అంతర్జాతీయ క్రికెట్‌లో మరొక చారిత్రాత్మక అధ్యాయం ఆవిష్కృతమవుతోంది! ప్రపంచ రెండో ర్యాంక్ జట్టు, ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ అయిన భారత పురుషుల క్రికెట్ జట్టు తొలిసారిగా జపాన్ జాతీయ జట్టుతో టీ20 పోరుకు సిద్ధమైంది. సానో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా జరగనున్న ఈ ఏకైక 'సుజుకీ కప్' టీ20 మ్యాచ్ క్రీడాభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇండియా వర్సెస్ జపాన్- మోదీ, తకైచి సమావేశంతోనే!

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 41వ స్థానంలో ఉన్న జపాన్ వంటి పసికూనతో భారత్ ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. అయితే ఈ మ్యాచ్ వెనుక బలమైన దౌత్య సంబంధాలు ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనే తకైచి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కుదిరిన "స్పోర్ట్ 75" ఒప్పందంలో భాగంగా ఈ పోరు రూపుదిద్దుకుంది. ఇరు దేశాల మధ్య క్రీడారంగంలో సహకారాన్ని పెంచడం, సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడమే ఈ ద్వైపాక్షిక చొరవ ముఖ్య ఉద్దేశం.
ఇప్పటికే మొదలైన ఆసియా గేమ్స్ 2026లో మెన్స్ క్రికెట్ ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. దానికి ముందు జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
జపాన్‌లో క్రికెట్ ప్రచారం.. భారత ఆటగాళ్ల సందడి!
బేస్‌బాల్, సుమో, ఇతర ఒలింపిక్ క్రీడలకు ఎక్కువ ఆదరణ ఉన్న జపాన్‌లో క్రికెట్ పట్ల ప్రాచుర్యం పెంచేందుకు ఈ మ్యాచ్ ఎంతగానో తోడ్పడుతుంది. జపాన్‌లో నివసిస్తున్న భారతీయ సమాజానికి కూడా ఇది గొప్ప పండుగలాంటి సందర్భం. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లను నేరుగా చూసే అరుదైన అవకాశం వారికి దక్కనంది. మరోవైపు, టీమిండియా లాంటి ప్రపంచ అత్యుత్తమ జట్టుతో ఆడే అవకాశం లభించడం జపాన్ క్రికెటర్ల నైపుణ్యాలను ఎంతో మెరుగుపరుస్తుంది.
ఇండియా వర్సెస్ జపాన్- లైవ్ ప్రసారాల వివరాలు..
ఈ చారిత్రక టీ20 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ ఛానళ్లలో ఇండియా వర్సెస్ జపాన్ లైవ్ మ్యాచ్‌ని చూడవచ్చు.
{{/usCountry}}ఈ చారిత్రక టీ20 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ ఛానళ్లలో ఇండియా వర్సెస్ జపాన్ లైవ్ మ్యాచ్‌ని చూడవచ్చు.
{{/usCountry}}ఓటీటీ ద్వారా వీక్షించాలనుకునే అభిమానుల కోసం ఫ్యాన్‌కోడ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
వాస్తవానికి ఈ మ్యాచ్ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభంకావాల్సి ఉంది. కానీ వెట్ ఔట్‌ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యమైంది.
ఇండియా వర్సెస్ జపాన్- ఇరు జట్ల వివరాలు
భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యష్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.
జపాన్ జట్టు: కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్, చార్లీ హారా-హింజే, బెంజమిన్ గౌ-ఇటో డేవిస్, కోహెయ్ కుబోటా, వతారూ మియావుచి, రేయో సకురానో-థామస్, డెక్లాన్ సుజుకి-మెక్‌కోంబ్, షోమా సుగాయా-స్లేటర్, అలెగ్జాండర్ షిరాయ్-పాట్‌మోర్, లాచ్లాన్ యమమోటో-లేక్, మకోటో తానియామా, ఇబ్రహీం తకాహాషి, సుయోషి తకాడా, జేక్ కుసుడా-నైర్న్, అలెస్టర్ కడోవాకి-ఫ్లెమింగ్.