...
...
Next Story

Tata Nexon : బెస్ట్​ సెల్లింగ్ ఎస్​యూవీ టాటా నెక్సాన్​లో.. వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఏది?

Tata Nexon value for money variants : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. అయితే ఇందులో ఉన్న డజన్ల కొద్దీ వేరియంట్లలో ఏది కొనాలా అని కన్ఫ్యూజ్ అవ్వడం సాధారణం! ఈ నేపథ్యంలో ఫీచర్లు, బడ్జెట్ పరంగా పర్ఫెక్ట్ ఛాయిస్ ఏదో ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jun 29, 2026, 12:20:58 IST
Advertisement

భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్‌కు చెందిన 'టాటా నెక్సాన్' తిరుగులేని అమ్మకాలతో దూసుకుపోతోంది. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ ఉండటంతో ఎస్‌యూవీ ప్రియులు దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే షోరూమ్‌కి వెళ్లిన కస్టమర్లకు టాటా నెక్సాన్ వేరియంట్ల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం! ప్రస్తుతం ఈ కారు స్మార్ట్, ప్యూర్+, క్రియేటివ్, క్రియేటివ్+, ఫియర్‌లెస్+ అనే ఐదు ప్రధాన ట్రిమ్స్‌లో లభిస్తోంది.

టాటా నెక్సాన్ వాల్యూ ఫర్​ మనీ వేరియంట్ ఏది?
టాటా నెక్సాన్ వాల్యూ ఫర్​ మనీ వేరియంట్ ఏది?

దీనికి తోడు సన్‌రూఫ్ కోసం (ఎస్), పనోరమిక్ సన్‌రూఫ్ కోసం (పీఎస్), అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ కోసం (ఏ) వంటి సబ్-వేరియంట్లు కూడా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆప్షన్లలో లభించే ఈ ఎస్‌యూవీ ధరలు రూ. 7.37 లక్షల నుంచి రూ. 14.22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇంత పెద్ద లైనప్‌లో సగటు కస్టమర్‌కు పైసా వసూల్ అన్పించే బెస్ట్ వేరియంట్ ఏది అంటే.. కచ్చితంగా టాటా నెక్సాన్ ‘క్రియేటివ్+’ అని చెప్పవచ్చు.

ఎందుకు 'క్రియేటివ్+' వేరియంట్ బెస్ట్ ఛాయిస్?

బడ్జెట్ పరిమితులు ఉంటూనే.. లగ్జరీ కార్లలో ఉండే ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారికి టాటా నెక్సాన్ క్రియేటివ్+ వేరియంట్ ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్‌లా పనిచేస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్లకు పెట్టే భారీ ధరతో పనిలేకుండా, నిత్య జీవితంలో కచ్చితంగా అవసరమయ్యే అప్‌డేటెడ్ టెక్నాలజీ ఫీచర్లన్నీ టాటా మోటార్స్ ఇందులో అందించింది. అందుకే ఇది నెక్సాన్ లైనప్‌లోనే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్​గా నిలిచింది.

టాటా నెక్సాన్ క్రియేటివ్+ వేరియంట్‌లో లభించే ఫీచర్లు ఇవే..

ఎక్స్‌టీరియర్ లుక్: ఈ వేరియంట్‌లో 16-ఇంచుల స్టైలిష్ అలాయ్ వీల్స్, సీక్వెన్షియల్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్ లాంప్స్ వస్తాయి. ఇవి కారుకు రోడ్ ప్రెజెన్స్‌తో పాటు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

ఇన్ఫోటైన్‌మెంట్: ఈ ఎస్​యూవీలో భారీ 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది.

సేఫ్టీ ఫీచర్లు: ఈ ప్రైస్ రేంజ్‌లో మరే కారులో లేని విధంగా 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి హై-ఎండ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

టాటా నెక్సాన్ క్రియేటివ్+ ధర ఎంత? ఎందుకు కొనాలి?

టాటా నెక్సాన్ క్రియేటివ్+ వేరియంట్ ధరలు రూ. 10.34 లక్షల నుంచి రూ. 13.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉన్నాయి. "టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఫియర్‌లెస్‌కు భారీగా అదనపు డబ్బులు పెట్టే కంటే, క్రియేటివ్+ ఎంచుకోవడం వల్ల కస్టమర్లకు భారీగా డబ్బు ఆదా అవుతుంది," అని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని ట్రాఫిక్‌లో కారును నడపడానికి, పార్కింగ్ చేయడానికి ఇందులో ఇచ్చే 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. లోయర్ వేరియంట్లలో అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ లైటింగ్ ఉండవు కాబట్టి అవి చూడటానికి కాస్త సాధారణంగా అన్పిస్తాయి. అంతేకాదు, ఈ క్రియేటివ్+ ట్రిమ్ పెట్రోల్, డీజిల్, సీఎన్జీ మూడు ఇంజన్ ఆప్షన్లలోనూ.. మాన్యువల్, ఏఎంటీ, డీసీఏ గేర్‌బాక్స్ కాంబినేషన్లలో లభిస్తుండటం విశేషం. వీటిల్లో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe