టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా అదరగొట్టింది. సూపర్ 8లో తన లాస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ ను ఓడించి సెమీఫైనల్ కు అర్హత సాధించింది. ఆదివారం (మార్చి 1) రాత్రి ముగిసిన ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ హీరో. అమేజింగ్ బ్యాటింగ్ తో జట్టును గెలిపించాడు. దీంతో శాంసన్ కు కెప్టెన్ సూర్యకుమార్ తలవంచిన వీడియో వైరల్ గా మారింది.
శాంసన్ కోసం సూర్య

ఆదివారం రాత్రి ముగిసిన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ పోరు ఉత్కంఠ రేకెత్తింది. ఈ మ్యాచ్ లో ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 196 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 97 రన్స్ తో నాటౌట్ గా నిలిచి భారత్ ను గెలిపించాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత శాంసన్ డగౌట్ వైపు వెళ్లే క్రమంలో కెప్టెన్ సూర్యకుమార్ చేసిన ఓ పని నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది.
ప్రతి ఇండియన్
టీమ్ ను గెలిపించిన తర్వాత మిక్స్ డ్ ఎమోషన్లతో పెవిలియన్ వైపు కదిలిన సంజు శాంసన్ కు కెప్టెన్ సూర్యకుమార్ సహా టీమ్ మెంబర్స్ ఎదురుగా వచ్చారు. ముందుగా వచ్చిన సూర్యకుమార్ తన టోపీ తీసి తల వంచాడు. శాంసన్ కోసం టేక్ ఏ బో గెస్చర్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ సమయంలో సూర్య చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ సమయంలో ప్రతి ఇండియన్ ఫీలింగ్ అదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.
శాంసన్ ది హీరో
అసలు టీమ్ లో ప్లేస్ లేని పొజిషన్ నుంచి ఇప్పుడు ఇండియా హీరోగా మారాడు శాంసన్. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ లో ఉండటంతో టీ20 ప్రపంచకప్ కోసం అభిషేక్ తో కలిసి అతణ్ని ఓపెనర్ గా ఆడించారు. దీంతో శాంసన్ కు టీమ్ లో ప్లేస్ దక్కలేదు. ఈ పొట్టి కప్ లో ఫస్ట్ మ్యాచ్ లో అమెరికాపై అభిషేక్, ఇషాన్ ఓపెనింగ్ చేశారు.
అభిషేక్ దూరం
{{/usCountry}}అసలు టీమ్ లో ప్లేస్ లేని పొజిషన్ నుంచి ఇప్పుడు ఇండియా హీరోగా మారాడు శాంసన్. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ లో ఉండటంతో టీ20 ప్రపంచకప్ కోసం అభిషేక్ తో కలిసి అతణ్ని ఓపెనర్ గా ఆడించారు. దీంతో శాంసన్ కు టీమ్ లో ప్లేస్ దక్కలేదు. ఈ పొట్టి కప్ లో ఫస్ట్ మ్యాచ్ లో అమెరికాపై అభిషేక్, ఇషాన్ ఓపెనింగ్ చేశారు.
అభిషేక్ దూరం
{{/usCountry}}కడుపు నొప్పితో నమీబియాతో మ్యాచ్ కు అభిషేక్ దూరమయ్యాడు. దీంతో శాంసన్ కు ఛాన్స్ వచ్చింది. కానీ 22 రన్స్ చేసి ఔటైపోయాడు. అభిషేక్ కోలుకొని రావడంతో శాంసన్ కు మళ్లీ టీమ్ లో చోటు దక్కలేదు. అయితే అపోనెంట్ టీమ్స్ ఫస్ట్ ఓవర్లోనే ఆఫ్ స్పిన్నర్ తో ఓపెనర్లకు ట్రాప్ సెట్ చేస్తుండటంతో సూపర్ 8లో జింబాబ్వేతో మ్యాచ్ కోసం రైట్ హ్యాండర్ శాంసన్ కు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.
జింబాబ్వేతో మ్యాచ్ లో శాంసన్ 24 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో డూ ఆర్ డై మ్యాచ్ శాంసన్ కు కూడా డూ ఆర్ డైగా మారింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. తన కెరీర్ ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడాడు.