...
...
Next Story

IND vs WI: ఇండియాకు డూ ఆర్ డై.. ఇవాళ వెస్టిండీస్‌తో మ్యాచ్‌.. గెలిస్తే సెమీస్‌.. లేదంటే ఇంటికే.. ట‌ఫ్ ఫైట్‌

IND vs WI: టీ20 ప్రపంచకప్ లో అత్యంత కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఇవాళ వెస్టిండీస్ ను భారత్ ఢీ కొడుతుంది. ఈ సూపర్ 8 మ్యాచ్ లో గెలిస్తేనే ఇండియా సెమీ ఫైనల్ చేరుతుంది. లేదంటే టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాల్సి వస్తుంది.

Published on: Mar 1, 2026, 12:52:02 IST
Advertisement

టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియాకు చావో రేవో. ఈ పొట్టి కప్ టోర్నీలో సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఈ రోజు (మార్చి 1) వెస్టిండీస్ తో తలపడుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది.

ఇండియా వర్సెస్ వెస్టిండీస్

ప్రాక్టీస్ లో టీమిండియా ఆటగాళ్లు
ప్రాక్టీస్ లో టీమిండియా ఆటగాళ్లు

సొంతగడ్డపై ఇండియాకు సవాల్. డేంజరస్ వెస్టిండీస్ టీమ్ తో భారత్ నేడు తలపడుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టీమిండియా టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరుతుంది. ఓడిపోతే మాత్రం ఇంటిముఖం పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో డూ ఆర్ డై పోరులో ఇండియా ఎలా ఆడుతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సొంతగడ్డపై ఇండియాకు తిరుగులేదు. కానీ భారీ హిట్టర్లతో నిండిన విండీస్ ను తక్కువ అంచనా వేయలేం.

అభిషేక్ అదుర్స్

టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లోకి రావడం జట్టుకు ఎంతో రిలీఫ్ ఇచ్చే విషయం. జింబాబ్వేతో మ్యాచ్ లో అతను చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ కూడా రాణించారు. దీంతో ఇండియా 256/4 స్కోరు సాధించింది. టోర్నీలో అత్యధిక స్కోరు రికార్డును ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్ లో అభిషేక్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యతో భారత్ బలంగా ఉంది.

బౌలింగ్ లోనే

బ్రాండన్ కింగ్, కెప్టెన్ షై హోప్, హెట్ మయర్, పావెల్, ఛేజ్, రూథర్ ఫర్డ్, రొమారియో షెఫర్డ్, జేసన్ హోల్డర్.. ఇలా వెస్టిండీస్ టీమ్ లో అందరూ పవర్ హిట్టర్లే. అలవోకగా భారీ షాట్లు కొట్టగలరు. అందుకే ఈ పవర్ హిట్టర్లకు బ్రేక్ వేయాలంటే ఇండియా బౌలింగ్ ఎఫెక్టివ్ గా ఉండాలి.

మ్యాచ్ లైవ్

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 6.30 గంటలకు టాస్ వేస్తారు. ఈ సినిమాను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియోహాట్ స్టార్ లో చూడొచ్చు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ పోరు జరుగుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks