ICSE, ISC ఫలితాలు 2026 ఎప్పుడు? మార్క్​ షీట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ICSE (10వ తరగతి), ISC (12వ తరగతి) పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 2026 చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తమ రోల్ నంబర్ వివరాలతో అధికారిక వెబ్‌సైట్ లేదా డిజిలాకర్ ద్వారా ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.

Published on: Mar 29, 2026, 05:37:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్​సీఈ) నిర్వహించిన 10వ తరగతి (ఐసీఎస్​ఈ), 12వ తరగతి (ఐఎస్​సీ) బోర్డు పరీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరీక్షల్లో ఐసీఎస్ఈ మార్చి 30తో, ఐఎస్‌సీ ఏప్రిల్ 6వ తేదీతో పూర్తి కానున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల చూపు ఫలితాలపై ఉంటుంది. ఎగ్జామ్​ రిజల్ట్స్​ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు.

ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ పరీక్షల ఫలితాలు 2026.. (PTI)
ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ పరీక్షల ఫలితాలు 2026.. (PTI)

ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ ఫలితాలు ఎప్పుడు రావచ్చు?

గత గణాంకాలను పరిశీలిస్తే, 2025లో ఏప్రిల్ 30న, 2024లో మే 6వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. ఇదే ధోరణిని బట్టి చూస్తే, ఈ ఏడాది కూడా ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం మెండుగా ఉంది. సాధారణంగా బోర్డు అధికారులు ఒకే రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రెండు తరగతుల ఫలితాలను విడుదల చేస్తారు.

ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ ఫలితాలను ఎక్కడ చూసుకోవాలి?

విద్యార్థులు తమ ఫలితాలను కింది అధికారిక వెబ్‌సైట్లలో చూడవచ్చు:

results.cisce.org

cisce.org

ఫలితాల కోసం విద్యార్థులు తమ కోర్సు కోడ్, యూఐడీ, ఇండెక్స్ నంబర్, క్యాప్చా కోడ్‌ సిద్ధంగా ఉంచుకోవాలి. వెబ్‌సైట్‌తో పాటు డిజిలాకర్ యాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా మార్కులను తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫలితాల కార్డులో సబ్జెక్టుల వారీగా మార్కులు, మొత్తం మార్కులు, క్వాలిఫైయింగ్ స్టేటస్ వంటి వివరాలు ఉంటాయి.

ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ ఫలితాలు 2026- ఉత్తీర్ణత మార్కులు ఎంత?

పరీక్షలో పాస్ కావాలంటే విద్యార్థులు కనీసం 33 శాతం మార్కులు సాధించాలి. అయితే సబ్జెక్టుల వారీగా చూస్తే ఉత్తీర్ణత మార్కులు 35 శాతంగా నిర్ణయించారు.

ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి?

మొదటి ప్రక్రియ: అధికారిక వెబ్‌సైట్ ద్వారా-

మొదట cisce.org వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్ పేజీలో ICSE లేదా ISC Result 2026 లింక్‌పై క్లిక్ చేయండి.

మీ ఇండెక్స్ నంబర్, యూఐడీ వివరాలను నమోదు చేయండి.

స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి 'Submit' బటన్ నొక్కండి.

మీ మార్కుల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోండి.

2వ ప్రక్రియ: డిజిలాకర్ ద్వారా

మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిలాకర్ యాప్ ఓపెన్ చేయండి లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

మీ ఆధార్ వివరాలతో లాగిన్ అవ్వండి.

'Education' సెక్షన్‌లోకి వెళ్లి 'CISCE'ని ఎంచుకోండి.

మీ తరగతిని (ICSE/ISC) సెలెక్ట్ చేసి, ఇండెక్స్ నంబర్, యూఐడీ ఇవ్వండి.

సబ్మిట్ చేయగానే మీ మార్క్ షీట్ పీడీఎఫ్ రూపంలో కనిపిస్తుంది.

ఆన్‌లైన్‌లో లభించే మార్కుల షీట్ కేవలం తాత్కాలిక సమాచారం కోసం మాత్రమే. విద్యార్థులు తమ ఒరిజినల్ మార్కుల జాబితాను సంబంధిత పాఠశాలల నుంచి సేకరించాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ cisce.orgని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. ఐసీఎస్ఈ, ఐఎస్‌సీ ఫలితాల కోసం కనీస ఉత్తీర్ణత మార్కులు ఎంత?

ఐసీఎస్ఈ (10వ తరగతి) విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ, మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అదేవిధంగా, ఐఎస్‌సీ (12వ తరగతి) విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత మార్కులు 35 శాతంగా నిర్ణయించారు. ఒకవేళ ఏవైనా సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వస్తే, బోర్డు నిర్వహించే ఇంప్రూవ్‌మెంట్ లేదా కంపార్ట్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.

2. వెబ్‌సైట్ పనిచేయకపోతే ఫలితాలను మరే విధంగా తెలుసుకోవచ్చు?

ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉండి సర్వర్ మొరాయిస్తే, మీరు ఎస్​ఎంఎస్​ ద్వారా సులభంగా ఫలితాలు పొందవచ్చు. ఇందుకోసం మీ మొబైల్ మెసేజ్ బాక్స్‌లో 'ICSE <స్పేస్> మీ ఏడంకెల యూనిక్ ఐడి' లేదా 'ISC <స్పేస్> మీ ఏడంకెల యూనిక్ ఐడి' అని టైప్ చేసి 09248082883 నంబర్‌కు పంపాలి. వెంటనే మీ మార్కుల వివరాలు మీ మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తాయి. అలాగే Digilocker యాప్ ద్వారా కూడా మీ డిజిటల్ మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More