే 11కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ద్వారా అయితే పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 4.5 గంటల సమయం పడుతుంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్- కార్పొరేట్ లుక్, లగ్జరీ ఫీచర్లు..

హ్యుందాయ్ క్రెటా ఈవీలో అధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.25 ఇంచుల ట్విన్ స్క్రీన్స్ (ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), వాయిస్ కమాండ్స్, బ్లూలింక్ కనెక్టివిటీ, 8-స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ ఏసీ, సింగిల్ పెడల్ డ్రైవింగ్ ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 అడాస్ సూట్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్) ఛార్జింగ్ సపోర్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ ఎస్‌యూవీ సొంతం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe