IIFCL Recruitment 2026 : నెలకు రూ. 55వేల వరకు జీతంతో ప్రభుత్వ ఉద్యోగం- ఇలా అప్లై చేసుకోండి..
భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఐఐఎఫ్‌సీఎల్.. గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 37 ఖాళీల కోసం ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, బిహేవియరల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దేశంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వ రంగ సంస్థ ఐఐఎఫ్‌సీఎల్ (ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్.. 2026 ఏడాదికి గానూ భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్), గ్రేడ్ బీ (మేనేజర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఐఐఎఫ్సీఎల అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఈ నేపథ్యంలో ఐఐఎఫ్‌సీఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐఐఎఫ్‌సీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- ఖాళీల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 37 పోస్టులను భర్తీ చేస్తున్నారు:
అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ): 33 పోస్టులు
మేనేజర్ (గ్రేడ్ బీ): 04 పోస్టులు
ఐఐఎఫ్‌సీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల ప్రారంభం: మార్చి 18, 2026 (నేటి నుంచే)
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2026
ఐఐఎఫ్‌సీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థుల ప్రతిభను వివిధ కోణాల్లో పరీక్షించడానికి ఐఐఎఫ్‌సీఎల్ ఒక మల్టిపుల్ లెవల్ సెలక్షన్ ప్రాసెస్‌ని రూపొందించింది. ప్రతి దశలోనూ ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే తదుపరి దశకు అర్హత పొందుతారు.
1. స్క్రీనింగ్:
తొలి దశలో అభ్యర్థుల దరఖాస్తులు, విద్యార్హతలు, ఇతర వివరాల ఆధారంగా స్క్రీనింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే రాత పరీక్షకు పిలుస్తారు.
2. రాత పరీక్ష:
ఐఐఎఫ్‌సీఎల్ రిక్రూట్‌మెంట్ 2026కి సంబంధించిన ఈ దశలో అభ్యర్థుల విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఈ కింది అంశాలలో పరీక్షిస్తారు:
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఇంగ్లీష్ లాంగ్వేజ్
రీజనింగ్ ఎబిలిటీ
కరెంట్ అఫైర్స్
డొమైన్ నాలెడ్జ్ (ముఖ్యంగా ప్రాజెక్ట్ ఫైనాన్స్, రిస్క్ మేనేజ్మెంట్)
3. బిహేవియరల్ టెస్ట్ :
అభ్యర్థి వ్యక్తిత్వం, డెసిషన్ మేకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ ఉద్యోగానికి వారు ఎంతవరకు సరిపోతారో ఈ పరీక్ష ద్వారా అంచనా వేస్తారు.
4. ఇంటర్వ్యూ :
చివరి దశలో అభ్యర్థికి ఉన్న వృత్తిపరమైన అవగాహన, అనుభవం, మొత్తం సామర్థ్యాన్ని నిపుణుల కమిటీ ప్రత్యక్షంగా పరీక్షిస్తుంది.
ఐఐఎఫ్‌సీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు చేయడం ఎలా?
ఆసక్తి గల అభ్యర్థులు ఐఐఎఫ్‌సీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, కెరీర్ విభాగంలో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌లోని విద్యార్హతలు, వయస్సు పరిమితిని క్షుణ్ణంగా చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఐఐఎఫ్‌సీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- అర్హత..
విద్యార్హత- పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఎల్ఎల్బీ, బీక్ తత్సమానం.
వయస్సు పరిమితి- 40 ఏళ్ల లోపు.
మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ని చూడాల్సి ఉంటుంది.
ఐఐఎఫ్‌సీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు చేసుకోవడం ఎలా?..
ఐఐఎఫ్‌సీఎల్ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. అభ్యర్థులు ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తు పూర్తి చేయడానికి ఈ కింది దశలను అనుసరించాలి:
అధికారిక వెబ్‌సైట్ సందర్శన: మొదటగా ఐఐఎఫ్‌సీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను (www.iifcl.in) సందర్శించి, 'Careers' విభాగంలో రిక్రూట్‌మెంట్ లింక్‌ను క్లిక్ చేయాలి.
ప్రాథమిక రిజిస్ట్రేషన్: మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి ప్రాథమిక వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ లభిస్తాయి.
దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయడం: మీ విద్యా అర్హతలు, వృత్తిపరమైన అనుభవం, ఇతర వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.
పత్రాల అప్‌లోడ్: మీ ఫోటో, సంతకం, అవసరమైన విద్యార్హత ధృవీకరణ పత్రాలను నిర్ణీత ఫార్మాట్‌లో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
ఫీజు చెల్లింపు: నిర్దేశించిన అప్లికేషన్ ఫీజును డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
సబ్మిషన్: అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ఐఐఎఫ్‌సీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు..
ఐఐఎఫ్‌సీఎల్ తన ఉద్యోగులకు మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ వేతన ప్యాకేజీని అందిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఇతర ఆఫీసర్ క్యాడర్ పోస్టులతో పోలిస్తే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్)- సుమారు రూ. 44,500
గ్రేడ్ బీ (మేనేజర్)- సుమారు రూ. 55,200
అదనపు ప్రయోజనాలు:
కేవలం బేసిక్ పే మాత్రమే కాకుండా, ఈ కింది ప్రయోజనాలు కూడా లభిస్తాయి:
అలవెన్సులు: ఇంటి అద్దె భత్యం, కరువు భత్యం, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్.
వైద్య సౌకర్యాలు: ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం.
కెరీర్ వృద్ధి: ప్రతిభ ఆధారంగా ఉన్నత పదవులకు చేరుకోవడానికి క్రమం తప్పకుండా ప్రమోషన్లు, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి.
ఇతర బెనిఫిట్స్: లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ), గ్రాట్యుటీ, పెన్షన్ పథకాలు కూడా వర్తిస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


