ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికల విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య వివాదం రాజుకుంది. భద్రతా కారణాల రీత్యా తాము భారత్‌లో ఆడలేమని బంగ్లాదేశ్ అంటుండగా.. "భారత్‌లో ఆడకపోతే పాయింట్లు కోల్పోవాల్సిందే" అని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీసీబీ ఈ వార్తలను ఖండించింది.
బీసీబీకి ఐసీసీ వార్నింగ్.. అలాంటిదేమీ లేదంటూ..

భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు పొలిటికల్ హీట్ పెరిగింది. ఐపీఎల్ వివాదం, భద్రతా కారణాల పేరుతో బంగ్లాదేశ్ బోర్డు చేస్తున్న హడావిడి, ఐసీసీ రియాక్షన్ వివరాలు ఇక్కడ చూడండి.
తమ మ్యాచ్‌లను భారత్ నుంచి వేరే దేశానికి మార్చాలని బీసీబీ కోరింది. దీనిపై ఐసీసీ సీరియస్‌గా స్పందిస్తూ.. "షెడ్యూల్ ప్రకారం భారత్‌లోనే ఆడాలి, లేదంటే ఆ మ్యాచ్‌ల పాయింట్లు వదులుకోవాల్సి ఉంటుంది" అని హెచ్చరించినట్లు సమాచారం.
అయితే బీసీబీ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ అమీనుల్ ఇస్లాం ఈ వార్తలను ఖండించారు. ఐసీసీ నుంచి తమకు ఎలాంటి అల్టిమేటం రాలేదని స్పష్టం చేశారు.
బీసీబీ అధికారిక ప్రకటన
ఈ గందరగోళంపై బీసీబీ ఒక లేఖ విడుదల చేసింది. "భారత్‌లో మా జట్టు భద్రతపై మేము వ్యక్తం చేసిన ఆందోళనలకు ఐసీసీ స్పందించింది. బంగ్లాదేశ్ జట్టు టోర్నీలో పూర్తిస్థాయిలో పాల్గొనేలా చూస్తామని, భద్రతకు ఢోకా ఉండదని ఐసీసీ హామీ ఇచ్చింది. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. మాకు అల్టిమేటం ఇచ్చారన్న వార్తలు పూర్తిగా అబద్ధం" అని బోర్డు చెప్పడం గమనార్హం.
తమ ఆటగాళ్ళ భద్రతే తమకు ముఖ్యమని, ఐసీసీతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటామని బీసీబీ తెలిపింది.
అసలు గొడవ ఎందుకు?
{{/usCountry}}తమ ఆటగాళ్ళ భద్రతే తమకు ముఖ్యమని, ఐసీసీతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటామని బీసీబీ తెలిపింది.
అసలు గొడవ ఎందుకు?
{{/usCountry}}బంగ్లాదేశ్ బోర్డు "భద్రతా కారణాలు" అని చెబుతున్నా.. దీని వెనుక అసలు కారణం వేరే ఉందని భారత వర్గాల వాదన. బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ 2026 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసింది. ఇది బీసీసీఐ ఆదేశాల మేరకే జరిగిందని బంగ్లాదేశ్ అనుమానం.
దీనికి నిరసనగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. ఇప్పుడు వరల్డ్ కప్ వేదికల విషయంలోనూ అభ్యంతరం చెబుతోంది.
ఐసీసీ స్టాండ్ ఏంటి?
బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వస్తే వారికి ఎలాంటి ముప్పు లేదని, దీనిపై విశ్వసనీయమైన సమాచారం ఏదీ లేదని ఐసీసీ స్పష్టం చేసినట్లు తెలిసింది. చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చడం కుదరదని, కో-హోస్ట్ అయిన శ్రీలంకకు మ్యాచ్‌లు మార్చడం సాధ్యం కాదని ఐసీసీ భావిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వివరాలు
టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. గ్రూప్-సి (Group C)లో ఉన్న బంగ్లాదేశ్ షెడ్యూల్ ఇలా ఉంది.
ఫిబ్రవరి 7: వెస్టిండీస్‌తో (కోల్‌కతా)
ఫిబ్రవరి 9: ఇటలీతో (కోల్‌కతా)
ఫిబ్రవరి 14: ఇంగ్లండ్‌తో (కోల్‌కతా)
ఫిబ్రవరి 17: నేపాల్‌తో (ముంబై)