భారత ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ వాహనాలకు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ భారీ ప్రణాళికలు రచిస్తోంది! ఒకేసారి రెండు కొత్త 7-సీటర్ కార్లను రంగంలోకి దించి, ఈ విభాగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ రెండు వాహనాలు ఒకే తరహా కొనుగోలుదారుల కోసం కాకుండా పూర్తిగా భిన్నమైన వినియోగదారుల వర్గాలను లక్ష్యంగా చేసుకుని వస్తున్నాయి. వీటిలో మొదటిది ‘నైరా’. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు ఎలక్ట్రిక్ (ఈవీ) రూపంలోనూ లభించే ఫ్యామిలీ ఎంపీవీ. రెండోది 'NI1i' (కోడ్ నేమ్). కియా సోరెంటో ఆధారంగా రూపొందుతున్న ఈ పెద్ద ఎస్యూవీ ద్వారా హ్యుందాయ్ తన ప్రీమియం లైనప్‌లోకి హైబ్రిడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.
ఇప్పటికే నైరా ప్రొడక్షన్ మోడల్‌ను కంపెనీ ఇండోనేషియాలో ఆవిష్కరించడంతో, భారత వెర్షన్ ఎలా ఉండబోతోందో స్పష్టమైన అంచనా వచ్చింది. మరోవైపు NI1i ఇంకా అభివృద్ధి దశలోనే ఉండగా, ఇటీవల రోడ్లపై పరీక్షిస్తుండగా కెమెరాలకు చిక్కింది.
ఈ నేపథ్యంలో ఈ 2 7 సీటర్ ఫ్యామిలీ కార్ల గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. హ్యుందాయ్ నైరా: పెట్రోల్, సీఎన్జీతో పాటు 490 కి.మీ రేంజ్ ఈవీ!
కియా కారెన్స్ క్లావిస్ ఆధారంగా హ్యుందాయ్ రూపొందించిన మోడలే ఈ నెైరా. ఈ రెండు కార్లు ప్రాథమిక డిజైన్, సాంకేతిక నిర్మాణాన్ని పంచుకున్నప్పటికీ, నైరాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు హ్యుందాయ్ పలు మార్పులు చేసింది. సరికొత్త ఫ్రంట్ బంపర్, విభిన్నమైన గ్రిల్ డిజైన్, ప్రత్యేక అల్లాయ్ వీల్స్, మార్పులు చేసిన రియర్ బంపర్‌తో దీనికి హ్యుందాయ్ మార్క్ రూపాన్ని ఇచ్చింది. ఇండోనేషియాలో ఆవిష్కరించిన ప్రొడక్షన్-స్పెక్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఏడు సీట్ల అమరికతో వస్తోంది.
కారు లోపలి భాగం (క్యాబిన్) ఎంతో ఆధునికంగా తీర్చిదిద్దారు. డ్యాష్‌బోర్డుపై రెండు 12.3-అంగుళాల డిస్ప్లేలు, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, టచ్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్‌పై హ్యుందాయ్ ప్రత్యేక గుర్తు అయిన నాలుగు చుక్కల డిజైన్ కనిపిస్తుంది. ఇండోనేషియాలో నైరా ఈవీని 42 kWh, 51.4 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందిస్తున్నారు. ఇవి వరుసగా 404 కిలోమీటర్లు, 490 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయని కంపెనీ ప్రకటించింది. పెద్ద బ్యాటరీ వెర్షన్ 171 హెచ్‌పీ పవర్‌ని, 255 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, చిన్న బ్యాటరీ ఆప్షన్ కొంత తక్కువ పవర్‌ని ఇస్తుంది. రెండు వేరియంట్లలోనూ ముందు చక్రాలకు శక్తినిచ్చే ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. ఇవి 100 kW వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. దీని సాయంతో కేవలం 39 నిమిషాల్లోనే బ్యాటరీని సున్నా నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
భారత మార్కెట్లోకి నైరాను ఎలక్ట్రిక్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) రెండు రూపాల్లోనూ తీసుకురావాలని హ్యుందాయ్ భావిస్తోంది. పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లను కియా కారెన్స్ క్లావిస్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే భారత మార్కెట్లో మారుతీ సుజుకీ ఎర్టిగా, ఎక్స్ఎల్6, కియా కారెన్స్ క్లావిస్ కార్లకు నైరా గట్టి పోటీనిస్తుంది.
{{/usCountry}}భారత మార్కెట్లోకి నైరాను ఎలక్ట్రిక్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) రెండు రూపాల్లోనూ తీసుకురావాలని హ్యుందాయ్ భావిస్తోంది. పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లను కియా కారెన్స్ క్లావిస్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే భారత మార్కెట్లో మారుతీ సుజుకీ ఎర్టిగా, ఎక్స్ఎల్6, కియా కారెన్స్ క్లావిస్ కార్లకు నైరా గట్టి పోటీనిస్తుంది.
{{/usCountry}}2027లో ఈ కారు భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మన దేశానికి సంబంధించిన పూర్తి ఇంజిన్ వివరాలు, స్పెసిఫికేషన్లను హ్యుందాయ్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
2. హ్యుందాయ్ NI1i: కియా సోరెంటో తరహాలో ప్రీమియం హైబ్రిడ్ ఎస్యూవీ!
నైరాతో పోలిస్తే 'NI1i' పూర్తిగా భిన్నమైన విభాగానికి చెందిన కారు. కియా సోరెంటో ఆధారంగా నిర్మిస్తున్న ఈ వాహనం మరింత పెద్దదిగా, విలాసవంతమైన 3-రో ప్రీమియం ఎస్‌యూవీగా రానుంది. ఇటీవల దక్షిణ కొరియాలో పూర్తిగా క్యామోఫ్లేజ్ కప్పిన ఈ కారు టెస్టింగ్ చిత్రాలు బయటకు వచ్చాయి. నిటారుగా ఉండే ఫ్రంట్ డిజైన్, చతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, ఫ్లాట్ రూఫ్‌లైన్, విశాలమైన వెనుక భాగంతో ఇది ఎంతో దృఢంగా కనిపిస్తోంది. పరీక్షా వాహనంపై అంటించిన హైబ్రిడ్ గుర్తింపు స్టిక్కర్‌ను బట్టి, దీనిని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో పరీక్షిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో కియా సోరెంటోను పెట్రోల్-హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లతో విక్రయిస్తున్నారు. అయితే భారత మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్న NI1i లో ఖచ్చితంగా ఏ తరహా హైబ్రిడ్ ఇంజిన్ ఇస్తారన్నది ఇంకా తెలియరాలేదు. హ్యుందాయ్ లైనప్‌లో అల్కజార్ కంటే పైస్థాయిలో దీనిని నిలబెట్టనున్నారు. మార్కెట్లోకి వచ్చాక మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, టాటా సఫారీ వంటి పెద్ద ఎస్‌యూవీలకు ఇది నేరుగా పోటీ ఇవ్వనుంది.
మహారాష్ట్ర ప్లాంట్‌లో తయారీ.. విడుదల ఎప్పుడంటే..
భారత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ ఈ NI1i ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. మహారాష్ట్రలోని హ్యుందాయ్ తలేగావ్ ప్లాంట్‌లో ఈ కారును తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. 2027 చివరిలో లేదా 2028లో దీనిని భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ కారు తుది పేరు, సాంకేతిక వివరాలు, విడుదల షెడ్యూల్‌పై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బడ్జెట్ ఫ్యామిలీ ఎంపీవీ నుంచి ప్రీమియం హైబ్రిడ్ ఎస్యూవీ వరకు రెండు భిన్నమైన 7-సీటర్ కార్లతో హ్యుందాయ్ రాబోయే రెండేళ్లలో భారత ఆటోమొబైల్ రంగంలో గట్టి పోటీకి సిద్ధమవుతోంది.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.