...
...
Next Story

IND vs SA: బుమ్రా మ్యాజిక్.. కానీ మిల్లర్ బాదుడు.. ఇండియాకు టఫ్ టార్గెట్ సెట్ చేసిన దక్షిణాఫ్రికా

టీ20 ప్రపంచకప్ లో ఈజీగా సూపర్ 8కు అర్హత సాధించిన టీమిండియాకు అసలైన సవాలు ఎదురైంది. సూపర్ 8 మ్యాచ్ లో ఇండియా బౌలింగ్ లో సఫారీ బ్యాటర్లు మిల్లర్, బ్రేవిస్ చెలరేగారు. అయితేనేం.. బుమ్రా అద్భుత బౌలింగ్ తో అదరగొట్టాడు. దక్షిణాఫ్రికా టీమ్ ను 200 చేయకుండా అడ్డుకున్నాడు.

Published on: Feb 22, 2026, 20:54:11 IST
Advertisement

20 రన్స్ కే 3 వికెట్లు.. బుమ్రా దూకుడు మీదున్నాడు.. ఇక దక్షిణాఫ్రికాకు చుక్కలే అనిపించింది. కానీ మిల్లర్ (35 బంతుల్లో7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) రివర్స్ షాక్ ఇచ్చాడు. బ్రేవిస్ తో కలిసి ఇండియన్ బౌలర్లపై ఎటాక్ చేశాడు. అయితే బుమ్రా సెన్సేషనల్ బౌలింగ్ తో సౌతాఫ్రికాను 200 చేయకుండా అడ్డుకున్నాడు.

బుమ్రా
బుమ్రా

20 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. బుమ్రా 4 ఓవర్లు వేసి 15 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్ దీప్ 2 వికెట్లు తీశాడు.

బుమ్రా అదుర్స్

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్ స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ నాలుగు ఓవర్లు ముగిసే సరికే మూడు వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్ టాస్ నిర్ణయానికి బాధపడే ఉంటుంది. కొత్త బంతితో బుమ్రా అంతలా చెలరేగాడు. తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు.

20 పరుగులకే 3 వికెట్లు

ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన బుమ్రా.. డికాక్ (6) స్టంప్స్ లేపేశాడు. ఆ తర్వాతి ఓవర్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్ (4)ను అర్ష్ దీప్ సింగ్ ఔట్ చేశాడు. బుమ్రా నెక్ట్స్ ఓవర్లో ర్యాన్ రికిల్టన్ (7)ను బుట్టలో వేసుకున్నాడు. దీంతో 20 రన్స్ కే సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది.

మిల్లర్, బ్రేవిస్ కలిసి

బ్రేవిస్, మిల్లర్ ధనాధన్ బ్యాటింగ్ తో స్టార్టింగ్ షాక్ నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. స్కోరింగ్ రన్ రేట్ 10కి చేరువైంది. ఆ టైమ్ లో బ్రేవిస్ ను శివమ్ దూబె ఔట్ చేశాడు. కానీ మిల్లర్ జోరు మాత్రం తగ్గలేదు. హాఫ్ సెంచరీ ఖాతాలో వేసుకున్న మిల్లర్ ఇండియన్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 15 ఓవర్లకు దక్షిణాఫ్రికా టీమ్ 145/4తో నిలిచింది.

ఆ వికెట్ తో

మిల్లర్ దూకుడుతో దక్షిణాఫ్రికా 200కు పైగా స్కోరు చేస్తుందనిపించింది. కానీ 16వ ఓవర్లో మిల్లర్ ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ చేర్చి ఇండియాకు కావాల్సిన బ్రేక్ అందించాడు. ఆ తర్వాత తన లాస్ట్ 2 ఓవర్లు కూడా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. సింగిల్ హ్యాండెడ్ రిటర్న్ క్యాచ్ తో బాష్ వికెట్ తీశాడు. బుమ్రా 4 ఓవర్లలో 15 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

కానీ హార్దిక్ పాండ్య వేసిన ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో లాస్ట్ రెండు బాల్స్ కు స్టబ్స్ (24 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 44 నాటౌట్) రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో టీమ్ స్కోరు 187కు చేరింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks