Bank job alerts : నిరుద్యోగులు, బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కీలక అప్డేట్! ఇండియన్ బ్యాంక్ చేపట్టిన రిక్రూట్మెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. ఈ దఫా రిక్రూట్మెంట్లో 350 ఎస్ఓ (స్పెషలిస్ట్ ఆఫీసర్) పోస్టులను భర్తీ చేయనుంది ఈ ప్రభుత్వ రంగ సంస్థ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
- నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 8, 2026
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 8, 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2026

రాత పరీక్ష/ఇంటర్వ్యూ తేదీని బ్యాంకు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026- రిజిస్ట్రేషన్ ఇలా..
స్టెప్ 1- ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (indianbank.in)కి వెళ్లండి.
స్టెప్ 2- 'Careers' లేదా 'Recruitment' సెక్షన్‌లోకి వెళ్లండి.
స్టెప్ 3- 'Indian Bank SO Recruitment 2026' లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4- మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి.
స్టెప్ 5- దరఖాస్తు ఫారమ్‌లో వివరాలను నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 6- ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026- పోస్టులు..
ఈ 350 పోస్టుల్లో..
చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ).
సీనియర్ మేనేజర్: రిస్క్, ఫారెక్స్, ఫైనాన్స్.
డేటా అనలిస్ట్ అండ్ ఐటీ స్పెషలిస్ట్.
మేనేజర్: క్రెడిట్, ఫైనాన్స్, ఐటీ.
అసిస్టెంట్ మేనేజర్: సెక్యూరిటీ, సివిల్, ఆర్కిటెక్ట్
హెచ్ఆర్, మార్కెటింగ్ మేనేజర్.
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026- విద్యార్హత..
ఎంబీఏ / పీజీడీఎం (ఫైనాన్స్/ మార్కెటింగ్ / హెచ్ఆర్).
బీఈ / బీటెక్ / ఎంసీఏ / ఎంఎస్సీ (ఐటీ/సీఎస్).
{{/usCountry}}బీఈ / బీటెక్ / ఎంసీఏ / ఎంఎస్సీ (ఐటీ/సీఎస్).
{{/usCountry}}సీఏ / సీఎఫ్ఏ / ఐసీడబ్ల్యూఏ.
వీటితో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి!
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026- రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఇలా..
అప్లికేషన్ మెరిట్ బట్టి ఇంటర్వ్యూకి పిలుస్తామని ప్రభుత్వ ఆధారిత సంస్థ వెల్లడించింది. కాగా, ఒక వేళ అప్లికేషన్లు ఎక్కువగా ఉంటా రాతపరీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉందని తెలియజేసింది.
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026- నెలవారీ వేతనం..
ఈ ఇండియన్ బ్యాంక్ ఎస్ఓ రిక్రూట్‌మెంట్ 2026లో ఎంపికైన వారికి నెలవారీ జీతాలు ఈ విధంగా ఉంటాయి.
స్కేల్ 1- రూ. 48,480 – రూ. 85,920
స్కేల్ 2- రూ. 64,820 – రూ. 93,960
స్కేల 3- రూ. 85,920 – రూ. 1,05,280
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026- రిజిస్ట్రేషన్ ఫీజు..
ఈ దఫా ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026 కోసం..
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ: రూ. 175
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: రూ. 850
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ని చూడాల్సి ఉంటుంది.