టీ20 ప్రపంచకప్ లో ఇండియా ఆధిపత్యంతో అదరగొడుతోంది. గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ ను చిత్తుచేసింది. ఇప్పుడు సూపర్ 8 పోరుకు రెడీ అయింది. ఈ రోజు (ఫిబ్రవరి 22) సూపర్ 8 మ్యాచ్ లో సౌతాఫ్రికాను ఇండియా ఢీ కొడుతోంది.
సూపర్ 8 ఫైట్

టీ20 ప్రపంచకప్ 2026లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా విజయాలు సాధించింది. ఒక్క ఓటమి లేకుండా సూపర్ 8కు అర్హత సాధించింది. కానీ ఇప్పుడు సూపర్ 8 ఫైట్ యమ టఫ్ గా ఉండబోతోంది. ఈ సూపర్ 8లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ తో కలిసి ఇండియా ఒకే గ్రూప్ లో ఉంది. ఇవాళ దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో టీమ్ లో కీలక ఆటగాళ్లయిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్ ఇండియాకు కష్టాలు తెస్తోంది. ఇది ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.
సూర్యకుమార్, తిలక్
టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అభిషేక్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ డకౌట్ అయ్యాడు. అయితే ఇప్పుడు అతని ఫామ్ తో పాటు ముఖ్యంగా సూర్యకుమార్, తిలక్ వర్మ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అతి జాగ్రత్తతో కూడిన సూర్యకుమార్, తిలక్ వర్మ బ్యాటింగ్ ప్రస్తుతం భారత అభిమానులను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది.
కెప్టెన్ ఇలా
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. క్రీజులోకి వస్తే చాలు 360 డిగ్రీల ఆటతీరుతో అదరగొడతాడు. కానీ ఈ ప్రపంచకప్ లో మాత్రం అతను స్పీడ్ గా ఆడలేకపోతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో అమెరికాపై ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో చెలరేగినా ఫస్ట్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు.
{{/usCountry}}టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. క్రీజులోకి వస్తే చాలు 360 డిగ్రీల ఆటతీరుతో అదరగొడతాడు. కానీ ఈ ప్రపంచకప్ లో మాత్రం అతను స్పీడ్ గా ఆడలేకపోతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో అమెరికాపై ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో చెలరేగినా ఫస్ట్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు.
{{/usCountry}}ఆ తర్వాత నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ల్లోనూ సూర్య ఇదే బ్యాటింగ్ తీరు కొనసాగించాడు. సూర్య ఇప్పటివరకు 136.13 స్ట్రైక్ రేటుతో 162 పరుగులు చేశాడు. యావరేజీ 54గా ఉంది.
మరీ దారుణంగా
ఇక టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ గణాంకాలు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. ఈ టీ20 ప్రపంచకప్ లో అతను మరీ నెమ్మదిగా ఆడుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో అతను బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించడం లేదనే ట్రోల్స్ వస్తున్నాయి. నాలుగు మ్యాచ్ ల్లోనూ బ్యాటింగ్ చేసిన తిలక్ 106 పరుగులు చేశాడు. 120.45 స్ట్రైక్ రేట్, 26.5 సగటు. టీ20ల్లో ఇలాంటి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే విమర్శలు తప్పవు.
ఈ మ్యాచ్ లోనైనా
తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ పై విమర్శలు వస్తున్నాయి. వీళ్లు ఇలాగే స్లోగా ఆడితే దక్షిణాఫ్రికాపై ఇండియా ఎలా గెలుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా జట్టులో తిలక్ వర్మ స్థానానికి ఎసరు కూడా రావొచ్చు. మరి ఆదివారం మ్యాచ్ లో సూర్య, తిలక్ సత్తాచాటుతారేమో చూడాలి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియోహాట్ స్టార్ లో లైవ్ చూడొచ్చు.