...
...
Next Story

IND vs PAK: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మ‌ళ్లీ ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌.. మ్యాచ్ డేట్ ఇదే.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్‌

క్రికెట్ ఫ్యాన్స్ కు మరోసారి ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. టీ20 ప్రపంచకప్ లో మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ పోరు ఎప్పుడుందో చూసేయండి.

Published on: Feb 25, 2026, 11:56:42 IST
Advertisement

క్రికెట్ లవర్స్ గెట్ రెడీ.. టీ20 ప్రపంచకప్ లో మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ చిరకాల ప్రత్యర్థుల పోరుకు రంగం సిద్ధమవుతోంది. కేవలం భారత్, పాక్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే మ్యాచ్ మళ్లీ రాబోతుంది.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే కలిగే హైప్ మామూలు కాదు. ఈ పోరుకు ఉండే క్రేజ్ వేరు. రీసెంట్ గా పురుషుల టీ20 ప్రపంచకప్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ ను ఇండియా చిత్తుచిత్తుగా ఓడించింది. దాయాది దేశంపై ఈ విజయంతో భారత్ లో సంబరాలు మిన్నంటాయి.

టీ20 ప్రపంచకప్

ఇప్పుడు మరోసారి టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమవుతోంది. 2026లోనే జరిగే వుమెన్ టీ20 ప్రపంచకప్ లో ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో భారత అమ్మాయిలు ఫస్ట్ మ్యాచ్ లోనే పాకిస్థాన్ ను ఢీ కొట్టబోతున్నారు.

ఏ రోజంటే?

వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న జరగబోతుంది. దీనికి ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదిక. ఆ రోజు ఆదివారం. అంటే సండే రోజు క్రికెట్ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హై వోల్టేజీ పోరు రెడీ అవుతుంది.

టోర్నీ గ్రూప్ లు

టీ20 ప్రపంచకప్ లో ప్రతి గ్రూప్ లోని ఒక్కో టీమ్ మిగతా అయిదు టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లు మిగిసే సరికి గ్రూప్ లో టాప్ 2 ప్లేస్ ల్లో నిలిచే జట్లు నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఈ పొట్టి కప్ జూన్ 12న స్టార్ట్ అవుతుంది. దీనికి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తుంది.

ఇండియా షెడ్యూల్

  • ఇండియా వర్సెస్ పాకిస్థాన్ - జూన్ 14
  • ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ - జూన్ 17
  • ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా - జూన్ 21
  • ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ - జూన్ 25
  • ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా - జూన్ 28

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks