...
...
Next Story

అమెరికాను కొట్టేసిన ఇండియా.. టీ20 ప్రపంచకప్ లో గ్రాండ్ విక్టరీ.. హీరో సూర్య

టీ20 ప్రపంచకప్ లో టీమిండియా శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ శనివారం యుఎస్ఏ టీమ్ ను ఓడించింది. బ్యాటింగ్ లో కెప్టెన్ సూర్యకుమార్ అద్భుతంగా పోరాడాడు. బౌలింగ్ లో సిరాజ్, అర్ష్ దీప్, అక్షర్ పటేల్ రాణించారు.

Published on: Feb 7, 2026, 22:45:16 IST
Advertisement

టీమిండియా అదుర్స్. బ్యాటింగ్ లో టెన్షన్ పెట్టినా కెప్టెన్ సూర్యకుమార్ ఫైటింగ్ తో కోలుకున్న భారత్.. బౌలింగ్ లో సత్తాచాటింది. శనివారం (ఫిబ్రవరి 7) వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో యుఎస్ఏపై భారత్ గెలిచింది. టీ20 ప్రపంచకప్ లో గ్రాండ్ గా బోణీ కొట్టింది.

బౌలింగ్ భళా

ఇండియన్ క్రికెట్ టీమ్ (PTI)
ఇండియన్ క్రికెట్ టీమ్ (PTI)

టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా విక్టరీలో అతనే హీరో. ఛేజింగ్ లో అమెరికా టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేయగలిగింది. ఇండియన్ బౌలర్లలో సిరాజ్ 3, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

సిరాజ్ అదుర్స్

హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో లాస్ట్ మినిట్ లో టీ20 ప్రపంచకప్ లో ఆడే ఛాన్స్ దక్కించుకున్న సిరాజ్ అదరగొట్టాడు. అమెరికాతో మ్యాచ్ లో ఈ హైదరాబాదీ పేసర్ కొత్త బంతితో చెలరేగాడు. తన వరుస ఓవర్లలో గౌస్ (6), సాయితేజ (2)ను ఔట్ చేశాడు. మధ్యలో మిలింద్ కుమార్ (34), సంజయ్ (37) కాసేపు ఫైట్ చేశారు.

స్పిన్ మ్యాజిక్

మిడిల్ ఓవర్లలో ఇండియన్ స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. మిలింద్ కుమార్ ను వరుణ్ చక్రవర్తి, సంజయ్ ను అక్షర్ ఔట్ చేయడంతో అమెరికా పనైపోయింది. అక్షర్ తన తర్వాతి బాల్ కే హర్మీత్ (0) వికెట్ కూడా తీశాడు. దీంతో భారత విజయం ఖాయమైంది. ఇక 20 ఓవర్లు ఆడిన అమెరికా ఓటమి అంతరాన్ని మాత్రం కాస్త తగ్గించుకోగలిగింది.

సూర్య అద్భుత పోరాటం

తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) కాస్త పరుగులు చేశారు. కానీ ఇండియా స్కోరు 160 దాటిందంటే అందుకు కారణం సూర్యకుమార్. అత్యంత కఠిన పరిస్థితుల్లో సూర్య అద్భుతమైన ఫైటింగ్ తో నిలబడ్డాడు. అతను 49 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks