...
...
Next Story

ఐఐఎంలలో యూజీ కోర్సులు- ఇంటర్​ తర్వాత ఆప్షన్స్​ ఇవి..

ఐఐఎంలలో చేరాలంటే డిగ్రీ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు! ఇప్పుడు ఇంటర్​ తర్వాతే ఐఐఎంలలో చేరవచ్చు. ఈ మేరకు ఐఐఎంలు యూజీ కోర్సులను అందిస్తున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Dec 14, 2025, 05:58:36 IST
Advertisement

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో చదవాలనుకునే విద్యార్థులు ఇకపై గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు! పలు ఐఐఎంలు ఇప్పుడు ఇంటర్ (12వ తరగతి) పూర్తయిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అండర్‌గ్రాడ్యుయేట్ (యూజీ), ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.

ఐఐఎంలలో యూజీ కోర్సులు- పూర్తి వివరాలు..
ఐఐఎంలలో యూజీ కోర్సులు- పూర్తి వివరాలు..

ఈ మార్పుతో విద్యార్థులకు మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, డేటా సైన్స్, పబ్లిక్ పాలసీ, డిజిటల్ బిజినెస్ వంటి కీలక విభాగాల్లోకి ముందస్తుగా ప్రవేశించే అవకాశం లభిస్తుంది.

ఐఐఎంలలో యూజీ కోర్సులు- ప్రోగ్రామ్స్​ టార్గెట్​..

ఈ కోర్సుల ముఖ్య లక్ష్యం ఏంటంటే.. విద్యార్థుల్లో బలమైన విద్యా పునాది, అపారమైన విశ్లేషణ సామర్థ్యాలు, పరిశ్రమకు అవసరమయ్యే సంసిద్ధతను పెంపొందించడం. చాలా సందర్భాల్లో, ఈ ప్రోగ్రామ్‌లు పోస్ట్-గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ విద్యకు (ఎంబీఏ/పీజీపీ) కూడా మార్గం సుగమం చేస్తాయి.

ప్రస్తుతానికి, అన్ని ఐఐఎంలు అండర్‌గ్రాడ్యుయేట్ లేదా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం), బీబీఏ, బీఎంఎస్​, బీఎస్సీ, సరికొత్త రంగాల్లో ప్రత్యేక డిగ్రీలు ఉన్నాయి.

ఐఐఎంలలో అందుబాటులో ఉన్న అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల వివరాలు:

  1. ఐఐఎం అమృతసర్: ఫైవ్-ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) - ఇంటిగ్రేటెడ్ యూజీ + ఎంబీఏ

2. ఐఐఎం బెంగళూరు:

బీబీఏ ఇన్ డిజిటల్ బిజినెస్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (బీబీఏ-డీబీఈ)

బీఎస్సీ (ఆనర్స్) ఇన్ ఎకనామిక్స్ / డేటా సైన్స్

3. ఐఐఎం బోధ్‌గయ: ఫైవ్-ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) - బీబీఏ + ఎంబీఏ

5. ఐఐఎం జమ్ము: ఫైవ్-ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) - బీబీఏ + ఎంబీఏ

6. ఐఐఎం కోజికోడ్: బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (బీఎంఎస్​) - ఆనర్స్ విత్ రీసెర్చ్

7. ఐఐఎం లక్నో: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్​) ఇన్ బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్- ఎకనామిక్స్ (2026 నుంచి ప్రారంభం)

8. ఐఐఎం ముంబై: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్​) ఇన్ డిజిటల్ సైన్సెస్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (2026 నుంచి, పుణె క్యాంపస్)

9. ఐఐఎం రాంచీ: ఫైవ్-ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) - (మూడేళ్ల తర్వాత బీబీఏతో ఎగ్జిట్ ఆప్షన్)

10. ఐఐఎం రోహ్‌తక్: ఫైవ్-ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) - బీబీఏ + ఎంబీఏ

11. ఐఐఎం సంబల్‌పూర్: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్​) ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ పాలసీ

12. ఐఐఎం షిల్లాంగ్: ఫైవ్-ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) - బీబీఏ + ఎంబీఏ

13. ఐఐఎం సిర్మూర్: బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (బీఎంఎస్​) - ఫ్లెక్సిబుల్ బీబీఏ/బీఎంఎస్​ మార్గం

14. ఐఐఎం ఉదయ్‌పూర్: ఆన్‌లైన్ ద్విభాషా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) - (2026 నుంచి, ఇంగ్లీష్ మరియు హిందీ)

ముందస్తు కెరీర్ ప్లానింగ్‌కు అవకాశం..

పోస్ట్-గ్రాడ్యుయేట్ స్థాయి దాటి మేనేజ్‌మెంట్ విద్య ఇప్పుడు అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయికి విస్తరించడం వల్ల, విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలను ముందుగానే నిర్ణయించుకోవడానికి, తగిన కోర్సులను ఎంచుకోవడానికి ఈ అవకాశాలు దోహదపడతాయి.

దరఖాస్తుదారులు గమనించాల్సిన విషయాలు:

ఐఐఎంలలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు దరఖాస్తు చేసే ముందు అర్హత ప్రమాణాలు, ప్రవేశ పరీక్షలు, సిలబస్ నిర్మాణం, కోర్సు నుంచి మధ్యలో బయటికి వచ్చే వెసులుబాటు, సంబంధిత క్యాంపస్ అందించే ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించడమైనది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks