ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తాము కూడా ప్రతీకార దాడులు చేయబోతున్నామని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. దీంతో ఆయా దేశాల్లోలని పౌరులు భయాందోళన పరిస్థితుల మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరీ జారీ చేశాయి. అనవసర ప్రయాణాలు చేయవద్దంటూ భారత పౌరులను హెచ్చరించాయి.
జాగ్రత్తగా ఉండాలి - భారత ఎంబసీ

అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాలతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ లోని భారత రాయబార కార్యాలయాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని…. స్థానిక అధికారులు జారీ చేసిన సలహాలను జాగ్రత్తగా పాటించాలని కోరాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని భారత రాయబార కార్యాలయం పేర్కొన్న వివరాల ప్రకారం… "అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అప్రమత్తంగా ఉండాలి. యుఎఇ అధికారులు మరియు రాయబార కార్యాలయం జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు మరియు సలహాలను పాటించాలి" అని కోరింది.
అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ యథాతథంగా పనిచేస్తున్నాయి. టోల్ ఫ్రీ నంబర్ (800-46342), వాట్సాప్ నంబర్ (971543090571) తో పాటు అత్యవసర సందర్భాల్లో అక్కడ ఉన్న భారతీయ పౌరులను సంప్రదించడానికి రెండు ఇమెయిల్ ఐడిలను (pbsk.dubai@mea.gov.in మరియు ca.abudhabi@mea.gov.in) అందుబాటులోకి తీసుకువచ్చారు.
సౌదీ అరేబియాలోని భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని…. దేశంలో ప్రబలంగా ఉన్న భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని రియాద్ లోని భారత రాయబార కార్యాలయం కోరింది. 00-966-11-4884697, 00-966-542126748 (వాట్సాప్ మాత్రమే), 800 247 1234 (టోల్ ఫ్రీ mea.gov.in) నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సూచించింది.
“ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా… జోర్డాన్‌లోని భారతీయ పౌరులు మరియు పర్యాటకులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఫోన్ నంబర్ (00962-770 422 276) ను సంప్రదించండి” అని జోర్డాన్ లోని భారత ఎంబసీ కార్యాలయం సూచించింది.
విమాన ప్రయాణాలపై ఎఫెక్ట్…!
{{/usCountry}}“ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా… జోర్డాన్‌లోని భారతీయ పౌరులు మరియు పర్యాటకులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఫోన్ నంబర్ (00962-770 422 276) ను సంప్రదించండి” అని జోర్డాన్ లోని భారత ఎంబసీ కార్యాలయం సూచించింది.
విమాన ప్రయాణాలపై ఎఫెక్ట్…!
{{/usCountry}}ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణాలకు భారీ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు హెచ్చరించారు. భద్రతా కారణాల దృష్ట్యా పలు విమానయాన సంస్థలు తమ మార్గాలను మార్చుకోవడం లేదా సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని విదేశాలకు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని విమానాశ్రయం అడ్వైజరీ సూచించింది. ఢిల్లీ విమానాశ్రయం నుండి యూరప్, అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే ప్రయాణికులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.