IIT JAM 2027 : నేటితో ముగియనున్న ఐఐటీ జామ్ రిజిస్ట్రేషన్ గడువు- ఇలా అప్లై చేసుకోవాలి..
మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఐటీ జామ్ 2027 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు వరకు జేఓఏపీఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. పూర్తి వివరాలు..
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) వంటి అగ్రశ్రేణి సంస్థల్లో ఎంఎస్సీ, జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ తదితర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్' (ఐఐటీ జామ్ 2027) దరఖాస్తు ప్రక్రియ నేటితో (అక్టోబర్ 24) ముగియనుంది. వాస్తవానికి ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు నిర్వాహకులు మరో అవకాశం కల్పిస్తూ.. రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్‌ని శనివారం వరకు పొడిగించారు.

ఐఐటీ జామ్ 2027 కోసం ఇదే చివరి పొడిగింపు అని, ఇకపై దరఖాస్తు తేదీలను పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక 'జేఓఏపీఎస్' పోర్టల్‌ను సందర్శించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. చివరి నిమిషంలో దరఖాస్తు చేయడం వల్ల నెట్‌వర్క్ సమస్యలు, సర్వర్ బిజీ కావడం లేదా ఫీజు చెల్లింపుల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందే ప్రక్రియను పూర్తి చేయడం శ్రేయస్కరం.
ఐఐటీ జామ్ 2027 దరఖాస్తు చేసుకునే విధానం..
విద్యార్థులు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ఇవి పాటించాల్సి ఉంటుంది:
రిజిస్ట్రేషన్: ముందుగా అధికారిక JOAPS పోర్టల్‌ను సందర్శించి మీ పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. వివరాలు సమర్పించగానే మీ ఇమెయిల్, మొబైల్‌కు ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, ఓటీపీ అందుతాయి.
ఫారమ్ పూర్తి చేయడం: పొందిన ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్ ద్వారా లాగిన్ అయి మీ విద్యార్హతలు, వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి.
డాక్యుమెంట్ల అప్‌లోడ్: పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, కుల/దివ్యాంగుల సర్టిఫికెట్లను (వర్తించే వారికి) స్పష్టంగా అప్‌లోడ్ చేయాలి.
ఫీజు చెల్లింపు: అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ డిజిటల్ విధానాల ద్వారా నిర్ణీత దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
స్టేటస్ పరిశీలన: ఫారమ్ సమర్పించిన తర్వాత అది ఆమోదం పొందిందా, పరిశీలనలో ఉందా లేదా ఏవైనా సవరణలు అవసరమా అనేది పోర్టల్‌లో తరచుగా చెక్ చేసుకోవాలి.
ఐఐటీ జామ్ 2027 దరఖాస్తు ఫీజు వివరాలు..
ఈ ఐఐటీ జామ్ 2027 పరీక్షకు సంబంధించి చెల్లించిన దరఖాస్తు ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వరు (నాన్ రీఫండెబుల్).
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు : ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.1,350 ఫీజుగా నిర్ణయించారు.
ఇతర అభ్యర్థులందరూ (జెనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్): ఒక పేపర్‌కు రూ.2,000, రెండు పేపర్లకు రూ.2,700 చెల్లించాల్సి ఉంటుంది.
ఐఐటీ జామ్ 2027- విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు..
ఐఐటీ జామ్ 2027 కోసం అభ్యర్థులు తమ సొంత ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను మాత్రమే దరఖాస్తులో ఉపయోగించాలి. ఒకే విద్యార్థి ఒకటికి మించి దరఖాస్తులు సమర్పించకూడదు. అభ్యర్థుల అర్హత మార్కులు, మెరిట్, సీట్ల లభ్యత ఆధారంగానే ఐఐటీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
ఇక ఐఐటీ జామ్ 2027 పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


