చాలా కాలం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కమ్ బ్యాక్ ఊహించినట్లుగా జరగలేదు. వర్షం, ఆస్ట్రేలియా బౌలర్లు కలిసి టీమిండియాను దెబ్బకొట్టారు. దీంతో ఆదివారం పెర్త్ లో జరుగుతున్న తొలి వన్డేలో ఇండియా బ్యాటింగ్ లో తడబడింది. 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులే చేసింది.
వర్షం దెబ్బ

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ వన్డేకు వర్షం దెబ్బ పడింది. రెండు సార్లు ఆటకు అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్ కు 50 ఓవర్ల పాటు జరగాల్సిన ఆటను 26 ఓవర్లకు కుదించారు. మబ్బు పట్టిన పరిస్థితుల్లో పెర్త్ పిచ్ పై ఆసీస్ బౌలర్లు చెలరేగి భారత్ ను గట్టి దెబ్బ కొట్టారు.
వికెట్లు ఢమాల్
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. హేజిల్ వుడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ కునెమన్ తలో రెండు వికెట్లతో ఇండియాను కుప్పకూల్చారు. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత మైదానంలోకి వచ్చారు.
రోహిత్, కోహ్లి ఫెయిల్
కమ్ బ్యాక్ లో రోహిత్, కోహ్లి ఫెయిలయ్యారు. శుభ్ మన్ గిల్ తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ 8 పరుగులే చేశాడు. అతణ్ని హేజిల్ వుడ్ ఔట్ చేశాడు. ఇక 8 బంతులాడిన విరాట్ కోహ్లి సున్నాకే డకౌటయ్యాడు. స్టార్క్ బాల్ కు బలయ్యాడు కోహ్లి. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (11) కూడా ఫెయిలయ్యారు.
అక్షర్, రాహుల్ పోరాటం
45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఆ దశలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) పోరాడారు. ఈ జోడీ ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలబడింది. వీళ్ల పుణ్యామా అని టీమ్ స్కోరు 100 దాటగలిగింది. కానీ చివర్లో మళ్లీ టపటపా వికెట్లు పడ్డాయి. చివరకు టీమ్ 136 పరుగులే చేసింది.
నితీశ్ డెబ్యూ
{{/usCountry}}45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఆ దశలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) పోరాడారు. ఈ జోడీ ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలబడింది. వీళ్ల పుణ్యామా అని టీమ్ స్కోరు 100 దాటగలిగింది. కానీ చివర్లో మళ్లీ టపటపా వికెట్లు పడ్డాయి. చివరకు టీమ్ 136 పరుగులే చేసింది.
నితీశ్ డెబ్యూ
{{/usCountry}}ఈ మ్యాచ్ తో తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వన్డేల్లో డెబ్యూ చేశాడు. ఇప్పటికే ఇండియా తరపున 9 టెస్టులు, 4 టీ20లు ఆడిన ఈ విశాఖ పేస్ ఆల్ రౌండర్ ఇప్పుడు వన్డేల్లోకి వచ్చేశాడు. ఇండియా తరపున మూడు ఫార్మాట్లలోనూ మ్యాచ్ లాడాడు. ఆస్ట్రేలియాతో వన్డేలో 11 బంతులాడిన నితీశ్ కుమార్ రెడ్డి 19 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరోవైపు ఇది రోహిత్ శర్మకు 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.