Car Discounts : హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు- రూ. 1 లక్ష వరకు! ఆఫర్ మార్చి 31 వరకే..

కొత్త కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ మోటార్ ఇండియా అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. గ్రాండ్ ఐ10 నియోస్, ఎక్సటర్​, ఐ20, అల్కాజార్ వంటి పాపులర్ మోడళ్లపై ఏకంగా రూ. 1 లక్ష వరకు నగదు తగ్గింపు, కార్పొరేట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Published on: Mar 8, 2026, 06:45:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఈ మార్చి నెలలో కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్లను తీసుకువచ్చింది. ఎంపిక చేసిన కార్ల మోడళ్లపై ఏకంగా రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్లలో క్యాష్​ డిస్కౌంట్లు, కార్పొరేట్ బెనిఫిట్స్ తో పాటు ఇతర స్పెషల్ డీల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మార్చి 18న లేదా స్టాక్ ఉన్నంత వరకు కొనుగోలు చేసే వారికి అదనంగా రూ. 20,000 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఈ ప్రయోజనాలు అన్నీ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.

హ్యుందాయ్​ కార్లపై భారీ డిస్కౌంట్లు..
హ్యుందాయ్​ కార్లపై భారీ డిస్కౌంట్లు..

ఏ కారుపై ఎంత తగ్గింపు?

హ్యుందాయ్ అల్కాజార్ : హ్యుందాయ్ నుంచి వచ్చిన త్రీ-రో ఎస్‌యూవీ అల్కాజార్‌పై ప్రస్తుతం రూ. 60,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. క్రెటాకు ఎగువ మోడల్ అయిన ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

హ్యుందాయ్ ఐ20: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 పై రూ. 48,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ధరను మరింత అందుబాటులోకి తెచ్చేలా ఎంట్రీ లెవల్ వేరియంట్ 'ఎరా' ధరను కూడా కంపెనీ సవరించింది. ఇప్పుడు దీని ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఫలితంగా దీనిపై రూ. 1లక్ష వరకు బెనిఫిట్స్​ పొందినట్టు అవుతుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో 82 బీహెచ్​పీ, సీవీటీ ఆటోమేటిక్‌తో 87 బీహెచ్​పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్​టర్​ : హ్యుందాయ్ నుంచి వచ్చిన మైక్రో ఎస్‌యూవీ ఎక్స్​టర్​పై రూ. 33,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. తక్కువ ధరలో ఎస్‌యూవీ ఫీల్ కోరుకునే నగరవాసులకు ఇది సరైన ఎంపిక. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఇంధన పొదుపును ఆశించే వారి కోసం కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జీ వేరియంట్ కూడా ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సిటీ డ్రైవింగ్‌కు అనువైన ప్రాక్టికల్ కారుగా పేరున్న గ్రాండ్ ఐ10 నియోస్‌పై ఈ నెలలో ఏకంగా రూ. 58,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇది మ్యాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

గమనిక: ఈ డిస్కౌంట్లు అనేవి షోరూమ్ లొకేషన్, మోడల్ వేరియంట్, స్టాక్ లభ్యతను బట్టి మారుతుంటాయి. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించాలని కంపెనీ సూచించింది.

హోండా కార్లపైనా డిస్కౌంట్లు..

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది మంచి సమయం. హోండా కార్స్ ఇండియా ఈ మార్చి నెలలో తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిపై భారీ పథకాలను ప్రకటించింది. డీలర్ల వద్ద ఉన్న ఇన్వెంటరీని తగ్గించుకోవడంతో పాటు ఆర్థిక సంవత్సరం ముగింపులో విక్రయాలను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో క్యాష్​ డిస్కౌంట్స్​, ఎక్స్​ఛేంజ్​- స్క్రాపేజ్ బోనస్‌లు, అలాగే లాయల్టీ రివార్డులు ఉన్నాయి.

హోండా సిటీ (పెట్రోల్)-

హోండా సిటీ పెట్రోల్ వెర్షన్లపై రూ. 1.56 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో 121 హెచ్​పీ పవర్​ని ఇచ్చే 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. వినియోగదారులు 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11.95 లక్షల నుంచి రూ. 16.07 లక్షల మధ్య ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More