...
...
Next Story

ఐసీఏఐ సీఏ జనవరి పరీక్ష 2026 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభం- ఇలా అప్లై చేసుకోండి..

ఐసీఏఐ సీఏ జనవరి పరీక్ష 2026 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలా అప్లై చేసుకోవాలి? రిజిస్ట్రేషన్​కి చివరి తేదీ ఏంటి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 4, 2025, 05:33:04 IST
Advertisement

భారతదేశంలోని చార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) వృత్తికి చెందిన అత్యున్నత సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), జనవరి 2026లో జరగబోయే సీఏ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. సీఏ కావాలని కలలు కంటున్న విద్యార్థులు ఇంటర్మీడియట్, ఫౌండేషన్, ఫైనల్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్ అధికారిక సర్వీసెస్ పోర్టల్ అయిన eservices.icai.org ను సందర్శించాలి. అధికారిక నోటీసు ప్రకారం, ఈ పరీక్షల ఫలితాలు మార్చ్​ 2026 నెలలో ప్రకటించే అవకాశం ఉంది.

ఐసీఏఐ సీఏ జనవరి 2026 పరీక్షలకు ఎలా దరఖాస్తు చేయాలి?

ఐసీఏఐ సీఏ జనవరి 2026 పరీక్ష వివరాలు..
ఐసీఏఐ సీఏ జనవరి 2026 పరీక్ష వివరాలు..

సీఏ జనవరి పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విధానం చాలా సులభం. ఈ కింది దశలను అనుసరించండి:

స్టెప్​ 1- ముందుగా అధికారిక icai.org వెబ్‌సైట్‌కి వెళ్లండి.

స్టెప్​ 2- హోమ్‌పేజీలో కనిపించే "Self Service Portal" (సెల్ఫ్ సర్వీస్ పోర్టల్) లింక్‌ను నొక్కండి.

స్టెప్​ 3- మీరు మొదటిసారిగా దరఖాస్తు చేసుకునే వారైతే, "First Time User" (ఫస్ట్ టైమ్ యూజర్) పై క్లిక్ చేసి, మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) ను సబ్మిట్ చేయండి.

స్టెప్​ 4- మీకు వచ్చిన లాగిన్ వివరాలతో లాగిన్ అయి, జనవరి పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి.

స్టెప్​ 5- ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. మీరు ఐసీఏఐ సీఏ జనవరి 2026 ఇంటర్మీడియట్, ఫైనల్ లేదా ఫౌండేషన్ పరీక్షలకు విజయవంతంగా రిజిస్టర్ అయినట్లే.

ఐసీఏఐ సీఏ జనవరి పరీక్షలు 2026: ముఖ్యమైన తేదీలు..

విద్యార్థులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య తేదీలను ఇక్కడ తెలుసుకోండి..

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి సీఏ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 16, 2025 చివరి తేదీ!

అప్లికేషన్ సవరణ విండో: దరఖాస్తు ఫారమ్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే, నవంబర్ 20, 2025 న కరెక్షన్ విండో ప్రారంభమై నవంబర్ 22, 2025తో ముగుస్తుంది. ఈ సమయంలో అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ eservices.icai.org లో లాగిన్ అయి తమ వివరాలను సరిదిద్దుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks