...
...
Next Story

Kia Syros EV : పెట్టిన డబ్బుకు వర్త్! కియా సైరోస్​ ఈవీలో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్ ఇదే..

కొత్త కియా సైరోస్​ ఈవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ సైరోస్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి చెందిన వాల్యూ ఫర్​ మనీ వేరియంట్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 11, 2026, 06:45:32 IST
Advertisement

కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లోకి కియా సంస్థ సరికొత్త సైరోస్ ఈవీని తీసుకువచ్చింది. ఇందులో అత్యధికంగా ఆకట్టుకుంటున్న వేరియంట్ 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న హెచ్‌టీఎక్స్ ట్రిమ్! ఎక్కువ దూరం ప్రయాణించేలా 526 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌ని ఇస్తూనే, టాప్-ఎండ్ మోడళ్లలా భారీ ధర ఉండకుండా రోజువారీ అవసరాలకు సరిపడే ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లను ఇది కలిగి ఉంది.

కియా సైరోస్​ ఈవీలో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్ వివరాలు..
కియా సైరోస్​ ఈవీలో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్ వివరాలు..

ఈ నేపథ్యంలో కియా సైరోస్​ ఈవీలోని ఈ వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

కియా సైరోస్​ ఈవీ- ఇదే వాల్యూ ఫర్​ మనీ వేరియంట్..

చాలా మంది కొనుగోలుదారులకు కియా సైరోస్​ ఈవీ హెచ్‌టీఎక్స్ 51.4 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర, ఫీచర్ల పరంగా సరైన సమతుల్యతను ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.18 లక్షలుగా ఉంది. ఇది హెచ్‌టీఎక్స్+, ఎక్స్-లైన్ వేరియంట్ల కంటే తక్కువ ధరలో లభిస్తూనే, పెద్ద బ్యాటరీ అలాగే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ సౌకర్యాన్ని అందిస్తుంది.

ప్రతిరోజూ వాడకం కోసం ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీలో అత్యంత కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. రియర్ డిఫాగర్, రియర్ వైపర్ అండ్ వాషర్, రియర్ పార్సెల్ ట్రే, స్లైడింగ్ అండ్ రెక్లైనింగ్ రియర్ సీట్లు, 60:40 స్ప్లిట్ రియర్ సీట్, రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఎల్ఈడీ క్యాబిన్ లైటింగ్ వంటివి హెచ్‌టీఎక్స్ వేరియంట్‌లో లభిస్తాయి. ఎక్స్‌టెండెడ్-రేంజ్ వెర్షన్‌లో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఓటీఏ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా జతచేశారు. ఇది భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఉంటుంది.

ఖరీదైన వేరియంట్లకు మాత్రమే పరిమితం కాకుండా కీలకమైన సేఫ్టీ ఫీచర్లు అన్నీ వర్షన్లలో లభించడం సైరోస్ ఈవీ ప్రత్యేకత. ప్రతి వెర్షన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేకులు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

ఈ సైరోస్ ఈవీ 42 కేడబ్ల్యూహెచ్, 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. పెద్ద బ్యాటరీ 171 బీహెచ్‌పీ పవర్, 255 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. చిన్న బ్యాటరీ 135 బీహెచ్‌పీ పవర్, 255 ఎన్ఎం టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.

51.4 కేడబ్ల్యూహెచ్ వెర్షన్ ఏఆర్​ఏఐ-ధృవీకరించిన 526 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని, అలాగే 42 కేడబ్ల్యూహెచ్ వెర్షన్ 443 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కియా చెబుతోంది. పెద్ద బ్యాటరీ కేవలం 8.1 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు.

చార్జింగ్ విషయానికి వస్తే, 11 కిలోవాట్ ఏసీ, 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 100 కిలోవాట్ డీసీ చార్జర్ సహాయంతో రెండు బ్యాటరీ వెర్షన్లు కేవలం 39 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతాయని కియా వెల్లడించింది.

కియా సైరోస్​ ఈవీ- కలర్స్, వేరియంట్లు..

ఈ సైరోస్ ఈవీ తొమ్మిది ఎక్స్‌టీరియర్ రంగులు, మూడు ఇంటీరియర్ థీమ్‌లలో అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ ఎక్స్-లైన్ కేవలం పెద్ద బ్యాటరీతో మాత్రమే లభిస్తుంది.

ఈ సైరోస్ ఈవీ ధర రూ.13.50 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంది. ఐదు ట్రిమ్ లెవెల్స్‌లో మొత్తం ఏడు వేరియంట్లలో ఇది లభిస్తుంది. భారత మార్కెట్లో కియా నుంచి వస్తున్న రెండొవ మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ మోడల్ ఇది. బ్రాండ్ ఈవీ లైనప్‌లో కారెన్స్ క్లావిస్ ఈవీ కంటే కింద స్థానంలో నిలిచింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe