...
...
...
Next StoryDown Arrow

IND vs SA: ఇండియాకు సఫారీ సవాల్.. అభిషేక్ శర్మ ఏం చేస్తాడో? దక్షిణాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్.. టాస్ ఓడిన భారత్

టీ20 ప్రపంచకప్ లో టీమిండియాకు సవాల్. గ్రూప్ స్టేజీలో ఓటమే లేని ఇండియాకు సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో పోరు నేడే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

Published on: Feb 22, 2026 06:34 pm IST
Advertisement

టీ20 ప్రపంచకప్ 2026లో అజేయంగా సూపర్ 8 చేరిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాకు అసలైన సవాల్. కీలకమైన సూపర్ 8 పోరులో ఇవాళ దక్షిణాఫ్రికాతో ఇండియా తలపడుతోంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

4 విజయాలతో

అభిషేక్ శర్మతో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్

టీ20 ప్రపంచకప్ లో భారత్ అదరగొడుతోంది. గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచింది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. ఒక్క ఓటమి లేకుండా సూపర్ 8కు అర్హత సాధించింది. ఇప్పుడు సూపర్ 8లో సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉన్న గ్రూప్ లో ఇండియా ఉంది. ఈ రోజు (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ఫైనల్ ఎలెవన్ లో ఎలాంటి మార్పులు లేకుండా ఇండియా ఆడుతోంది.

సఫారీలతో సవాల్

మరోవైపు సౌతాఫ్రికా కూడా బలంగానే ఉంది. ఆ టీమ్ కూడా ఈ టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. ఆ టీమ్ బలమైన ఆటగాళ్లతో ఇండియాకు సవాలు విసిరేందుకు రెడీ అయింది. గ్రూప్-డిలో కెనడా, అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, యూఏఈపై దక్షిణాఫ్రికా గెలిచింది.

ఇండియాతో మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా తన ఫైనల్ ఎలెవన్ లో నాలుగు మార్పులు చేసింది. ఆ టీమ్ లో కెప్టెన్ మార్ క్రమ్, డికాక్, బ్రేవిస్, మిల్లర్, స్టబ్స్, రబాడ, ఎంగిడి లాంటి ప్లేయర్లున్నారు

ఆ ఫైనల్

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Subscribe Now!