ఇండియన్​ ఆర్మీలో ప్రతిష్టాత్మక ఇంటర్న్‌షిప్- రోజుకు రూ. 1000 స్టైఫండ్​తో! పూర్తి వివరాలు..

ప్రతిష్టాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్​ని ప్రారంభించింది భారత సైన్యం. ఇంజినీరింగ్ విద్యార్థులకు భారత సైన్యానికి చెందిన టెక్నాలజీ ప్రాజెక్టుల్లో పాలుపంచుకునే అవకాశం దక్కనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Dec 17, 2025, 05:53:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతిష్టాత్మక ఇండియన్ ఆర్మీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (ఐఏఐపీ) 2025 కోసం అప్లికేషన్​ ప్రక్రియను ప్రారంభించింది భారత సైన్యం. ఇది అత్యంత తీవ్రత, సాంకేతికతతో కూడిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్​. అత్యాధునిక డిజిటల్ డొమైన్‌లలో పనిచేసే ఇంజినీరింగ్, పరిశోధన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ఇంటర్న్​షిప్​ని రూపొందించారు.

ఇండియన్​ ఆర్మీలో ఇంటర్న్​షిప్​.. (PTI)
ఇండియన్​ ఆర్మీలో ఇంటర్న్​షిప్​.. (PTI)

"బియాండ్​ సిలోస్​, బియాండ్​ లిమిట్స్​" అనే పేరుతో రూపొందించిన ఈ ప్రోగ్రామ్ కింద ఎంపికైన ఇంటర్న్‌లకు రోజుకు రూ. 1,000 స్టైఫండ్‌తో పాటు రక్షణ సాంకేతికతకు సంబంధించిన ప్రత్యక్ష ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది.

ఇండియన్​ ఆర్మీలో ఇంటర్న్‌షిప్- ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుల తుది గడువు: డిసెంబర్ 21, 2025.

ఈ ఇంటర్న్‌షిప్ మొత్తం- 75 రోజులు ఉంటుంది.

ప్రారంభం: జనవరి 12, 2026

ముగింపు: మార్చి 27, 2026

పోస్టింగ్ స్థలాలు: దిల్లీ లేదా బెంగళూరు.

ఎంపికైన అభ్యర్థులు సెక్యూర్​, మిషన్-క్రిటికల్ అప్లికేషన్‌లపై సైనిక బృందాలతో కలిసి పనిచేస్తారు. యువ సాంకేతిక నిపుణులను నేరుగా డిఫెన్స్​ఈకో సిస్టెమ్​లోకి తీసుకురావడానికి ఈ ఇంటర్న్‌షిప్​ని రూపొందించారు.

ఇండియన్​ ఆర్మీలో ఇంటర్న్‌షిప్- వివరాలు..

ఐఏఐపీ 2025 ప్రధానంగా రక్షణ అవసరాల కోసం అత్యాధునిక సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్‌ను రూపొందించడంపై దృష్టి సారిస్తుంది. ఇంటర్న్‌లు కింది వాటిలో పాలుపంచుకుంటారు:

హై-ఎండ్ సాఫ్ట్‌వేర్, ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేయడం.

ప్రత్యక్ష రక్షణ, సెక్యూర్డ్​ మిలటరీ-గ్రేడ్ అప్లికేషన్‌లపై పనిచేయడం.

క్లాసిఫైడ్, సురక్షిత వాతావరణంలో హ్యాండ్స్​ ఆన్​ ఎక్స్​పీరియెన్స్​ని పొందడం.

భారత సైన్యం ఉపయోగించే నెక్ట్స్​ జెన్​ టెక్నాలజీస్​కి దోహదపడటం.

ఇండియన్​ ఆర్మీలో ఇంటర్న్​షిప్​- ముఖ్యమైన సాంకేతికతలు..

ఇంటర్న్‌లు విస్తృత శ్రేణి టెక్నాలజీ స్టాక్‌పై పనిచేస్తారు. వాటిలో కొన్ని:

ఫ్రంట్‌ఎండ్- HTML5, CSS3, JavaScript, TypeScript, Dart, Svelte, ELM

బ్యాక్‌ఎండ్- Python, Java, C#, Node.js, PHP, Ruby, Rust, Scala, PL/SQL

ఫ్రేమ్‌వర్క్స్​- React, Angular, Next.js, Django, Express.js, Flutter, Laravel

ఏఐ అండ్​ ఎంఎల్​- Data Analytics, Autonomous Systems, LLMs, VLMs, Agentic AI, SLMs

క్లౌడ్ & నెట్‌వర్క్స్- Secure Cloud Computing, Edge Computing, IoT

DevSecOps- CI/CD pipelines, Docker, Kubernetes

జీఐఎస్​- ArcGIS, QGIS, Spatial Analysis, Geoprocessing

ఏపీఐలు- REST APIs, HTTP methods, JSON, XML formats

ఇండియన్​ ఆర్మీలో ఇంటర్న్​షిప్​- అర్హత ప్రమాణాలు..

BE/BTech (కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్, ఈసీఈ): ఫైనల్-ఇయర్ విద్యార్థులు లేదా గ్రాడ్యుయేట్లు.

ఎంటెక్​ (ఏఐ ఆండ్​ ఎంఎల్​, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్): చదువుతున్న లేదా పూర్తి చేసిన అభ్యర్థులు.

పీహెచ్​డీ స్కాలర్‌లు: ఏఐ అండ్​ ఎంఎల్​, DevSecOps, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ లేదా బిగ్ డేటాలో పనిచేస్తున్నవారు.

దరఖాస్తుదారులు iaip2025.dgis@gmail.com కు ఇమెయిల్ ద్వారా ఇతర వివరాలు తెలుసుకునేందుకు సంప్రదించవచ్చు.

ముఖ్య గమనిక: ఎంపిక ప్రక్రియ అకాడమిక్ నేపథ్యం, సాంకేతిక నైపుణ్యాలు, ప్రాజెక్ట్ రెలవెన్స్​ ఆధారంగా ఉంటుంది. కాబట్టి, ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More