ఈ మధ్య కాలంలో ఎవరినైనా ‘ఏం చేస్తున్నావు?’ అని అడిగితే “మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ చేస్తున్నాను” అనే సమాధానం వస్తోంది! కోవిడ్ తర్వాత చాలా మంది భారతీయులు స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారి ఫ్యూచర్ కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మరి మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! తక్కువ రిస్క్‌తో అద్భుత లాభాలను ఇచ్చే ‘ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్’ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి?

సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మొదలైన సూచీల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని ‘ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్’ అంటారు. ఉదాహరణకు బ్యాంక్ నిఫ్టీని తీసుకుందాము. ఇందులో 12 స్టాక్స్ ఉంటాయి. అవి పెరుగుతూ ఉంటే, బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది. అవి పడుతుంటే, బ్యాంక్ నిఫ్టీ పడుతుంటుంది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ కూడా ఇంతే! ఇందులో బ్యాంక్ నిఫ్టీకి చెందిన స్టాక్సే ఉండటం వల్ల ఆ సూచీ రిటర్నులకు తగ్గట్టుగానే ఆ మ్యూచువల్ ఫండ్‌లోనూ రాబడి ఉంటుంది.
గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. ఇలాంటి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మేనేజర్లు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు! ఈ సూచీలను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు నిర్ణయిస్తాయి కాబట్టి, ఒక ఇండెక్స్‌ని ఎంచుకుని అందులోని స్టాక్స్‌లో ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్ల డబ్బులు పెడితే సరిపోతుంది. దీనిని ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అదే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌లో.. మదుపర్లకు మంచి రిటర్నులు ఇచ్చేందుకు స్టాక్స్‌ని ఎప్పటికప్పుడు ఫండ్ మేనేజర్లు ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే, వారు ఎక్కువ పనిచేస్తున్నట్టు!
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్- ఎవరికి బెస్ట్ ఆప్షన్?
ఇటీవలి కాలంలో భారతీయులకు స్టాక్ మార్కెట్‌పై అవాహన పెరుగుతోంది. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సిప్ చేస్తున్నారు. అయితే.. ఈక్విటీ మార్కెట్లో కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలనుకుని, స్టాక్స్‌ని ఎనలైజ్ చేసేందుకు టైమ్ లేని వారు.. సింపుల్‌గా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌ని పిక్ చేసుకోవచ్చు!
{{/usCountry}}ఇటీవలి కాలంలో భారతీయులకు స్టాక్ మార్కెట్‌పై అవాహన పెరుగుతోంది. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సిప్ చేస్తున్నారు. అయితే.. ఈక్విటీ మార్కెట్లో కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలనుకుని, స్టాక్స్‌ని ఎనలైజ్ చేసేందుకు టైమ్ లేని వారు.. సింపుల్‌గా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌ని పిక్ చేసుకోవచ్చు!
{{/usCountry}}యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే.. ఫండ్ మేనేజర్ల నిర్ణయాలు ఒక్కోసారి బెడిసికొడుతుంటాయి. అప్పుడు ఇన్వెస్టర్లకూ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఫండ్ మేనేజర్ల పాత్ర పెద్దగా ఉండదు కాబట్టి, అలాంటి భయాలు అవసరం లేదు. అందుకే ఇతర మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే.. ఇందులో రిస్క్ తక్కువ!
ఎక్కువ రిటర్నులు పొందాలనుకుంటే మాత్రం మీకు ఈ తరహా ఫండ్ సూట్ అవ్వదు! రిటర్నులు ఎక్కువ ఉండాలంటే, రిస్క్ ఎక్కువ ఉండాలి.
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్- ఇవి తెలుసుకోండి..
రిస్క్- రివార్డ్:- సాధారణంగా.. స్టాక్ మార్కెట్ పడిపోతుంటే, ఫండ్ మేనేజర్లు తమ నిర్ణయాలతో ఇన్వెస్టర్ల డబ్బులను ఇతర స్టాక్స్‌లోకి మళ్లించే అవకాశం ఉంటుంది. కానీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌లో అలాంటి అవకాశాలు ఉండవు.
భారత స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ రిటర్నులు హిస్టారికల్లీ.. 12శాతం! అంత రాబడి వస్తే (ఇది బ్యాంక్ ఎఫ్డీ సహా ఇతర పెట్టుబడుల కన్నా చాలా ఎక్కువ) చాలు అని అనుకునే వారు ఈ తరహా ఫండ్స్‌ని ఎంచుకోవడం ఉత్తమం.
ఎక్స్పెన్స్ రేషియో:- ఈ ఎక్స్పెన్స్ రేషియో గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. మీ ఇన్వెస్ట్మెంట్స్ని మేనేజ్ చేస్తుండటం కారణంగా ఫండ్ హౌజ్‌కు.. (మీకు వచ్చే రిటర్నుల నుంచి) మీరు కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఎక్స్పెన్స్ రేషియో! ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ విషయంలో అతి పెద్ద లాభదాయకమైన విషయం ఇదే! ఫండ్ మేనేజర్ ప్రమేయం తక్కువ కాబట్టి.. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా అంటే చాలా తక్కువగానే ఉంటుంది.
ట్యాక్స్ గురించి కూడా ఆలోచించాలి:- ఈక్విటీ ఫండ్ కావడంతో ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే డబ్బులపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్పడుతుంది. అదే సమయంలో ఫండ్ హౌజ్.. డివిడెండ్లు చెల్లిస్తే.. అందులో 10శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) కూడా కట్ అవుతుంది.
గోల్స్ సెట్ చేసుకోవాలి- మ్యూచువల్ ఫండ్స్ అంటేనే లాంగ్ టర్మ్ ఆప్షన్స్! కనీసం 7 నుంచి 10ఏళ్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. అలాంటి ఇన్వెస్టర్లకు ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ఉపయోగపడుతుంది. స్వల్పకాలంలో ఏ రకమైన ఫండ్స్‌లోనైనా ఒడిదొడుకులు ఉంటాయి. అందువల్ల దీర్ఘకాలం పెట్టుబడుల కోసమే మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవాలి.