...
...
Next Story

కోహ్లి రికార్డుల మోత-మిగిలింది సచిన్ మాత్రమే-ఆ హిస్టరీ అందుకుంటాడా? న్యూజిలాండ్ తో తొలి వన్డేలో ఇండియా విక్టరీ

కింగ్ కోహ్లి మరోసారి అదరగొట్టాడు.న్యూజిలాండ్ తో తొలి వన్డేలో చెలరేగాడు. ఛేజింగ్ లో తనకు తిరుగులేదని మరోసారి చాటాడు. కొద్దిలో సెంచరీ మిస్ అయినా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన రికార్డు అందుకుని సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ తో వన్డేలో ఇండియా గెలిచింది.

Published on: Jan 11, 2026, 22:08:10 IST
Advertisement

మంచనీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదేసి, ఏదో ఈవ్ నింగ్ వాక్ కు వెళ్లినంత సులువుగా రికార్డులు తిరగరాసే విరాట్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగుల మైల్ స్టోన్ చేరుకున్నాడు. ఇంటర్నెషన్ లో క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచాడు.

కోహ్లి రికార్డులు

విరాట్ కోహ్లి (AP)
విరాట్ కోహ్లి (AP)

ఆదివారం (జనవరి 11) న్యూజిలాండ్ తో ఫస్ట్ వన్డేలో విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఛేజింగ్ లో 91 బంతుల్లో 93 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులకు చేరుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు అత్యధిక పరుగుల లిస్ట్ లో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో వరుసగా అయిదో హాఫ్ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.

సచిన్ ను అందుకునేనా?

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అతను 664 మ్యాచ్ ల్లో 34357 మ్యాచ్ లు చేశాడు. విరాట్ కోహ్లి 557 మ్యాచ్ ల్లో 28,068 పరుగులు చేశాడు. సచిన్ ను చేరుకోవాలంటే కోహ్లి ఇంకా 6,289 పరుగులు చేయాలి. 37 ఏళ్ల కోహ్లి ఇప్పటికే టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఇందులోనే కెరీర్ ఎండింగ్ లో ఉన్నాడు.

గర్వ కారణం

ఈ రకంగా చూసుకుంటే సచిన్ అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డును కోహ్లి చేరుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. విరాట్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు టీమ్ తో కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత వన్డేలకూ అతను వీడ్కోలు పలికే సూచనలున్నాయి. ఏదేమైనా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో తొలి రెండు స్థానాల్లో ఇండియన్ బ్యాటర్లు ఉండటం మనకు గర్వకారణం.

ఇండియా విక్టరీ

ఛేజింగ్ లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (93), కెప్టెన్ శుభ్ మన్ గిల్ (56), శ్రేయస్ అయ్యర్ (49), రాణించడంతో ఇండియా 6 వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks