...
...
Next Story

Indian Navy : ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ అప్డేట్- అప్లికేషన్ గడువు పొడిగింపు..

Indian Navy Agniveer apprentice 2026 : ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్ నియామక ప్రక్రియ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును 2026 జులై 5 వరకు పొడిగించారు. డిప్లొమా అర్హత ఉన్న అవివాహిత పురుషులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jun 29, 2026, 09:08:55 IST
Advertisement

దేశసేవ చేయాలనే సంకల్పంతో పాటు భారత నౌకాదళంలో పనిచేయాలని యోచిస్తున్న యువతకు ఇండియన్ నేవీ కీలక ప్రకటన చేసింది. 'అగ్నివీర్ అప్రెంటిస్' (01/2027, 02/2027 బ్యాచ్‌లు) పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పెంచుతున్నట్టు వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు జులై 05, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ నేవీ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..
ఇండియన్ నేవీ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసిన అవివాహిత పురుష అభ్యర్థులను నేవీ ఆహ్వానిస్తోంది. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా, సర్వర్ సమస్యలు తలెత్తక ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్ 2026- అర్హత ప్రమాణాలు ఇవే..

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు ఏఐసీటీఈ ఆమోదించిన పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

మెకానికల్, మెరైన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటోమొబైల్, మెకట్రానిక్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ వంటి అనుబంధ విభాగాల్లో డిప్లొమా చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.

ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్ 2026- వయోపరిమితి వివరాలు..

రెండు వేర్వేరు బ్యాచ్‌ల కోసం ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. కాబట్టి బ్యాచ్‌ను బట్టి పుట్టిన తేదీ నిబంధనలు మారుతాయి.

02/2027 బ్యాచ్: అభ్యర్థులు మే 1, 2005 నుంచి అక్టోబర్ 31, 2009 మధ్య జన్మించి ఉండాలి.

ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్ 2026- ఎంపిక విధానం..

ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్ 2026 కోసం అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (ఐనెట్ 2/2026) నిర్వహిస్తారు. ఈ పరీక్ష 2026 ఆగస్టులో జరిగే అవకాశం ఉంది. ఇందులో మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, సైన్స్, మ్యాథమెటిక్స్, అలాగే అభ్యర్థి చదివిన డిప్లొమా సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

మొదటి దశలో అర్హత సాధించిన వారిని రెండో దశకు పిలుస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మరో రాత పరీక్ష, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. శారీరక సామర్థ్య పరీక్షలో భాగంగా అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల పరుగును 6 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి. అలాగే 20 స్క్వాట్స్ (ఉఠక్ బైఠక్), 15 పుష్-అప్స్, 15 బెండ్-నీ సిట్-అప్స్ తీయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్టుపై కూడా ఇప్పటి నుంచే దృష్టి పెట్టడం మంచిది.

ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్ 2026- దరఖాస్తు విధానం..

  • మొదట ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ను సందర్శించండి.
  • అప్రెంటిస్ విభాగంలో ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే, మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయండి.
  • మీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
  • 'Agniveer (Apprentice) INET 2/2026' అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • దరఖాస్తు రుసుము రూ. 550తో పాటు 18% జీఎస్టీని ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించండి.
  • అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ లేదా సేవ్ చేసుకోండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks