మార్కెట్లలో వాల్యుయేషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పటికీ, కొన్ని ఎంపిక చేసిన కంపెనీలు తమ బలమైన ఆదాయ వృద్ధి అంచనాలు, మెరుగైన బ్యాలెన్స్ షీట్లు మరియు రంగాల వారీగా లభిస్తున్న సానుకూలతల కారణంగా పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన తాజా 'టాప్ ఫండమెంటల్ పిక్స్' (Top Fundamental Picks of the Month) నివేదికలో క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, హోటల్స్, బ్యాంకింగ్, ఆటో అనుబంధ రంగాలు, రియల్ ఎస్టేట్ మరియు రిటైల్ రంగాల నుండి 10 నాణ్యమైన మిడ్, స్మాల్-క్యాప్ స్టాక్స్‌ను ఇన్వెస్టర్ల ముందుకు తెచ్చింది.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సిఫార్సు చేసిన ఆ 10 షేర్ల పూర్తి వివరాలు ఇవే:
1. శ్రీరామ్ ప్రాపర్టీస్ (Shriram Properties)
ఈ జాబితాలో అత్యధిక లాభాల అంచనాతో ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ అగ్రస్థానంలో నిలిచింది. దీని ప్రస్తుత మార్కెట్ ధర (CMP) ₹89 కాగా, బ్రోకరేజ్ ₹125 టార్గెట్ ధరను నిర్ణయించింది. అంటే దాదాపు 41% పెరిగే అవకాశం ఉంది. కంపెనీకి ఉన్న బలమైన ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోతో పాటు, కోల్‌కతా ల్యాండ్ పార్సెల్ వివాదం పరిష్కారమైతే కంపెనీ విలువ మరింత అన్‌లాక్ అవుతుందని బ్రోకరేజ్ పేర్కొంది.
2. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ (Action Construction Equipment - ACE)
భారతదేశపు అగ్రగామి మెటీరియల్ హ్యాండ్లింగ్ మరియు క్రేన్ల తయారీ సంస్థ అయిన ఈ కంపెనీ షేరుకు ₹1,360 టార్గెట్ ధరను కేటాయించారు. ప్రస్తుత ధర ₹1,005 తో పోలిస్తే ఇది 35% అప్‌సైడ్‌ను సూచిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ ఎబిటా (EBITDA) మార్జిన్లు 15-16% కి చేరుకోవచ్చని అంచనా.
3. ఆస్ట్రల్ (Astral)
బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలోని ఈ ప్రముఖ షేరుకు ₹1,830 టార్గెట్ ధరను బ్రోకరేజ్ ఇచ్చింది. ప్రస్తుత ధర ₹1,367 నుండి ఇది 34% పెరిగే అవకాశం ఉంది. ప్లంబింగ్ మరియు కెమికల్ వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ (Restructuring) ద్వారా రాబోయే 4-5 ఏళ్లలో 'ఆస్ట్రల్ కెమీ' విభాగం 2.5 రెట్లు రాబడి వృద్ధిని నమోదు చేయవచ్చని నివేదిక పేర్కొంది.
4. ఇంజనీర్స్ ఇండియా (Engineers India)
హైడ్రోకార్బన్ కన్సల్టెన్సీతో పాటు గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయల్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఈ ప్రభుత్వ రంగ సంస్థ బలంగా దూసుకుపోతోంది. ప్రస్తుత ధర ₹240 కాగా, బ్రోకరేజ్ టార్గెట్ ధర ₹315 గా నిర్ణయించింది (31% లాభాల అంచనా).
5. జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్ (ZF Commercial Vehicle)
{{/usCountry}}హైడ్రోకార్బన్ కన్సల్టెన్సీతో పాటు గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయల్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఈ ప్రభుత్వ రంగ సంస్థ బలంగా దూసుకుపోతోంది. ప్రస్తుత ధర ₹240 కాగా, బ్రోకరేజ్ టార్గెట్ ధర ₹315 గా నిర్ణయించింది (31% లాభాల అంచనా).
5. జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్ (ZF Commercial Vehicle)
{{/usCountry}}కమర్షియల్ వాహనాల బ్రేకింగ్ సొల్యూషన్స్ రంగంలో లీడర్‌గా ఉన్న ఈ కంపెనీ అప్‌కమింగ్ సేఫ్టీ నిబంధనల (ESC, ADAS సిస్టమ్స్) వల్ల భారీగా లబ్ధి పొందనుంది. ప్రస్తుత ధర ₹2,482 ఉండగా, దీని టార్గెట్ ధర ₹3,170 గా ఉంది (28% అప్‌సైడ్).
6. ఐటీసీ హోటల్స్ (ITC Hotels)
మంచి వృద్ధి పథంలో ఉన్న ఐటీసీ హోటల్స్ షేరుకు ₹220 టార్గెట్ ధరను ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇచ్చింది. ప్రస్తుత ధర ₹179 తో పోలిస్తే ఇది 23% లాభాన్ని సూచిస్తోంది. కంపెనీ అనుసరిస్తున్న అసెట్-లైట్ మోడల్ (Asset-light model), విస్తరణ ప్రణాళికలు ఆదాయ వృద్ధికి దోహదం చేయనున్నాయి.
7. బ్లూస్టోన్ జ్యువెలరీ (Bluestone Jewellery)
డిజిటల్-ఫస్ట్ జ్యువెలరీ రిటైలర్ అయిన బ్లూస్టోన్ షేరు ప్రస్తుత ధర ₹568 నుండి ₹700 కి (23% అప్‌సైడ్) చేరవచ్చని బ్రోకరేజ్ అంచనా వేసింది. FY26-FY30 మధ్య ఈ కంపెనీ ఏటా 50% రెవెన్యూ వృద్ధిని (CAGR) లక్ష్యంగా పెట్టుకుంది.
8. నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya)
ఈ ప్రముఖ హెల్త్‌కేర్ చైన్ రాబోయే 2-3 ఏళ్లలో ₹3,000 కోట్ల మూలధన వ్యయం (Capex) చేయాలని యోచిస్తోంది. కేమాన్ ఐలాండ్స్, యూకే కార్యకలాపాల విస్తరణ ద్వారా కంపెనీ ఆదాయం మరింత పెరగనుంది. ప్రస్తుత ధర ₹1,962 కాగా, టార్గెట్ ధర ₹2,310 (18% పెరిగే అవకాశం).
9. సౌత్ ఇండియన్ బ్యాంక్ (South Indian Bank)
అధిక లాభాలనిచ్చే రిటైల్ మరియు MSME రుణాల వైపు బ్యాంక్ మొగ్గు చూపుతుండటం, తక్కువ నిర్వహణ ఖర్చుల వల్ల బ్యాంక్ లాభదాయకత పెరగనుంది. ప్రస్తుత ధర ₹45 కాగా, టార్గెట్ ధర ₹52 (16% లాభాల అంచనా).
10. అపోలో టైర్స్ (Apollo Tyres)
రబ్బరు, ముడిచమురు ధరల తగ్గుదల కారణంగా ఈ టైర్ల తయారీ సంస్థకు ముడిసరుకు ఖర్చులు తగ్గనున్నాయి. బలమైన బ్యాలెన్స్ షీట్, కెపాసిటీ విస్తరణల నేపథ్యంలో బ్రోకరేజ్ ఈ స్టాక్‌ను 'బై' (Buy) కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుత ధర ₹432 కాగా, టార్గెట్ ధర ₹500 (16% అప్‌సైడ్).