దేశ రక్షణ రంగంలో చేరాలనుకునే యువతకు భారత నౌకాదళం గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. అగ్నివీర్ పథకం కింద అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, ఎంఆర్, మెడికల్ సెయిలర్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక విధానాన్ని ఇక్కడ తెలుసుకోండి.
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రారంభం: మార్చి 14, 2026
చివరి తేదీ: ఏప్రిల్ 6, 2026
(అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.)
దరఖాస్తు సవరణ : ఏప్రిల్ 10, 11 తేదీల్లో అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీ : మే 2026 (తాత్కాలికం)
ఫలితాల విడుదల: జూన్ 2026
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- పోస్టుల వారీగా విద్యా అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
అగ్నివీర్ ఎంఆర్ : 10వ తరగతి ఉత్తీర్ణత.
అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ : ఇంటర్మీడియట్ (12వ తరగతి)లో గణితం, భౌతికశాస్త్రం చదివి ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు కూడా అర్హులే.
అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (మెడికల్): ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (పీసీబీ) సబ్జెక్టులు కలిగి ఉండాలి.
గమనిక: వయోపరిమితి ఒక్కో పోస్టుకు భిన్నంగా ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడాలని సూచించడమైనది.
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- ఎంపిక విధానం..
నౌకాదళంలో ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకమైన, కఠినమైన దశల్లో జరుగుతుంది.
{{/usCountry}}నౌకాదళంలో ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకమైన, కఠినమైన దశల్లో జరుగుతుంది.
{{/usCountry}}దశ-1 (ఐఎన్ఈటీ): కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
షార్ట్‌లిస్టింగ్: రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని తదుపరి దశకు ఎంపిక చేస్తారు.
దశ-2 (పీఎఫ్‌టీ): శారీరక సామర్థ్య పరీక్షలు. ఇందులో రన్నింగ్, స్క్వాట్స్, పుష్-అప్స్, సిట్-అప్స్ ఉంటాయి.
రాత పరీక్ష అండ్ వైద్య పరీక్ష: ఫిజికల్ టెస్ట్ అనంతరం మరో రాత పరీక్ష, సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
శిక్షణ: తుది మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ఇస్తారు.
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- దరఖాస్తు చేయడం ఎలా?
ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు: రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది.
పురుషులు, మహిళా అభ్యర్థులు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
భారత నౌకాదళంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి.