IND vs SA : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా- ఎప్పుడు? ఎక్కడ చూడాలి? ప్లేయింగ్ 11..
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సూపర్ 8 స్టేజీ గ్రూప్ 1లో భాగంగా నేడు సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? ఏ టైమ్‌కి జరుగుతుంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టీ20 వరల్డ్ కప్ 2026లో సమవుజ్జీల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. సౌతాఫ్రికాతో ఈరోజు భారత్ తన తొలి సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ అనంతరం ఈ ఇరు జట్లు తలపడుతున్న తొలి ఐసీసీ (టీ20) ఈవెంట్ ఇదే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది? ఎప్పుడు జరుగుతోంది? ఎలా చూడాలి? ప్లేయింగ్ 11 ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా- ఎప్పుడు? ఎక్కడ?
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ 1లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
గ్రూప్ గేమ్స్‌లో ముగిసిన 40 మ్యాచుల్లో 26 ఇండియాలో జరిగాయి. వీటిల్లో 18 మ్యాచుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన కేవలం 8సార్లే గెలిచాయి. ఇదే అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 176 రన్స్ని ఛేజ్ చేసేసింది. ఇదే వెన్యూలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా థ్రిలర్ రెండు సూపర్ ఓవర్ల ఫైట్‌లో విజయం సాధించింది.
అయితే ఈ వెన్యూలో నెథర్లాండ్స్తో జరిగిన పోరులో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి గెలిచింది.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా- ఎలా చూడాలి?
ఈ ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌ని జియో హాట్‌స్టార్‌లో లైవ్‌లో చూడవచ్చు. ఒకవేళం మ్యాచ్ చూడటం కుదరకపోతే క్రిక్ బజ్ సహా అనేక క్రికెట్ యాప్స్‌లో లైవ్ స్కోర్‌ని, కామెంట్రీని చదవొచ్చు.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా- ప్లేయింగ్ 11 ఇదేనా?
ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా)- అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్సర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
సౌతాఫ్రికా ప్లేయింగ్ 11 (అంచనా)- ఐడెన్ మాక్రమ్, క్వింటన్ డికాక్ (కీపర్), రైన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డైవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, మార్కో జెన్సన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా- స్టాట్స్..
2024 టీ20 వరల్డ్ కప్ నుంచి చూసుకుంటే, ఇండియా- సౌతాఫ్రికా, ది మోస్ట్ సక్సెస్‌పుల్ టీమ్స్‌గా నిలిచాయి. టీమిండియా విన్ రేట్ 100శాతంగా (12 మ్యాచుల్లో) ఉంది. సౌతాఫ్రికా 1 మ్యాచ్ (13 మ్యాచుల్లో) ఓడిపోయింది. అది కూడా ఇండియాతో జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో.
ఇరు జట్ల మధ్య జరిగిన గత రెండు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో తిలక్ వర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 496 పరుగులు సాధించాడు. 8 మ్యాచుల్లో 22 వికెట్లతో వరుణ్ చక్రవర్తి లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు.
పవర్‌ప్లేలో సౌతాఫ్రికాకు ది బెస్ట్ యావరేజ్ ఉంది. నేటి మ్యాచ్ గెలవాలంటే భారత బౌలర్లు సౌతాఫ్రికా ఓపెనర్లను కట్టడి చేయాల్సిందే.
టీ20 వరల్డ్ కప్- టీమిండియా నెక్ట్స్ మ్యాచ్‌లు ఎప్పుడు?
సౌతాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ఫిబ్రవరి 26న టీమిండియా జింబాబ్వేతో తలపడనుంది. అనంతరం, మార్చ్ 1న వెస్టిండస్‌తో మ్యాచ్ ఉంటుంది. వీటిల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తే సూర్యకుమార్ యాదవ్ జట్టు సెమీ ఫైనల్స్‌కి చేరుతుంది.

E-Paper












