టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా సెమీస్ కు రెడీ అవుతోంది. గురువారం (మార్చి 5) సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఢీ కొడుతుంది. ఇప్పుడు అందరి ఫోకస్ ఈ మ్యాచ్ పైనే ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పించాల్సి వస్తే రింకు సింగ్ ను ఫైనల్ ఎలెవన్ లో ఆడించాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించాడు.
అభిషేక్ శర్మ ఫామ్

టీ20 ప్రపంచకప్ లో అభిషేక్ శర్మ ఫామ్ అంతంతమాత్రంగానే ఉంది. ఈ విధ్వంసక ఓపెనర్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఈ టోర్నీలో అతను ఆడిన ఫస్ట్ మూడు మ్యాచ్ ల్లో డకౌట్ అయ్యాడు. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ బాదాడు. కానీ వెస్టిండీస్ తో కీలకమైన పోరులో మాత్రం మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఈ టీ20 ప్రపంచకప్ లో అభిషేక్ శర్మ 6 ఇన్నింగ్స్ ల్లో కలిపి 80 పరుగులు మాత్రమే చేశాడు.
వేటు వేస్తే
అభిషేక్ ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఇంగ్లాండ్ తో సెమీస్ లో అతణ్ని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇండియా టీమ్ అంత సాహసం చేయలేకపోవచ్చు. కానీ ఒకవేళ అభిషేక్ శర్మపై వేటు వేస్తే మాత్రం టీమ్ లో రింకు సింగ్ ను ఆడించాలని రవిశాస్త్రి సూచించాడు.
రవిశాస్త్రి కామెంట్లు
‘‘అభిషేక్ శర్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. టీమ్ మేనేజ్ మెంట్ రెడీగా ఉండాలి. ఒకవేళ అభిషేక్ మెంటల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే, మైండ్ సెట్ దెబ్బతిని ఉంటే మాత్రమే అతణ్ని తప్పించాలి. నెట్స్‌లో అతను ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో చూసి అంచనా వేయాలి" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు.
తప్పించాల్సి వస్తే
‘‘ఒకవేళ అభిషేక్ శర్మను జట్టు నుంచి తప్పించాల్సి వస్తే మాత్రం ఇషాన్ కిషన్ ను మళ్లీ ఓపెనర్ గా పంపించాలి. రింకు సింగ్ ను టీమ్ లోకి తీసుకోవాలి. లోయర్ ఆర్డర్ లో రింకును ఆడించాలి’’ అని రవిశాస్త్రి తెలిపాడు.
అతనే ఫేవరెట్
{{/usCountry}}‘‘ఒకవేళ అభిషేక్ శర్మను జట్టు నుంచి తప్పించాల్సి వస్తే మాత్రం ఇషాన్ కిషన్ ను మళ్లీ ఓపెనర్ గా పంపించాలి. రింకు సింగ్ ను టీమ్ లోకి తీసుకోవాలి. లోయర్ ఆర్డర్ లో రింకును ఆడించాలి’’ అని రవిశాస్త్రి తెలిపాడు.
అతనే ఫేవరెట్
{{/usCountry}}‘‘టీమ్ లో కొనసాగేందుకు ఇప్పటికీ అభిషేక్ శర్మ ఫేవరెట్ అని నమ్ముతా. అతణ్ని ఆడించాలనే కోరుకుంటా. ఎందుకంటే గతంలో ఇంగ్లాండ్ తో భారత్ ఆడినప్పుడు అభిషేక్ చెలరేగాడు. ఇంగ్లాండ్ పై అతనికి మంచి రికార్డు ఉంది. వాంఖడేలోనూ అతను గొప్పగా ఆడాడు. అక్కడ భారీ ఇన్నింగ్స్ లు నమోదు చేశాడు. అతని బ్యాటింగ్ లో పవర్ ఉంది’’ అని రవిశాస్త్రి వివరించాడు.