భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 2026లో టీమిండియా తన తొలి సిరీస్ ను ఆదివారం (జనవరి 11) ప్రారంభించనుంది. వడోదరలోని కోటంబి స్టేడియం వేదికగా జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో.. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా, మైఖేల్ బ్రేస్‌వెల్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.
రోహిత్, కోహ్లీలపైనే ఫోకస్

గత సిరీస్‌లో సౌతాఫ్రికాపై చెలరేగి ఆడిన సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే అందరి దృష్టి ఉంది. కేవలం ఇంటర్నేషనల్ మ్యాచ్‌లే కాకుండా.. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలోనూ వీరిద్దరూ బౌలర్లను ఉతికారేశారు. పరుగుల వరద పారిస్తున్న ఈ ఇద్దరూ వడోదరలోనూ అదే జోరు కొనసాగిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తిరిగొచ్చిన శ్రేయస్.. దూరమైన బుమ్రా
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పడుతూ గాయపడిన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. రెండు నెలల విరామం తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. అతను తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అయితే రాబోయే మెగా టోర్నీల దృష్ట్యా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసం జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి కల్పించారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టిన న్యూజిలాండ్.. తమ పూర్తి స్థాయి సీనియర్ జట్టును కాకుండా బ్రేస్‌వెల్ కెప్టెన్సీలో యువ జట్టును బరిలోకి దించుతోంది.
రిషబ్ పంత్‌కు గాయం.. సిరీస్ నుంచి అవుట్
మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా కివీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. శనివారం (జనవరి 10) ప్రాక్టీస్ సెషన్లో త్రో-డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి పంత్ నడుము పైభాగంలో బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన పంత్‌ను వెంటనే కోచ్ గౌతమ్ గంభీర్, సపోర్ట్ స్టాఫ్ పరిశీలించారు.
{{/usCountry}}మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా కివీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. శనివారం (జనవరి 10) ప్రాక్టీస్ సెషన్లో త్రో-డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి పంత్ నడుము పైభాగంలో బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన పంత్‌ను వెంటనే కోచ్ గౌతమ్ గంభీర్, సపోర్ట్ స్టాఫ్ పరిశీలించారు.
{{/usCountry}}గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను వడోదర నుంచి ఇంటికి బయలుదేరనున్నాడని సమాచారం. జట్టులో రెండో వికెట్ కీపర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో కారు ప్రమాదం, ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌లో గాయం.. ఇలా వరుస ఆటంకాల తర్వాత పంత్ కోలుకుంటున్న సమయంలో మళ్లీ గాయపడటం ఆందోళన కలిగిస్తోంది.
మ్యాచ్ వివరాలు, లైవ్ స్ట్రీమింగ్
తేదీ, సమయం: జనవరి 11, ఆదివారం, మధ్యాహ్నం 1:30 గంటలకు (టాస్ 1:00 గంటలకు).
వేదిక: బీసీఏ స్టేడియం, కోటంబి, వడోదర.
టీవీ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్.
లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్.
తుది జట్లు (అంచనా)
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, మిచెల్ హే, నిక్ కెల్లీ, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, విల్ యంగ్, సాంట్నర్, కైల్ జేమిసన్, జేడన్ లెనాక్స్