IBPS SO Recruitment 2026 : నిరుద్యోగులకు అలర్ట్- ఐబీపీఎస్ ఎస్ఓ రిక్రూట్​మెంట్​ ప్రాసెస్ షురూ..

IBPS SO Recruitment 2026 : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్​ఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు, ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రక్రియ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 1, 2026, 14:01:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్​ఓ) ఉద్యోగాల భర్తీకి 'CRP SPL-XVI' కింద అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఐబీపీఎస్​ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..
ఐబీపీఎస్​ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..

ఐబీపీఎస్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు..

బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని ఐబీపీఎస్ సూచించింది.

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జులై 1, 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: జులై 21, 2026
  • దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జులై 21, 2026

ఐబీపీఎస్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026- ఖాళీల వివరాలు..

ఐబీపీఎస్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026లో భాగంగా మొత్తం 745 పోస్టులకు గానూ వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి:

ఐటీ ఆఫీసర్- 301

అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్- 190

లా ఆఫీసర్- 105

రాజ్‌భాషా అధికారి- 89

హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్- 60

ఐబీపీఎస్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026- అర్హత ప్రమాణాలు..

వయోపరిమితి: అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న కట్-ఆఫ్ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.

సడలింపు: భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు వంటి రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఐబీపీఎస్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు రుసుము..

ఐబీపీఎస్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026 కోసం అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: రూ. 175

ఇతర అభ్యర్థులందరికీ : రూ. 850

ఐబీపీఎస్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక విధానం..

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో కొనసాగుతుంది.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: ప్రాథమిక వడపోత కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్ష: ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఈ పరీక్ష ఉంటుంది.

వ్యక్తిగత ఇంటర్వ్యూ: మెయిన్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.

చివరిగా మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.

ఐబీపీఎస్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా?

అర్హత గల అభ్యర్థులు కింది స్టెప్స్ ఫాలో అయి సులువుగా అప్లై చేసుకోవచ్చు:

  • మొదట ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ఓపెన్ చేయాలి.
  • హోంపేజీలో కనిపించే "CRP SPL-XVI Recruitment 2026" అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ ప్రాథమిక వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి.
  • ఆ ఐడీతో లాగిన్ అయి, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా భర్తీ చేయండి.
  • నోటిఫికేషన్‌లో అడిగిన సైజులో మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించండి.
  • ఫారమ్ సబ్మిట్ చేసే ముందు వివరాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోండి.
  • అంతా బాగుంది అనుకుంటే అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం కన్‌ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పెట్టుకోండి.

ఐబీపీఎస్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐబీపీఎస్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026 అప్లికేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More