...
...
Next Story

IMD rain alert : ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు- రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..

Telangana rains : దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మళ్లీ జోరందుకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

Published on: Aug 9, 2026, 14:05:59 IST
Advertisement

దేశంలోని పలు రాష్ట్రాల్లో వరుణుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్నాడు. సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇలా..

ఐఎండీ రెయిన్ అలర్ట్..
ఐఎండీ రెయిన్ అలర్ట్..

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అసోం, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వర్షాల జోరు ఎక్కువగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, బీహార్, ఒడిశా తదితర ప్రాంతాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాతావరణం..

హరియాణా, చండీగఢ్, దిల్లీ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని హెచ్చరించారు.

ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న వర్షాల జోరు..

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్షాలు మరింత జోరుగా కురుస్తాయని అంచనా. షిమ్లా వాతావరణ కేంద్రం సోమవారం, మంగళవారాల్లో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల పట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల ప్రభావం ఆగస్టు 14 వరకు ఉండే అవకాశం ఉంది.

రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్య భారతదేశ వాతావరణం..

ఝార్ఖండ్‌లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చు.

దక్షిణాదిలోనూ వర్షాల జోరు..

కోస్తా కర్ణాటక, కేరళ, మహే, లక్షద్వీప్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks