షారుక్‌తో రోహిత్ శ‌ర్మ‌.. వైర‌ల్ వీడియో.. సినిమాలో ఈ కాంబినేష‌న్ చూడాల‌ంటూ ఫ్యాన్స్ రియాక్ష‌న్‌

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఒక ఈవెంట్లో పక్కపక్కనే కూర్చుని మాట్లాడారు. ఈ వీడియో వైరల్ గా మారింది. సినిమాలో ఈ కాంబినేషన్ ను బిగ్ స్క్రీన్ పై చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ రియాక్టవుతున్నారు. 

Published on: Jan 7, 2026, 05:46:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

షారుక్ ఖాన్.. బాలీవుడ్ లో అదిరే సినిమాలతో బాద్ షా గా ఎదిగాడు. రోహిత్ శర్మ.. క్రికెట్లో అదుర్స్ అనిపించే ఆటతీరుతో హిట్ మ్యాన్ గా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ పక్కపక్కన కూర్చుని మాట్లాడుతున్న వీడియో వైరల్ గా మారింది. వీళ్లను ఇలా కలిసి సినిమాలో బిగ్ స్క్రీన్ పై చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

షారుక్ ఖాన్, రోహిత్ శర్మ
షారుక్ ఖాన్, రోహిత్ శర్మ

షారుక్, రోహిత్ కలిసి

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల ముంబైలో జరిగిన యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్ లో కలుసుకున్నారు. వీరిద్దరికి సంబంధించిన అనేక వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. షారుక్ ఖాన్, రోహిత్ శర్మ ముంబయి ఈవెంట్ లో మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒకరి పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

చిట్ చాట్

రోహిత్ శర్మను షారుక్ ఏదో అడిగినట్లు కనిపించింది. రోహిత్ మాట్లాడుతుండగా షారుక్ కూడా తల ఊపాడు. నటుడు చప్పట్లు కొట్టడంతో వీడియో ముగిసింది. ఈ ఈవెంట్ కోసం షారుక్ మ్యాచింగ్ బ్లేజర్, నల్ల ప్యాంటు ధరించాడు. అతను బీనీని కూడా ధరించాడు. ఇంటర్నెట్ లో వీళ్ల వీడియోలు వైరల్ గా మారాయి.

ఫ్యాన్స్ రియాక్షన్

"వారి మైదానంలోని సూపర్ స్టార్లు - ఒకరు క్రికెట్ లో ఉన్నారు, మరొకరు సినిమాలో ఉన్నారు", 'కింగ్ ఆఫ్ బాలీవుడ్ x కింగ్ ఆఫ్ క్రికెట్' అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. "రోహిత్ శర్మ, షారుక్ ఖాన్ కలిసి చాట్ చేయడం నిజంగా ఐకానిక్ క్షణంగా అనిపించింది" అని ఎక్స్ యూజర్ ఒకరు పేర్కొన్నారు. ‘‘ఒకే దగ్గర ఇద్దరు కలిసి బాగున్నారు. ఇదే కాంబినేషన్ బిగ్ స్క్రీన్ పై చూడాలని ఉంది’’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ఒకే ఫ్రేమ్ లో

"మేము చివరకు రోహిత్ శర్మ × షారుక్ ఖాన్ ను ఒక ఫ్రేమ్ లో కలిసి చూశాం’’ అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. ఒక సోషల్ మీడియా యూజర్.. "నా స్క్రీన్ కేవలం గొప్పతనంతో నిండిపోయింది. బాలీవుడ్ బాద్షా, క్రికెట్ హిట్ మ్యాన్ కలిసి ఇది నిజం చేశారు’’ అని రాసుకొచ్చాడు.

కింగ్ సినిమాతో

షారుక్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కింగ్'. ఈ చిత్రంలో ఆయన కుమార్తె సుహానా ఖాన్, దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More